»   » కెల్విన్ ఫోన్ లో "చార్మీ దాదా", వందల కొద్దీ వాట్సాప్ మెసేజ్ లు: నిజాలా? రూమర్లా?? గందరగోళం

కెల్విన్ ఫోన్ లో "చార్మీ దాదా", వందల కొద్దీ వాట్సాప్ మెసేజ్ లు: నిజాలా? రూమర్లా?? గందరగోళం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఛార్మి డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకోవడం ఆమె అభిమానులను షాక్‌కు గురిచేసే అంశం.గతంలో డ్రగ్స్ కేసులో ఛార్మి పేరు ఎప్పుడూ బయటకు రాలేదు. క్లీన్ ఇమేజ్ ఉన్నఛార్మి మత్తువలలో చిక్కారంటే ఇండస్ట్రీలో అసలు కింద వర్గాలలో ఈ జాడ్యం ఎక్కడిదాకా వెళ్ళిందో అన్న దాని పైకి దృష్టి మళ్ళుతోంది.

మ‌హిళా సిట్ అధికారులు

మ‌హిళా సిట్ అధికారులు

డ్రగ్స్ కేసులో ఛార్మి కోరిన‌ట్లే ఆమెను న‌లుగురు మ‌హిళా సిట్ అధికారులు విచారిస్తున్నారు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూప‌రింటెండెంట్ అనిత‌.. జ‌య‌ల‌క్ష్మి.. రేణుక‌.. శ్రీల‌తలు ఛార్మిని విచారిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. కోర్టు సూచ‌న ప్ర‌కారం ఆమెను ఈ రోజు సాయంత్రం ఐదు గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే విచారిస్తార‌ని చెబుతున్నారు.

విచార‌ణ రేపు కూడా

విచార‌ణ రేపు కూడా

విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. ఛార్మి విచార‌ణ రేపు కూడా కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఈ విష‌యంపై సాయంత్రానికి మ‌రింత స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌న్న మాట వినిపిస్తోంది. ఈ రోజు బౌన్సర్ల తో పాటు సిట్ కార్యాలయానికి వచ్చిన ఛార్మి విచారణకు సిద్దమైంది.

ఛార్మి దాదా

ఛార్మి దాదా

డ్రగ్స్ విషయంలో ప్రధాన దోషి కెల్విన్ ఫోన్లో ఛార్మి నెంబర్ ఉండటం పైగా ఆ నెంబర్ కెల్విన్ ఫోన్ లో "ఛార్మి దాదా" అని సేవ్ చేసుకున్నాడట కెల్విన్,ఇదే కాకుండా చార్మికి కెల్విన్ కి మధ్య వాట్సాప్ మెసేజ్ ల‌లో వెయ్యికి పైగా సంభాష‌ణ‌లు వీరిద్ద‌రి మ‌ధ్య సాగిన‌ట్లుగా స‌మాచారం. అంత సుదీర్ఘంగా వారి మ‌ధ్య సంభాష‌ణ‌లు సాగ‌టం వెనుక కార‌ణం ఏమిట‌న్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మహిళా అధికారులే

మహిళా అధికారులే

అయితే ఆ సంభాషణలు ఏంటన్న విషయం ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఈ నెల 19 నుంచి డ్రగ్స్ కేసుపై సిట్, సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరిని పిలిచి విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పీల్ చేసుకున్నప్పటికీ, హైకోర్టు సిట్ కు సహకరించాలని ఆదేశించడంతో, ఛార్మి కూడా సిట్ విచారణకు హాజరయ్యింది. అయితే, ఆమెను కేవలం మహిళా అధికారులే ప్రశ్నిస్తుండటం గమనార్హం.

English summary
Thousends Of Whatsapp Messages found in Calvin's phone between Actress Charmi And Drug Dealer Calvin
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu