»   » శేఖర్ కమ్ముల, వరుణ్ తేజ చిత్రం ధీమ్ పోస్టర్ ,(సాయి పల్లవి కొత్త ఫొటోలతో)

శేఖర్ కమ్ముల, వరుణ్ తేజ చిత్రం ధీమ్ పోస్టర్ ,(సాయి పల్లవి కొత్త ఫొటోలతో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శేఖర కమ్ముల, వరుణ్ తేజ, సాయి పల్లవి కాంబినేషన్ లో రూపొందనున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ఈ రోజు(ఆగస్టు 5)నుంచి ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే. నిజమాబాద్ వద్ద బన్సవాడ అనే చిన్న టౌన్ లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి టైటిల్ ని ఫైనల్ చేసారు. ఆ టైటిల్ ఏమిటంటే...'ఫిదా'. ఈ ఫొటోని దిల్ రాజు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో విడుదల చేసారు.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఓ ఎన్నారై అబ్బాయికి, తెలంగాణా టౌన్ నుంచి వచ్చిన ఓ కుర్రాడికి మధ్య జరిగే ఓ లవ్ స్టోరి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ధీమ్ పోస్టర్ ఈ రోజు విడుదల చేసారు. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తక్కువ కాలం లో, విన్నూత్నమైన సబ్జక్ట్స్ ఎంచుకుంటూ తనదైన ఐడెంటిటీ సంపాదించుకున్నారు. అటు యూత్ ను ఇటు ఫామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే చక్కటి కథా బలం ఉన్న చిత్రాలను తీసే దర్శకుడు శేఖర్ కమ్ముల.ఇప్పుడు వీరిద్దరి తో, ఉత్తమ కథా చిత్రాల నిర్మాత గా పేరు ఉన్న దిల్ రాజు త్వరలో ఒక చిత్రాన్ని ప్రారంభించబోవటంతో అంచనాలు బాగా పెగుతున్నాయి.

అలాగే ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రేమమ్ చిత్రంతో పాపులర్ అయిన సాయి పల్లవిని ఎంపిక చేయటంతో మళయాళంలోనూ ఈ సినిమాకు బిజినెస్ చేయనున్నట్లు అర్దమవుతోంది. ఈ సందర్బంగా సాయి పల్లవి లేటెస్ట్ ఫొటోలను మీకు అందిస్తున్నాం.

స్లైడ్ షోలో మరిన్ని విశేషాలు ఫొటోలతో...

మాలర్ పాత్ర

మాలర్ పాత్ర

మాలర్ పాత్రలో ప్రేమం చిత్రం ద్వారా యువత ను బాగా ఆకట్టుకున్న సాయి పల్లవి ఈ చిత్రం లో హీరోయిన్ గా ఎంపిక చేయబడ్డారు.

లవ్ స్టోరీ

లవ్ స్టోరీ

ఒక అమెరికా అబ్బాయి, తెలంగాణా అమ్మాయి కి మధ్య జరిగే ప్రేమ కథే ఈ చిత్రం.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ....

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ....

"శేఖర్ కమ్ముల ఒక వండర్ఫుల్ స్టొరీ టెల్లర్. వరుణ్ తేజ్ ఇప్పటికే మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అమెరికా లో ఉండే ఒక అబ్బాయి కి , తెలంగాణా లో పెరిగిన ఒక అమ్మాయి కి మధ్య జరిగే ప్రేమ కథ ఈ చిత్రం", అని తెలిపారు.

తెలంగాణాలో ఫస్ట్ షెడ్యూల్

తెలంగాణాలో ఫస్ట్ షెడ్యూల్


ఈ రోజు నుంచి షూటింగ్ ప్రారంభమై ...ఆగస్టు చివరికి తెలంగాణా షెడ్యూల్ మొత్తం పూర్తి చేసుకుంటాం.

మిగతాది అమెరికాలో

మిగతాది అమెరికాలో


అక్టోబర్ లో అమెరికా లో షూటింగ్ జరుపుతారు. ఈ షెడ్యూల్ లో తో షూటింగ్ పూర్తి అవుతుంది.

రిలీజ్ ఎప్పుడు

రిలీజ్ ఎప్పుడు

చిత్రాన్ని డిసెంబర్ లో రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది

టెక్నీషియన్స్

టెక్నీషియన్స్


ఈ చిత్రానికి ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్, సినిమాటోగ్రఫి విజయ్ కుమార్ అందిస్తారు. ఇతర తారాగణం, మరియు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనేవిడుదల చేస్తాం అని చిత్ర బృందం తెలిపింది.

