»   » "నా జీవితంలో నేనే విలన్‌" సాయి ధరమ్ తేజ్ ఇలాఎందుకన్నాడు,అసలేమైంది ?

"నా జీవితంలో నేనే విలన్‌" సాయి ధరమ్ తేజ్ ఇలాఎందుకన్నాడు,అసలేమైంది ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సునీల్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాయి ధరమ్‌ తేజ్‌ కొత్త సినిమా 'తిక్క'. ఈ చిత్రం మోష‌న్ పోస్ట‌ర్ ని జూన్ 25న విడ‌దల చేయ‌నున్నారు. ఇప్ప‌టికే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.ఆగస్టు రెండో వారం లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

జులై 20న మెద‌టి లుక్ టీజ‌ర్‌ని విడుద‌ల చేసి,ఎస్‌.థ‌మ‌న్ సంగీత సారథ్యంలో అందించిన సూప‌ర్బ్‌ ఆడియో ని జులై 30న‌ గ్రాండ్ గా విడుద‌ల చేయ‌నున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి ప్ర‌పంచ‌వ్యాప్తంగా చిత్రాన్ని అగ‌ష్టు13న‌ విడుద‌ల చేయ‌టానికి నిర్మాత డాక్ట‌ర్.సి.రోహిణ్ రెడ్డి స‌న్నాహాలు చేస్తున్నారు. వరుస విజయాలతో కెరీర్‌లో దూసుకెళ్లిపోతున్న సాయిధరమ్‌ ఈ సినిమాతో మరో విజయాన్ని అందుకోగలడని నమ్మకం వ్యక్తం చేస్తున్నారంతా..


Tikka Movie release on Aug 13th

ఇటీవల లడక్ లో చిత్రీకరించిన పాటతో, ఈ సినిమా షూటింగును పూర్తిచేసుకుంది. రోహిణ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో లారిస్సా బొనేసి .. మన్నారా చోప్రా కథానాయికలుగా అలరించనున్నారు.ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదలయ్యింది. ఈ సినిమాలో సాయి ధరమ్‌ తేజ చాలా హ్యాండ్సమ్‌గా కనిపించనున్నాడని చెప్తున్నారు. అలాగే అతని పాత్ర కూడా చాలా కొత్తగా ఉండబోతోందట. దర్శకుడు, హీరో సాయిధరమ్‌ కోసం డిఫరెంట్‌ మేనరిజమ్స్‌తో కూడిన క్యారెక్టర్‌ని డిజైన్‌ చేశానంటున్నాడు.


ప్రేమించిన అమ్మాయితో బ్రేకప్‌ అవ్వడంతో హీరో ఆదిత్యకు తిక్క వస్తుంది. తమ ప్రేమను మళ్ళీ ఎలా సాధిస్తాడు అనే అంశంతో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అల్లరిగా తిరిగే హీరో ఆదిత్య అమ్మాయి వల్ల ఎలాంటి మార్పు వస్తుంది అన్నది సినిమా చూస్తే తెలుస్తుంది. "ఎవరి జీవితంలో వారే హీరో, నా జీవితంలో మాత్రం నేనే విలన్‌" అనే డైలాగ్‌ ఈ సినిమాకు కీలకం కానున్నదట.

English summary
Om 3D’ fame Sunil Reddy will be directing Sai Dharam Tej in an action entertainer and the film has been launched on 31st July. This film is titled as ‘Thikka’ with the tagline ‘Handle With Care’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu