twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పోలీస్ కేసు‌: మొదట క్రేజీవాల్ పై ఇప్పుడు అమిర్‌ఖాన్‌ పై

    By Srikanya
    |

    న్యూఢిల్లీ: బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ఖాన్‌పై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమిర్‌ఖాన్‌ నటించిన 'పీకే' చిత్రం ఇటీవల విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆమిర్‌ పోలీసులను ఉద్దేశించి 'తుల్లా' అనే పదాన్ని ఉపయోగించాడని, దానిని వ్యతిరేకిస్తూ ఉల్లాస్‌ అనే ఓ షార్ట్‌ఫిల్మ్‌ మేకర్‌ ఫిర్యాదు చేశారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    గత నెలలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దిల్లీ పోలీసులపై 'తుల్లా' అనే పదాన్ని ఉపయోగించారు. కాగా, ఆయనపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. 'పీకే' చిత్రంలో ఆమిర్‌ఖాన్‌ కూడా పోలీసులను ఉద్దేశించి అదే పదం ఉపయోగించారని.. కేజ్రీవాల్‌పై కేసు నమోదు చేసినప్పుడు ఆమిర్‌ఖాన్‌పై ఎందుకు నమోదు చేయరు అంటూ ఉల్లాస్‌ పోలీసులను ప్రశ్నించాడు.

    Thulla Row: PK continues to haunt Aamir Khan; After Kejriwal, Bollywood actor in trouble

    తానేమీ ఆమ్‌ఆద్మీపార్టీ కార్యకర్తను కాదని అతను చెప్పాడు. పీకే చిత్ర డీవీడీని కూడా అతను పోలీసులకు అప్పగించాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

    అమీర్ తాజా చిత్రం విషయానికి వస్తే...

    దంగాల్ అనే మూవీలో రెజ్లర్ గా కనిపించబోతున్నారు ఆమిర్ ఖాన్... ఇందుకోసం తన బాడీని బాగా బిల్డప్ చేశారు. ప్రముఖ మల్లయోధుడు మహావీర్ ఫోగట్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. మహావీర్ పాత్రను ఆమిర్ ఖాన్ పోషించనున్నారు. ఆయన భార్య పాత్రను పోషించే అవకాశం మల్లికా శెరావత్ కి దక్కనుందని సమాచారం.

    Thulla Row: PK continues to haunt Aamir Khan; After Kejriwal, Bollywood actor in trouble

    ఈ చిత్రం గురించి తెలుసుకుని, తనంతట తానుగా ఆమిర్ భార్య పాత్ర చేస్తానని అడిగారట. మల్లిక మంచి నటి కావడంతో ఆమె ప్రతిపాదనను కాదనకుండా, ఈ పాత్ర కోసం ఆడిషన్ చేశారట. అయితే, ఇంకా అధికారికంగా మల్లికతో ఒప్పందం కుదుర్చుకోలేదు. కానీ, ఈ అవకాశం తనకే అని మల్లిక ఫిక్సయిపోయారట.

    ఇది ఇలా ఉంటే మహావీర్ ఫోగట్ ఇద్దరు కుమార్తెలు గీత, బబిత పాత్రలకు టీవీ సీరియల్స్‌లో, కొన్ని చిత్రాల్లో నటించిన ఫాలిమానూ, ఢిల్లీకి చెందిన సాన్యఅనే బ్యాలే డ్యాన్సర్‌నూ తీసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది.

    English summary
    After Arvind Kejriwal, now it's Aamir Khan who landed in legal trouble for using the infamous slang 'thulla' against policemen in his superhit movie PK. A Delhi-based short filmmaker filed a police complaint against the Bollywood actor. He claimed that law should treat everyone equally.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X