twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫలించిన దిల్ రాజు చర్చలు.. రెమ్యూనరేషన్ తగ్గించుకునేందుకు ముగ్గురు స్టార్ హీరోల గ్రీన్ సిగ్నల్

    |

    కరోనా తర్వాత అన్ని పరిస్థితిలు దాదాపుగా మారిపోయాయి. తెలుగు సినీ పరిశ్రమ కూడా కరోనా తర్వాత అనేక కష్టనష్టాలకు గురైన పరిస్థితి కనిపిస్తోంది. అయితే కరోనా ముందు తీసుకుంటున్నా రెమ్యునరేషన్లు కరోనా తర్వాత కూడా హీరోలు పెంచేస్తున్న క్రమంలో సినీ నిర్మాతల మీద తీవ్రంగా భారం పడుతుంది. సినిమాలు అంత ఖర్చు పెట్టి తీసి విడుదల చేసినా సరే ఆ మీద కలెక్షన్లు వెనక్కి వస్తాయా రావా అనే విషయం మీద కూడా క్లారిటీ లేని నేపథ్యంలో నిర్మాతలు సినిమా షూటింగ్స్ నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు దానికి సంబంధించి హీరోలు కూడా మద్దతు పలుకుతున్నట్లు సమాచారం. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

     షూటింగులు నిలిపివేయాలని

    షూటింగులు నిలిపివేయాలని


    సినిమా నిర్మాణ వ్యయం ఏమీ తగ్గించాలని సినిమా నిర్మాతలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే నిర్మాణ వ్యయం తగ్గించే విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా ఈ విషయంలో ముందుకెళ్లాలి అనేది తేలే వరకు సినిమా షూటింగులు జరగకూడదని భావిస్తూ ఆగస్టు ఒకటో తేదీ నుంచి సినిమాలో షూటింగులు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తాజాగా దిల్ రాజు సారథ్యంలో సమావేశమైన యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఒక నిర్ణయం తీసుకుంది.

    తేల్చి చెప్పి

    తేల్చి చెప్పి


    ఆగస్టు ఒకటో తేదీ నుంచి సినిమా షూటింగులు నిలిపివేస్తామంటూ తమతో సినిమాలు చేస్తున్న హీరోలతో యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ తో దిల్ రాజు ఈ విషయం మీద చర్చించారని, సినిమా పరిశ్రమ బాగుండాలంటే తాము రెమ్యూనరేషన్ లు తగ్గించుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదని ముగ్గురు హీరోలు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.

     హీరోల ముందుకు

    హీరోల ముందుకు


    ఇక మిగతా నిర్మాతలు కూడా తమ తమ సినిమాలు చేస్తున్న హీరోలతో చర్చలు జరుపుతున్నారని అసలు ఎందుకు సినిమాలు షూటింగ్ బంద్ చేయాల్సి వస్తోంది? ఎక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము? ఈ విషయంలో హీరోలు చేయగలిగింది ఏమైనా ఉందా? అనే విషయాలు హీరోల ముందుకు నిర్మాతలు తీసుకువెళుతున్నారని తెలుస్తోంది. ఇక ఈ విషయం మీద మెగాస్టార్ చిరంజీవి కూడా ఆరా తీసినట్లుగా సమాచారం.

     పెద్ద దిక్కును కోల్పోయి

    పెద్ద దిక్కును కోల్పోయి


    అసలు ఏం జరుగుతోంది? ఎందుకు నిర్మాతలు ఇంత ఇబ్బంది పడుతున్నారు? వారి పై భారం తగ్గించాలంటే ఏం చేయాలి లాంటి అనేక విషయాల మీద కూడా మెగాస్టార్ చిరంజీవి దృష్టి పెట్టినట్లు సమాచారం. దాసరి నారాయణరావు మరణించిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమ ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి ఏదైనా సమస్య వచ్చినా శుభకార్యం వచ్చినా ముందుండి నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో కూడా మెగాస్టార్ చిరంజీవి చొరవ తీసుకుంటున్నట్లు సమాచారం.

    ముగ్గురు హీరోలతో

    ముగ్గురు హీరోలతో


    మెగాస్టార్ చిరంజీవి చొరవ తీసుకోవడంతో పాటు ఆయనే హీరోలు అందరితో సమావేశం ఏర్పాటు చేసి రెమ్యునరేషన్ తగ్గించుకుంటే ఎలా ఉంటుంది అనే విషయం మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడలేదు. దిల్ రాజు ముగ్గురు హీరోలతో మాట్లాడిన విషయం మాత్రం మీడియాలో హైలెట్ అవుతుంది.

    English summary
    three tollywood star heros allu arju, jr ntr, ram charan agreed to pull down their remunerations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X