»   » టైగర్ ఇరుగదీశాడు.. ఫస్ట్‌లుక్ అదుర్స్.. రాంబో రీమేక్‌పై స్టాలోన్ ఏమన్నాడంటే..

టైగర్ ఇరుగదీశాడు.. ఫస్ట్‌లుక్ అదుర్స్.. రాంబో రీమేక్‌పై స్టాలోన్ ఏమన్నాడంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌కు సంబంధించి సినీయర్ నటుడు జాకీష్రాఫ్ తనయుడు, యువహీరో టైగర్ ష్రాఫ్‌ది డిఫరెంట్ స్టయిల్. డ్యాన్స్‌లు, ఫైట్స్‌లు చేయడంలో టైగర్ ప్రత్యేకమైన పంథా. రెండు, మూడు సినిమాల్లో నటించినా ఆయన ఖాతాలో పెద్దగా హిట్ పడలేదు. భారీ హిట్ కోసం గతంలో ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన రాంబో చిత్రాన్ని హిందీలో ప్రస్తుతం రీమేక్ చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌పై ట్విట్టర్‌లో మంచి రెస్పాన్స్ వస్తున్నది.

రాంబో చిత్రాన్ని చూస్తూ..

శత్రువులను ఒంటిచేత్తో మట్టుపెట్టడం, గెరిల్లా పోరాటాలతో ప్రత్యర్థులను దొంగదెబ్బ తీయడం లాంటి అంశాలతో తెరకెక్కిన రాంబో చిత్రం స్టాలెన్‌ను సూపర్ స్టార్‌ను చేశాయి. అలాంటి లక్షణాలు పుష్కలంగా ఉన్న టైగర్ ఇప్పుడు రాంబోను రీమేక్ చేస్తూ ఓ సాహసమే చేస్తున్నాడని చెప్పవచ్చు. ఆ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ మీడియాలో ఆసక్తిని రేపుతున్నది. రాంబో చిత్రాన్ని చూస్తూ పెరిగాను. అలాంటి పాత్ర చేయడానికి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను అని టైగర్ ట్వీట్ చేశారు.

రాంబో అద్భుతమైన పాత్ర

రాంబో అద్భుతమైన పాత్ర

టైగర్ రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్‌ను, రాంబో రీమేక్‌పై హాలీవుడ్ సూపర్ స్టార్ సిల్వెస్టర్ స్టార్ ఇన్స్‌టాగ్రామ్‌లో స్వయంగా స్పందించారు. ఇండియాలో రాంబోను రీమేక్ చేస్తున్నారనే విషయాన్నిఇటీవల చదివాను. ఆ పాత్ర అద్భుతమైనది. రాంబోను మరోసారి అద్భుతంగా చిత్రీకరిస్తారనే ఆశాభావంతో ఉన్నా అని స్టాలెన్ ఇన్స్‌టాగ్రామ్‌లో ఫోటోతోపాటు ఓ పోస్ట్‌ను పెట్టడం గమనార్హం.

మీకు మీరే సాటి..

స్టాలెన్ పోస్టుకు జవాబుగా రాంబో పాత్రకు మీకు మీరే సాటి. ఆ పాత్రకు మీరే స్ఫూర్తి. మీ కోరికను వమ్ము చేయకుండా జాగ్రత్త పడుతామని మాట ఇస్తున్నాను అని టైగర్ ట్వీట్ చేశాడు. ఈ చత్రానికి హృతిక్‌తో బ్యాంగ్ బ్యాంగ్ తీసిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు. ఈ సినిమా 2018లో విడుదల కానున్నది.

ఫస్ట్‌లుక్‌పై సుధీర్‌బాబు ట్వీట్

ఫస్ట్‌లుక్‌పై సుధీర్‌బాబు ట్వీట్

రాంబో రీమేక్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌పై తోటి నటీనటులు ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టాలీవుడ్ హీరో సుధీర్ బాబు.. ఫస్ట్‌లుక్ చాలా బాగుంది. రీమేక్ చేయడం గర్వంగా ఉంది. కంగ్రాట్స్ అని ట్వీట్ చేశారు. సునీల్ శెట్టి కూతురు అతియాశెట్టి ‘ఆవ్‌సమ్‌గా ఉంది. 12 ఏళ్ల వయసులో రాంబో పాత్రలో ఏదో ఒకరోజు నటిస్తాను అని చెప్పావు. చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాను' అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘ఫస్ట్‌లుక్‌లో గ్రేట్‌గా కనిపిస్తున్నావు. ఆ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తున్నది అని వరుణ్ ధావన్ అన్నారు.

English summary
Tiger Shroff, one of Bollywood's fittest and most agile actors, is all set to play the title role in the Indian remake of Rambo. The original Rambo films had Sylvester Stallone playing John Rambo, a war hero skilled in all kinds of combat, guerrilla tactics and powerful enough to single-handedly take on the enemy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X