»   »  ఈ వారం సినివారంలో: చిన్నసినిమాలకు పెద్ద అడ్డా రవింద్ర భారతి

ఈ వారం సినివారంలో: చిన్నసినిమాలకు పెద్ద అడ్డా రవింద్ర భారతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

శనివారం ఇప్పుడు సినీవారమైంది... తెలంగాణా యువ ఫిలిమ్ మేకర్లకు ఒక ఐడియా షేర్ సెంటర్ గా మారింది రవీంద్ర భారతి. ఇక్కడ ప్రతీ శనివారం సాయంత్రం షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీల ప్రదర్శనా జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఆలోచన తో రూపు దిద్దుకున్న ఈ ప్రోగ్రాం ఇప్పుడు ఔత్సాహిక మూవీ మేకర్లకూ, సినీ ప్రేమికులకూ ఒక హబ్ గా తయారయ్యింది. టాలీవుడ్ లో దర్శకులు, నటులు, ఇంకా మిగతా డిపార్ట్మెంట్లలో తమదంటూ ఒక స్థానం కోసం కలలుకనే ప్రతీ ఒక్కరికీ శనివారం వచ్చిందంటే చాలు రవీంద్రభారతి గమ్యస్థానం అవుతోంది....

మామిడి హరికృష్ణ

మామిడి హరికృష్ణ

మామిడి హరికృష్ణ గారి తో పాటు సినివారం కార్యక్రమాన్ని తమ భుజాల మీద వేసుకుని అక్కడి పనులన్నీ చేసే సతీష్ అట్ల, నరెందర్ గౌడ్, సంఘీర్, అక్షరా కుమార్, వుష్ణు, శివ కట్టా, మహేష్ బాబు.. ఇలా ఈ కుర్రాళ్ళంతా సినిమా అనే కళకోసం ఇక్కడికి చేరేవారే... ప్రతీ సినిమా ప్రదర్శణ చూడటానికి వచ్చే దర్శకులని కలవటానికి అవకాశాలకోసం వెతుక్కునే వారొస్తే, అక్కడికి వచ్చే నటుల్లో తమకు కావాల్సిన నటులూ, టెక్నీషియన్లూ దొరకొచ్చని దర్శకులూ వస్తారు.. పెళ్ళి చూపులు తో ఇండస్ట్రీలో నిలబడ్డ తరుణ్ భాస్కర్, అప్పట్లో ఒకడుండేవాడు తో వచ్చిన సాగర్ చంద్ర, ఘాజీ తో బాలీవుడ్ లో కూడా జండా ఎగరేసిన సంకల్ప్ రెడి ఇలా చెప్పల్సి వస్తే పెద్ద లిస్టే ఉంటుంది మరి.... ఈ అందర్నీ ఒకదగ్గరికి చేర్చే హబ్ రవీంద్రభారతి, సినివారం.

సినివారం

సినివారం

ఈ 24 న వారం సినివారం లో శ్రీ డా. కావూరి శ్రీనివాస్ రచన, దర్శకత్వంలో రూపొందిన "మెదక్ జిల్లా పరిశోధనాత్మక చిత్రం"డాక్యుమెంటరి ప్రదర్శన జరిగింది. ఈ డాక్యుమెంటరికి శ్రీ అడుసుమిల్లి కళ్యాణ్ బాబు నిర్మాత. 3500 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న మెదక్ జిల్లా పై పరిశోధన చేసి రూపొందించిన డాక్యుమెంటరి ద్వారా ప్రేక్షకులకు మెదక్ జిల్లాకి ఉన్న గత చరిత్ర, ప్రస్తుత విశేషాలు తెలిసేలా రూపొందించారు.

మెదక్ జిల్లా డాక్యుమెంటరి

మెదక్ జిల్లా డాక్యుమెంటరి

మెదక్ జిల్లా పై పరిశోధనాత్మక డాక్యుమెంటరి రూపొందించిన దర్శకులు డా. కావూరి శ్రీనివాస్ మాట్లాడుతూ 2009లో ఈ డాక్యుమెంటరి తీసామని, ఇక్కడ ప్రదర్శనకు అవకాశమిచ్చిన హరికృష్ణగారికి ధన్యవాదలు తెలిపారు. ఇంకా కొన్ని ఇతర జిల్లాల పై పరిశోధనలు జరుపుతున్నానని గుర్తు చేశారు.

LMD కాలని బైపాస్ రోడ్

LMD కాలని బైపాస్ రోడ్

సతీష్ అక్కినపల్లి రచన, దర్శకత్వంలో రూపొందిన "LMD కాలని బైపాస్ రోడ్" సినిమా కూడా ప్రదర్శించబడింది. ఈ సినిమా నిర్మాత బైర్నేని రవి ప్రసాద రావు. ఈ సినిమాకి అల్లే మధుబాబు పాటలు, రమణ కానూరి సంగీతం అందించారు. ఒకే కాలనికి చెందిన నలుగురికి అనుకోకుండా దొరికిన డబ్బు వాళ్ళ జీవితాల్లో తెచ్చిన అనూహ్యమైన మార్పులు అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. అందరూ కొత్తవాళ్ళతోనే కేవలం పది రోజుల్లో తమ సినిమాను తామే నిర్మించుకుందీ యువ బృందం.

తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు

తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు

కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డా. నందిని సిధారెడ్డి గారు మాట్లాడుతూ "కవి కంటే ముందు సినిమా ప్రేమికుడిని" అని అన్నారు. శనివారంని సినివారంగా మార్చి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న హరికృష్ణగారు యువ ఫిల్మ్ మేకర్స్ ని ఒక గూటికి చేర్చి వారిలో ఉన్న సినిమా సృజనాత్మకతని వెలికి తీసే ప్రయత్నం చేయడం అభినందనీయమని, తొలిసారిగా వచ్చాను కానీ ఇంతమంది యువ సినీ ప్రేమికులని చూడటం సంతోషంగా ఉందని, ఈ "సినివారం వేదిక మంచి సినిమాలకు కేంద్రం కావడం, ఇది యువదర్శకులకు ప్రోత్సాహకంగా ఉండటం గొప్ప విషయమని అన్నారు.

దర్శకులు

దర్శకులు

ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు దయానంద రెడ్డి, ప్రముఖ కవి సిద్దార్థ, నటులు వైభవ్ సూర్య, సినిమా దర్శకులు, నిర్మాత, రచయిత, నటీనటులు, అలాగే ఈ సినిమా సాంకేతిక నిపుణులు, వారి కుటుంబ సభ్యులు, ఔత్సాహిక యువ ఫిల్మ్ మేకర్స్, సినీ ప్రేమికులు పలువురు పాల్గొన్నారు.

English summary
"Sinivaram" a movie Hub for filim makers and cini lovers conducted by Telangana languege and cultur dipartment at Ravindra bharati
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu