»   » "తొడరి" ట్రైలర్ అదిరిపోయింది : తెలుగులోనూ దుమ్మురేపటం ఖాయం

"తొడరి" ట్రైలర్ అదిరిపోయింది : తెలుగులోనూ దుమ్మురేపటం ఖాయం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పుడు సౌత్ ఇండియన్ బ్రూస్లీగా పిలిపించుకున్న ధనుష్ కి ఇప్పుడు కొత్తగా ఇంకో ట్యాగ్ వచ్చింది అదేంటో తెలుసా..? ఇళయ సూపర్ స్టార్ (యంగ్ సూపర్ స్టార్) , ధనుష్, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ చిత్రం "తొడరి". ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా . ఆడియో, ట్రైలర్ సోమవారం రొజున చెన్నైలో విడుదలయ్యాయి

ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన పార్తిబన్, ఎస్.థాను వంటి తమిళ సినీ ప్రముఖులు ధనుష్‌ని "ఇలయ సూపర్‌స్టార్‌" అంటూ సంబోదించటంతో ఒక్కసారిగా ప్రాంగణం మొత్తం ధనుష్ అభిమానుల కేరింతలతో దద్ధరిల్లిపోయింది. "ఇలయ సూపర్‌స్టార్‌"..... "ఇలయ సూపర్‌స్టార్‌"...... అని పదేపదే అంటూ ఊగిపోయారు ధనుష్ ఫ్యాన్స్...

రైలు ప్రయాణం రూపొందుతున్న ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతం అందించారు. ఈ సందర్భంగా దర్శకుడు ప్రభుసాల్మన్ మాట్లాడుతూ, "ధనుష్‌తో సినిమా తీయాలని చాలా ఉత్సాహంగా ఎదురుచూశాను. "తొడరి"తో ఆ కోరిక నెరవేరింది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. కదులుతున్న రైలులో షూటింగ్‌ చేయడంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా విజయవంతంగా షూటింగ్‌ పూర్తి చేయగలిగామంటే మా యూనిట్‌ కఠిన శ్రమే కారణం. ఈ సందర్భంగా వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెబుతున్నాను. మా కష్టం తెరపై ఫలిస్తుందన్న నమ్మకం ఉంది' అన్నారు.

తొడరి ట్రైలర్ ఇక్కడ చూడండి

ధనుష్‌ మాట్లాడుతూ, 'కదులుతున్న రైలులో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాలంటేనే చాలా కష్టం. అటువంటి ఒక సినిమా మొత్తాన్ని రైలులోనే తీయడం మాటలు కాదు. ఈ సినిమా కోసం నేను పెద్దగా కష్టపడలేదనే చెబుతాను. ఎందుకంటే ఆ కష్టమంతా దర్శకుడు ప్రభుసాల్మన్ భరించారు. ఈ చిత్రంలో నాకంటే కీర్తి పాత్రే పెద్దది. ఆ రోల్‌లో ఆమె అద్భుతంగా నటించింది" అంటూ దర్శకున్నీ హీరోయిన్ నీ ఆకాసానికి ఎత్తేసాడు.

ఇక రజనీ కాంత్ లాగానే ప్రతీ ప్రసంగం చివరనా... అభిమనులకోసమే కొన్ని మటలు చెప్పతం పాటిస్తున్నాడు ధనుష్. ఈ సభలోనూ అభిమానులనుద్దేశించి మాట్లాడుతూ... "మిగతా విషయాన్నింటికంటే మొదట కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వండి. మన జీవితంలో ఎన్నో వస్తాయి, పోతాయి. కానీ, కుటుంబం ఒక్కటే మన జీవితాంతం ఉంటుంది" అని చెప్పి అందరి మనసులనీ మరోసారి గెలుచుకున్నాడు ధనుష్.

తర్వాత హాలీవుడ్ ఎంట్రీ విశయం మీద స్పందిస్తూ "ముందు వెట్రిమారన్ తో సినిమా పూర్తి చేయాలి. ఆ తరువాతే హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ సంగతి ఆలోచించేది" అంటూ విలేకరుల ప్రశ్నకు బదులిచ్చారు. సినిమా ట్రైలర్ మాత్రం అద్బుతంగా ఉంది. మహిళా తీవ్రవాదిగా కీర్తి సురేష్ పాత్ర ఉంటే, ప్యాంట్రీ ఉద్యోగిగా ధనుష్ కనిపిస్తాడు.

ఆడియో ఆవిష్కరణ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్‌లో తొలి షాట్‌లోనే కీర్తిని లేడీ టెర్రరిస్ట్‌గా పేర్కొంటూ వార్తలు చెప్పే సన్నివేశం ఉంది. ఢిల్లీ నుంచి చెన్నైకి వచ్చే ఎక్స్‌ప్రెస్‌ రైలులో టెర్రరిస్టుల తో పాటు జరిగే ప్రయాణం నేపథ్యం లో సూపర్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది.

తొడరి ఆడియో ట్రైలర్ రిలీజ్:

తొడరి ఆడియో ట్రైలర్ రిలీజ్:

సూపర్ స్టార్ అల్లుడు ధనుష్, కీర్తీ సురేష్ జంటగా రూపొందిన సినిమా "తొడరి". ఈ సినిమా ఆడియో, ట్రైలర్ రిలీజ్ నిన్న చెన్నైలో జరిగింది.

"తొడరి" ట్రైలర్ అదిరిపోయింది : తెలుగులోనూ దుమ్మురేపటం ఖాయం

ఈ చిత్రం దర్శకుడు ప్రభు సాల్మన్ స్వీయానుభవం అట. ఒకసారి ఆయన నైవేలి నుంచి ఘజియాబాద్ కి రెండు రోజుల పాటు ప్రయాణం చేశాడట. ఆ సమయంలో తనకి ఎదురైన సంఘటనలు .. పరిచయమైన వ్యక్తులు ఒక జ్ఞాపకంగా మిగిలిపోయారట. ఆ సంఘటనల సమాహారంగానే ఈ కథను రెడీ చేసి తెరకెక్కించడం జరిగిందని ఆయన అన్నాడు

ధనుష్ కి జతగా కీర్తి సురేష్

ధనుష్ కి జతగా కీర్తి సురేష్

ధనుష్ కి జతగా కీర్తి సురేష్ మొదటిసారి నటిస్తోంది. వీరిద్దరి మధ్యా కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యిందనీ. సినిమాకి ఈ జంట మధ్య సాగే ప్రేమకథ మంచి ప్లస్ కానుందనీ టాక్.

ధనుష్

ధనుష్

ఒకప్పుడు సౌత్ ఇండియన్ బ్రూస్లీగా పిలిపించుకున్న ధనుష్ కి ఇప్పుడు కొత్తగా ఇంకో ట్యాగ్ వచ్చింది అదేంటో తెలుసా..? ఇలయ సూపర్ స్టార్ (యంగ్ సూపర్ స్టార్) అట. కార్యక్రమానికి అతిథులుగా హాజరైన పార్తిబన్, ఎస్.థాను వంటి తమిళ సినీ ప్రముఖులు ధనుష్‌ని "ఇళయ సూపర్‌స్టార్‌" అంటూ సంబోదించటంతో ఒక్కసారిగా ప్రాంగణం మొత్తం ధనుష్ అభిమానుల కేరింతలతో దద్ధరిల్లిపోయింది..

ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారట

ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారట

కదులుతున్న రైలులో షూటింగ్‌ చేయడంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. హీరోహీరోయిన్ లు కదులుతున్న రైలి పైన తిరగటం కొన్ని యాక్షన్ సన్ని వేశాల్లోనూ. చాలానే ఇబ్బందులు పడ్డారట.

సినిమా ట్రైలర్ మాత్రం అద్బుతంగా ఉంది.

సినిమా ట్రైలర్ మాత్రం అద్బుతంగా ఉంది.

మహిళా తీవ్రవాదిగా కీర్తి సురేష్ పాత్ర ఉంటే, ప్యంట్రీ ఉద్యోగిగా ధ్నుష్ కనిపిస్తాడు. ఆడియో ఆవిష్కరణ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్‌లో తొలి షాట్‌లోనే కీర్తిని లేడీ టెర్రరిస్ట్‌గా పేర్కొంటూ వార్తలు చెప్పే సన్నివేశం ఉంది. ఢిల్లీ నుంచి చెన్నైకి వచ్చే ఎక్స్‌ప్రెస్‌ రైలులో టెర్రరిస్టుల తో పాటు జరిగే ప్రయాణం నేపథ్యం లో సూపర్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది.

"తొడరి" ట్రైలర్ అదిరిపోయింది : తెలుగులోనూ దుమ్మురేపటం ఖాయం

పాటలని కూడా తెరకెక్కినిచిన విధానం అద్బుతం అనిపించేలా ఉన్నాయి.ట్యూన్లకి కూడా మంచి స్పందన వస్తోంది.

"తొడరి" ట్రైలర్ అదిరిపోయింది : తెలుగులోనూ దుమ్మురేపటం ఖాయం

ఇక ఈ దెబ్బతో ఇంకో భారీ హిట్ ని 2016 లో తన ఖాతాలో వేసుకోబోతున్నాడు ధనుష్.

English summary
"Thodari" is an upcoming Tamil romantic thriller written and directed by Prabhu Solomon. Dhanush plays a pantry worker in the film, which also stars Keerthy Suresh in the lead role. yesterday lanched audio of this Movie at Chennai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu