అందుకే ‘కహానీ' రీమేక్ చేస్తున్నా: శేఖర్ కమ్ముల
రీమేక్ చేయటానికి స్క్రిప్టు రాస్తున్నారు శేఖర్ కమ్ముల. హీరోయిన్ గా అనూష్క ని అని వినపడుతున్నా ఇంకా ఖచ్చితమైన వార్తేమీ లేదు.
ఇక తాను ఈ రీమేక్ చేయటానికి మూడు కారణాలు తెలియచేసారు శేఖర్ కమ్ముల..
1. నేను మొదటి నుంచి స్త్రీ ప్రధాన పాత్రలో ఉండే చిత్రాలంటేనే ఆసక్తి చూపుతున్నాను. నా చిత్రాలన్ని అదే కోవలో ఉంటాయి. కహానీ కూడా స్త్రీ చుట్టూ తిరగే కథే.
2. కహానీ కథ కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో జరుగతుంది. కోలకతా కు హైదరాబాద్ కి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. కాబట్టి బ్యాక్ గ్రౌండ్,లొకేషన్స్ సమస్య అనిపించదు.
3. థ్రిల్లర్ సబ్జెక్టులంటే నాకు ఇష్టం.
ఇక శేఖర్ కమ్ముల ప్రస్తుతం కహానీ స్క్రిప్టు వెర్షన్ ని తిరగరాస్తున్నారు. ఇంకా ఓ కొలిక్కిరాలేదు. అంతా అనుకున్నతర్వాత జనవరి నెలాఖరుకు కానీ, ప్రిభ్రవరి మొదటి వారంలో కానీ ఈ చిత్రానికి సంభందించి అధికారిక ప్రకటన వచ్చే అవకాసం ఉంది. అలాగే చిత్రంలో టెర్రరిజం బ్యాక్ డ్రాప్ తీసేసి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ పెడుతున్నట్లు సమాచారం. ఇక హీరోయిన్ గర్బం దాల్చే అంశం ఉండకపోవచ్చునని,అందుకు ఆల్టర్నేటివ్ వెతుకుతున్నారని వినపడుతోంది. ఇక ఈ చిత్రం తమిళ,తెలుగు భాషల్లో ఒకే సారి తెరకెక్కనుంది.


Click it and Unblock the Notifications