హెలెట్

హెలెట్

ఈ సినిమాలో సాయి పల్లవి క్యారక్టర్ హైలెట్ అని చెప్తున్నారు.

స్త్రీ పాత్రలకే

స్త్రీ పాత్రలకే

తొలినుంచి శేఖర్ కమ్ముల స్త్రీ పాత్రలకు తన సినిమాలో హైలెట్ చేస్తూ వస్తున్నారు.

ఆనంద్ లోనూ

ఆనంద్ లోనూ

శేఖర్ కమ్ముల తొలి చిత్రం ఆనంద్ లోనూ కమిలినీ ముఖర్జీ చుట్టూనే సినిమా తిరుగుతుంది

ఈ కొత్త సినిమాలోనూ

ఈ కొత్త సినిమాలోనూ

వరుణ్ తేజ సినిమాలోనూ హీరోయిన్ పాత్రకు అద్బంతగా తీర్చిదిద్దాడని తెలుస్తోంది.

సెలక్టివ్ గా

సెలక్టివ్ గా


సాయి పల్లవి తన సినిమాల ఎంపిక విషయంలో చాలా సెలక్టివ్ గా వెళ్తోంది

చూసే..

చూసే..

శేఖర్ కమ్ముల గత చిత్రాలు చూసే ఆమె ఈ చిత్రం ఓకే చేసిందని తెలుస్తోంది.

ప్రేమమ్ లాంటి

ప్రేమమ్ లాంటి

ఈ చిత్రం కూడా తనకు పేరు తెచ్చిపెట్టిన ప్రేమమ్ లాంటి లవ్ స్టోరీ అని చెప్తోంది.

మలార్ మిస్

మలార్ మిస్


సాయి పల్లవిని ఎక్కడికి వెళ్లినా మలార్ మిస్ అని పిలుస్తున్నారట మళయాళి ఆడియన్స్.

వయస్సు ఎంత

వయస్సు ఎంత


సాయి పల్లవి వయస్సు ఇప్పుడు 25 ఏళ్లు మాత్రమే, మే 9, 1992లో జన్మించింది

జీవితానికి సరపడ

జీవితానికి సరపడ


ప్రేమమ్ లో ఆమె పాత్రకు జీవితానికి సరపడ పేరు వచ్చిందంటోంది

మీకిది తెలుసా

మీకిది తెలుసా

సాయి పల్లవి నిజ జీవిత ఫ్రొఫెషన్ దృష్యా ఓ డాక్టర్

జార్జియాలో

జార్జియాలో


ఆమె తన డాక్టర్ కోర్స్ ని జార్జియాలో పూర్తి చేసింది.

అంతేనా

అంతేనా


సాయి పల్లవి బ్రిలియంట్ డాన్సర్. ఆమె స్టెప్స్ మీరు ప్రేమమ్ లో చూడవచ్చు.

రియాల్టి షోలో

రియాల్టి షోలో


తొలి సినిమా చేయకముందు ఆమె చాలా రియాల్టి షోలలో పాల్గొంది

ప్రేమమ్ కు ముందు

ప్రేమమ్ కు ముందు

ప్రేమమ్ చిత్రం కు ముందు ఆమె జయం రవి హీరోగా వచ్చిన ధూమ్ ధామ్ చిత్రంలో ఓ చిన్న పాత్ర చేసింది

ప్రేమమ్ కు నో

ప్రేమమ్ కు నో

మొదట తన లుక్స్ మళయాళి సినిమాకు సెట్ అవ్వవని ప్రేమమ్ కు నో చెప్పిందిట

దర్శకుడే

దర్శకుడే


కానీ దర్సకుడు పాత్ర తమిళ టీచర్ అని చెప్పి కన్వీన్స్ చేసి ఒప్పించాడు

ప్రేమమ్ తర్వాత

ప్రేమమ్ తర్వాత

ప్రేమమ్ చిత్రం తర్వాత సాయి పల్లవి దుల్హర్ సరసన కాళి చిత్రం చేసింది.

మణిరత్నం కు

మణిరత్నం కు

మణిరత్నం తాజా చిత్రానికి తొలి ప్రాధాన్యత ఆమే. అయితే ఆ తర్వాత బాలీవుడ్ నటి అదితిరావు సీన్ లోకి వచ్చింది.

English summary
Sekhar Kammula's new love story starring Varun Tej and Sai Pallavi is titled #Fida. Regular shoot begins in Banswada from 5th August.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X