»   » అధ్బుత ప్రేమకావ్యం 'టైటానిక్‌' త్రీడీలో ...

అధ్బుత ప్రేమకావ్యం 'టైటానిక్‌' త్రీడీలో ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

1997లో రిలీజై సంచలన విజయం సాధించిన 'టైటానిక్‌' వంటి అధ్బుతాన్ని త్రీడీలో చూస్తే ఎలా ఉంటుంది. ఊహించటానికే కలలాగ ఉన్న ఈ ఆలోచనను నిజం చేయటానికి ప్రముఖ దర్శకుడు జేమ్స్‌ కామెరాన్‌ ప్రయత్నం చేస్తున్నారు. అధ్బుత రీతిలో 'అవతార్‌' చిత్రాన్ని త్రీడీలో ఆవిష్కరించిన ఆయన ఈ సారి ఈ ప్రాజెక్టుతో ముందుకు రానున్నారు. త్రీడి పనులు పూర్తి చేసి 2012 ఆగస్టు నాటికి ఈ సినిమాని విడుదల చేయాలని ఆయన భావిస్తున్నారు. ప్రస్తతం ట్రైల్ వెర్షన్ లో ఈ చిత్రంలో కొంత భాగాన్ని త్రీడీ వెర్షన్ లోకి కన్వర్ట్ చేసి సంతృప్తి అనిపించిన తర్వాతే ఈ ప్రయత్నం ప్రారంభింస్తున్నారు. 'అవతార్‌' చిత్రం కోసం ఆయన త్రీడీలో చేసిన రీసెర్చి, పెంచుకున్న అనుభవం ఈ చిత్రం కి వినియోగపడుతుందని ావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నారు.2012 ఏప్రియల్ 15కల్లా టైటానిక్ ఓడ మునిగిపోయి వందేళ్ళు అవుతుంది. ఈ సందర్భంగా ఈ ప్రేమకథను మరోసారి త్రీడి ఫార్మెట్ లో ఆవిష్కరించనున్నారన్నమాట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu