»   » అనుష్క ఇంటిపై రాళ్లు విసరండంటున్న నటుడు

అనుష్క ఇంటిపై రాళ్లు విసరండంటున్న నటుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సెమీఫైనల్లో విరాట్‌ వైఫల్యానికి బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ కారణమంటూ సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఒక రన్ తో అవుట్ అయిన కోహ్లి అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేయటంతతవారు విరాట్ మీదే కూకుండా అనుష్క శర్మ ని సైతం ఆడిపోసుకుంటున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ నేపధ్యంలో వివాదాస్పద నటుడు కమాల్ ఆర్ ఖాన్ అయితే మరింతగా జనాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసాడు. అనుష్క శర్మ ఇంటిపైన రాళ్లు విసరండి...తన సినిమాలను బహిష్కరించండి. ఇండియా మ్యాచ్ గెలవకపోవటానికి కారణం అనుష్క శర్మే. ఆమె సినిమాలను ఎవరైతే చూస్తారో వారు దేశ ద్రోహులు అని ట్విట్టర్ లో పేర్కొన్నాడు. అలాగే అనష్క శర్మ వారందరనీ వెనక్కి తీసుకురావటానికి వెళ్లందంటూ ఈ ఫొటో ని సైతం పోస్ట్ చేసాడు.

Throw stones at Anushka Sharma's house: KRK to fans

అంతేకాదు...అనుష్క శర్మ మ్యాచ్ చూడటానికి వెళితే ఇండియా ఓడిపోతుందని చెప్పాను. అదే జరిగింది అని కూడా పోస్ట్ చేసాడు. ఈ వివాదస్పద మెసేజ్ లు మరిన్ని సమస్యలు మూలం అవుతాయో అని అంటున్నారు. చాలా మంది కమాల్ ని తప్పు పడుతున్నారు.

''అనుష్క సిడ్నీ వెళ్లి తప్పు చేసింది. దేశం ఆమెను క్షమించదు.. అనుష్కది అసలైన ప్రేమ.. తన ప్రియుడు చేసే ఒక్కపరుగు చూసేందుకు సిడ్నీ దాకా వెళ్లింది'' అంటూ ట్విటర్‌లో కొందరు ఆమెను ఆడిపోసుకున్నారు. అనుష్కను నిందిస్తున్నవారికి బుద్ధి లేదంటూ కొంతమంది ఆమెకు మద్దతుగా నిలిచారు.

వారిని భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ తప్పుబట్టాడు. ''అనుష్క చేసిన నేరమేంటి. ఇతర ఆటగాళ్ల సన్నిహితులు, కుంటుంబ సభ్యుల లాగే ఆమె కూడా మ్యాచ్‌ చూసేందుకు వెళ్లింది. కోహ్లి విఫలమైతే అనుష్కను నిందించడం తప్పు. అలా చేస్తున్నవారికి మానసిక పరిపక్వత లేదు'' అని గంగూలీ అన్నాడు.

English summary
KRK tweeted, "I request to all the people to go n throw stones at the house of Anushka Sharma who is the main reason for the defeat of India."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu