»   » రామ్ కోసం ముగ్గురు ప్రముఖ నటులు.. భారీగా ప్రవీణ్ సత్తారు చిత్రం!

రామ్ కోసం ముగ్గురు ప్రముఖ నటులు.. భారీగా ప్రవీణ్ సత్తారు చిత్రం!

Subscribe to Filmibeat Telugu

ప్లాపుల్లో ఉన్న రామ్ కు నేను శైలజ చిత్రం ద్వారా మంచి హిట్ దక్కింది. ఆ తరువాత మళ్ళీ పరాజయాలు పలకరించాయి. రామ్ కు అర్జెంట్ గా ఓ హిట్టు అవసరం. ఎన్నో ఆలు పెట్టునికుని చేసిన ఉన్నది ఒక్కటే జిందగీ చిత్రం గత ఏడాది విడుదలై నిరాశ పరిచింది. తదుపరి చిత్రంతో ఎలాగైనా హిట్ అందుకోవాలని పట్టుదలతో రామ్ ఉన్నాడు. అందుకు తగ్గట్లుగానే ప్రతిభ గల దర్శకుడు ప్రవీణ్ సత్తారు తో సినిమా చేయబోతున్నాడు.

గరుడ వేగ చిత్రంలో తన టేకింగ్ తో ప్రవీణ్ అబ్బుర పరిచిన సంగతి తెలిసిందే. రామ్, ప్రవీణ్ కాంబోలో తెరకెక్కబోయే చిత్రం గురించి ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ చిత్రంలో వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులు నటించబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు దర్శన్ కుమార్, మలయాళీ నటుడు సంజయ్ శివరాం ఈ చిత్రంలో నటించబోతున్నారు.

Three popular actors to turn as Ram friends

కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ నటుడు నటించబోతున్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా ఈ చిత్రంలో రామ్ స్నేహితుల పాత్రలో కనిపించనున్నారు. భారీ యాక్షన్ చిత్రంగా దీన్ని రూపొందించనున్నారు. మాళవిక శర్మ రామ్ సరసన హీరోయిన్ గా నటించనుంది.

English summary
Three popular actors to turn as Ram friends. Praveen Sattaru is directing this movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X