'సర్దార్ ' తౌబా తౌబా సాంగ్: దేవిశ్రీ ప్రసాద్ ఆ సాంగ్ నుంచి కాపీ కొట్టాడా?
హైదరాబాద్: ఇంతకు ముందు రోజులు కాదు..ఏదైనా ఓ పాట, ఓ సీన్ మార్కెట్ లోకి, ధియోటర్ లోకి వచ్చిందంటే దాన్ని ఆశ్వాదించటం మానేసి...దానికి మూలం ఏమిటా అని పరిశోధనలు మొదలెట్టేస్తున్నారు. అలా... తాజాగా విడుదలైన సర్దార్ గబ్బర్ సింగ్ లోని తౌబా తౌబా సాంగ్ కాపీ అని తేల్చారు. ఆ విషయం తెలియచేస్తూ వీడియోని సైతం వదిలారు.
కాపీ పరిశోధకులు తేలుస్తున్న దాన్ని బట్టి ఈ పాట...బాలీవుడ్ లోని ఓ చిత్రం సాంగ్ నుంచి లేపేసారంటూ ఆధారాలు చూపెడుతున్నారు. ఇంతకీ మీకు కాపీ అనిపించిందా..లేక కేవలం ఈ పాటను అన్ పాపులర్ చేయటానికి చేస్తున్న ప్రయత్నం అనిపిస్తుందా...క్రింద కామెట్లలో పంచుకోండి.

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, కాజల్ జంటగా నటించిన చిత్రం 'సర్దార్ గబ్బర్‌సింగ్'. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ వీడియోలో కాజల్ యువరాణి పాత్రలో కనపడింది.
పవన్‌కల్యాణ్ తన పవర్‌ని చూపిస్తూ... విలన్‌తో సింగిల్‌గా పోరాడడానికి సిద్ధమయ్యారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శరత్ మరార్, సునీల్ లుల్లా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 8న 'సర్దార్ గబ్బర్‌సింగ్' ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.


Click it and Unblock the Notifications











