»   » గెట్ రెడీ: 'గబ్బర్ సింగ్' స్దాయిలో రెడీ చేసి, మహాశివరాత్రి రోజే వదులుతున్నారు

గెట్ రెడీ: 'గబ్బర్ సింగ్' స్దాయిలో రెడీ చేసి, మహాశివరాత్రి రోజే వదులుతున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రీసెంట్ గా విడుదల చేసిన 'డీజే...దువ్వాడ జగన్నాథం' ఫస్ట్ లుక్ ఓ రేంజిలో రెస్పాన్స్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఈ సినిమా మీద ఉన్న భారీ అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇదే వేడిని కంటిన్యూ చేస్తూ... మళ్లీ రచ్చ చేయటానికి బన్నీ రెడీ అవుతున్నాడు. దర్శక,నిర్మాతలు దువ్వాడ జగన్నాథం టీజర్ లాంచ్ డేట్.. టైం కూడా ఫిక్స్ చేసేసారు. మహాశివరాత్రి కానుకగా ఈ నెల 24న.. శుక్రవారం ఉదయం 9 గంటలకు డీజే టీజర్ లాంచ్ చేయనున్నట్లు దర్శకుడు చిత్ర యూనిట్ ప్రకటించింది.


ఫస్ట్ లుక్ తరహాలోనే టీజర్ కూడా అదిరిపోయే రేంజిలో ఉండేలా హరీష్ శంకర్ డిజైన్ చేసినట్లు చెప్తున్నారు. టీజర్ తోనే బిజినెస్ మొత్తం పూర్తి చేయాలనే దిశగా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. ముఖ్యంగా హరీష్ శంకర్-బన్నీ కాంబినేషన్ మీద ఉన్న అంచనాలకు తగ్గట్లే టీజర్ కూడా స్టైలిష్ గా ఉండటమే కాకుండా టీజర్ లో చెప్పించే డైలాగు సైతం అదిరిపోయేలా ఉంటుందని అంటున్నారు. గబ్బర్ సింగ్ రేంజిలో టీజర్ దుమ్మురేపుతుందని అంటున్నారు.


దిల్ రాజు నిర్మిస్తున్న 'దువ్వాడ జగన్నాథం'లో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. వేసవి కానుకగా మే నెలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఏప్రిల్లో ఆడియో విడుదల చేస్తారు.


Time and date for DJ's First Look Teaser

దిల్‌రాజు చిత్ర విశేషాలు తెలియజేస్తూ... మా సంస్థ నిర్మిస్తోన్న 25వ చిత్రమిది. ఆర్య పరుగు తర్వాత బన్నీతో హ్యాట్రిక్ కాంబినేషన్‌లో ఈ సినిమా చేయడం ఆనందంగా వుంది. మా బ్యానర్‌లో హరీష్‌శంకర్ వరుసగా చిత్రాలు చేస్తున్నాడు. ఈ ప్రయాణంలో అతనితో చక్కటి అనుబంధం ఏర్పడింది. వేసవి కానుకగా ఏప్రిల్‌లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.


హరీష్‌శంకర్ మాట్లాడుతూ దిల్‌రాజుగారి బ్యానర్‌లో వస్తున్న 25వ సినిమా ఇది. దిల్‌రాజుతో తన అనుబంధం 'గబ్బర్‌సింగ్‌' నుంచి కొనసాగుతుందన్నారు. 'ఆర్య' సినిమా వచ్చినప్పటి నుంచి అల్లుఅర్జున్‌తో సినిమా చేయాలని అనుకున్నా.. ఇప్పటికి ఆ కోరిక తీరిందని వెల్లడించారు. అలాగే అల్లు అర్జున్ ప్రతి సినిమాలో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. ఆయనతో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. దిల్‌రాజుగారి సంస్థను నా హోమ్‌బ్యానర్‌గా ఫీలవుతాను. ఈ సంస్థలో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను అని హరీష్‌శంకర్ పేర్కొన్నారు.


మహాశివరాత్రి సందర్భంగా చిత్ర టీజర్‌ను విడుదల చేయనున్నారు. కొద్ది సేపటి క్రితమే ఫస్ట్ లుక్ విడుదల కాగా సోషల్ మీడియాలో ట్రేండింగ్ టాపిక్ గా మారిపోయింది. ఈ చిత్రం ఇప్పటికే ఎక్కువ భాగం షూటింగ్ ని పూర్తి చేసుకుంది. మార్చి కల్లా మిగిలిన భాగాన్ని పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను మొదలు పెట్టనున్నారు.


అల్లు అర్జున్‌ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. దిల్‌రాజు నిర్మాత. దేవీశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఐనాక బోస్, ఎడిటర్: గౌతంరాజు, ఆర్ట్: రవీందర్, సంగీతం: దేవీశ్రీప్రసాద్, స్క్రీన్‌ప్లే: దీపక్‌రాజ్, కథ, మాటలు, దర్శకత్వం: హరీష్‌శంకర్.

English summary
First Look Teaser of 'DJ' will be unveiled on the eve of Maha Shivarathri this year. Get ready to enjoy Bunny's new makeover from 9 AM onwards on February 24th, 2017.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu