»   » ‌'త్రీ ఇడియట్స్‌' తెలుగులో కష్టం: నాగార్జున

‌'త్రీ ఇడియట్స్‌' తెలుగులో కష్టం: నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

‌'త్రీ ఇడియట్స్‌' సినిమా నేనూ చూశా. చాలా బాగా నచ్చింది. కానీ తెలుగులో మాత్రం అటువంటి కథలు ఎంత మందికి నచ్చుతాయో మీరే చెప్పండి? పొలంలో పని చేసుకొనేవాళ్ల దగ్గరకు వెళ్లి ర్యాగింగ్‌ అంటే ఏమిటని అడగండి. మీకు సమాధానం దొరకదు. హిందీ వాళ్లు మల్టీప్లెక్స్‌ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీస్తారు. మన కథలు మాత్రం అందరికీ నచ్చే విధంగా ఉండాలి. అందుకే అక్కడ బాగా ఆడిన సినిమాలు సైతం ఇక్కడ తుస్సు మంటున్నాయి. అలాగే 'త్రీ ఇడియట్స్‌' లాంటి కథలు తెలుగులో ఆశించకూడదు అంటూ నాగార్జున రీసెంట్ గా ఓ లీడింగ్ మీడియాకు ఇంటర్వూలో చెప్పుకొచ్చారు. ఇక ‌'త్రీ ఇడియట్స్‌' సినిమా రైట్స్ కోసం జెమినీ సర్క్యూట్స్, గీతా ఆర్ట్స్ పోటీ పడ్డారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక నాగార్జున కిరణ్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ 'కేడి' చిత్రాన్నీ రూపొందించారు. 'కేడి' ఈ నెల 12న విడుదల అవుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu