»   » వందేళ్ళ దేవదాసుకి సినివారం నీరాజనం: ఈవారం సినివారం

వందేళ్ళ దేవదాసుకి సినివారం నీరాజనం: ఈవారం సినివారం

Posted By:
Subscribe to Filmibeat Telugu

దేవదాసు విఫలమో సఫలమో ఇదమిద్దంగా చెప్పలేని ఒక విషాద గాథ, ప్రపంచ ప్రసిద్ద ప్రేమ కథల్లో చోటు సంపాదించిన ఒక అత్యద్బుతమైన రచన. బెంగాలీ భాషలో ఉన్నా, ఇది తెలుగువారికథే అనిపించేలా సహజత్వానికి దగ్గరగా నవలలు రాసిన ప్రముఖుల్లో ఒకరు శరత్‌చంద్ర ఛటోపాధ్యాయ అనబడే 'శరత్‌బాబు'. దేవదాసు, పార్వతీ ఈ లోకం లోకి అడుగుపెట్టి ఆ అద్బుత కథ నిజంగా జరిగిందనే అనిపించేలా మనమధ్య ఇంకా జీవించబట్టీ 2 జూలై 2017 నాటికి 100 సంవత్సరాలయ్యింది... ఈ వందో పుట్టిన రోజునాడు ఆ ప్రేమికులకీ, రచనకీ, రచయితకీ ఒక్క కృతఙ్ఞత చెల్లించుకోవటం తప్ప మరేం చేయగలం..? దేవదాసు సినిమా గురించి చెబుతూ ఇలా అన్నారు మామిడి హరికృష్ణ.

This Week in sinivaram 2 July 2017

మరణకాలాన లలాటం పై ఒక్క అరచేతి స్పర్శని కోరుకున్న దేవదాసూ, ప్రేమకీ, భాధ్యతకీ, కట్టుబాట్లకీ మధ్య తన అస్తిత్వాన్ని నిలుపుకున్న పార్వతికీ, ఈ ఇద్దరితోనూ ఏ సంబంధమూ లేకుందానే వారి ప్రేమలో తన అస్థిత్వాన్నే త్యాగం చేసిన చంద్రముఖికీ ఆఖరున వీళ్ళందరినీ మన గుండెల్లో నిలిపిన శరత్ చంద్రుడికీ మరేమివ్వగలరూ... మళ్ళీ ఒకసారి ఆ మహా ప్రేమగాథని మననం చేసుకోవటం, శరత్ చంద్రునికో నమస్కారం చేసుకోవటం తప్ప... సినీవారం వేదిక అదే చేసింది. ఆ ప్రేమకథని మళ్ళీ ఒకసారి కళ్ళముందు నిలుపుకుంది...

This Week in sinivaram 2 July 2017

తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించే సినివారం కార్యక్రమంలో ఈ వారం (2జూలై 2017) న బెంగాలీ రచయిత శరత్ చంద్ర చట్టోపాధ్యాయ రచించిన నవల దేవదాసుకు వందేళ్ళు నిండిన సంధర్భంగా, అదే రోజున తెలంగాణా సీనియర్ నటుడూ, రచయితా, దర్శకుడూ ఎం.ప్రభాకర రెడ్డి జయంతి సందర్భంగా. ఆ ఇద్దరు మహానుభావులకీ నివాళులు అర్పించిన అనంతరం మామిడి హరికృష్ణ. దేవదాసు నవలమీద, ఆ సినిమా మీదా ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో భాషా సాంస్కృతిక శాఖా సంచాలకులు మామిడి హరికృష్ణ గారితో పాటు, అతిథిగా వచ్చిన రాజేంద్ర ప్రసాద్ యలవర్థి, సినివారం గ్రూప్ అక్షరా కుమార్, హుమాయూన్ సంఘీర్, ఎం ఎస్ విష్ణు, శివకట్టా, మహేష్ బాబు పాల్గొన్నారు...

English summary
"Sinivaram" a movie Hub for filim makers and Movie lovers, conducted by Telangana languege and cultur dipartment at Ravindra bharati. this week screanned the Movie Devdas by Sarat chandra.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu