ఈ విజయం నా తండ్రికే: నటి రమ్య
బెంగళూర్: తనను గెలిపించిన ప్రజలకు కన్నడ నటి రమ్య అలియాస్ దివ్య స్పందన కృతజ్ఝతలు తెలిపారు. మాండ్యా లోకసభ స్థానం నుంచి ఆమె ఉప ఎన్నికల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయం తన తండ్రి ఆర్‌టి నారాయణకు అంకితమని చెప్పారు. ఆగస్టు 2వ తేదీ మాండ్యా లోకసభ స్థానం నుంచి పోటీకి నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతుండగా నారాయణ గుండెపోటుతో మరణించారు.
తన అభిప్రాయాలను ట్విట్టర్‌లో చురుగ్గా వెల్లడించే రమ్య గత నెల రోజులుగా ఏమీ రాయలేదు. ఉప ఎన్నికలు ప్రారంభమైన తర్వాత నెల రోజుల పాటు ఆమె ట్విట్టర్‌కు దూరంగా ఉన్నారు. ఉప ఎన్నికల ఫలితాలు వెలువడగానే శనివారం ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఈ విషయం తన తండ్రికి అంకితమని, తనకు ఓటు వేసి విజయాన్ని అందించిన ప్రజలందరికీ కృతజ్ఝతలని ఆమె ట్విట్టర్‌లో రాశారు. తన పట్ల చూపిన అనురాగానికి, మద్దతు ఆమె ధన్యవాదాలంటూ ట్వీట్ చేసింది.
ఎన్నికల్లో దిగడానికి ముందు చివరి కాటరి వీర సురసుందరాంగి సినిమాలో కనిపించింది. దిల్ కా రాజా, నీర్ దోసే, ఆర్యన్‌లతో పాటు కోడి రామకృష్ణ దర్శకత్వంలోని పేరు పెట్టని సినిమాలో నటించడానికి అంగీకరించారు. వాటిలో కొన్ని సినిమాల్లో అప్పుడే నటించడం మొదలు పెట్టారు.


Click it and Unblock the Notifications











