»   » బాలయ్య 101 సినిమా టైటిల్ ఇదే..

బాలయ్య 101 సినిమా టైటిల్ ఇదే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సంచలన చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాత బాలక‌ృష్ణ చేస్తున్న సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. గత నెలరోజులుగా పలువురు దర్శకులు చెప్పిన ఎన్నో కథలు విన్న బాలయ్య చివరకు దర్శకుడు కేఎస్ రవికుమార్ చౌదరీ చెప్పిన కథకు ఒకే చెప్పినట్టు ఓ వార్త ప్రచారం జరుగుతున్నది.

బాలకృష్ణ సినిమా టైటిల్స్ ఇవే

బాలకృష్ణ సినిమా టైటిల్స్ ఇవే


రవికుమార్ చౌదరీ దర్శకత్వంలో పట్టాలెక్కనున్న బాలయ్య చిత్రానికి రెడ్డిగారూ, జయసింహ అనే పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఈ టైటిల్స్‌ను కూడా రిజిస్టర్ చేసినట్టు ఓ వార్త వినిపిస్తున్నది.

రైతు చిత్రం మరింత వెనుకకు..

రైతు చిత్రం మరింత వెనుకకు..


బాలక‌ృష్ణ తన వందో చిత్రం తర్వాత వాస్తవానికి రైతు అనే సినిమాను చేయాల్సి ఉంది. అమితాబ్ బచ్చన్ డేట్స్ ఇస్తేనే ఆ చిత్రం ప్రారంభమయ్యే పరిస్థితి ఏర్పడింది. దాంతో ఆ చిత్రం కాకుండా మరో సినిమాను చేయాలని బాలయ్య డిసైడ్ అయ్యారనే వార్త ఫిలింనగర్‌లో ప్రచారమైంది.

మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్‌పై దృష్టి

మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్‌పై దృష్టి


తన తండ్రి, మహానటుడు నందమూరి తారకరామారావు జీవిత కథను స్క్రిప్ట్ గా మార్చే పనిలో పడ్డారు. తండ్రి సినిమాకి పరిశోధనకు ఎక్కువగా టైమ్ పడుతుందని గ్రహించిన బాలయ్య కేఎస్ రవికుమార్ చెప్పిన కథతోనే రావాలని బాలకృష్ణ ఫిక్స్ అయ్యారు. తన 101 సినిమా డైరక్షన్ బాధ్యతలు ఆయనకే ఇచ్చినట్టు తెలిసింది.

రవికుమార్‌కు బాలయ్య ఒకే

రవికుమార్‌కు బాలయ్య ఒకే


దర్శకుడు కేఎస్ రవికుమార్‌కుమార్ చెప్పిన ఫ్యాక్షన్ కథ బాలయ్యను విశేషంగా ఆకట్టుకున్నదట. దాంతో తనకు కలిసి వచ్చిన ఫ్యాక్షన్ కథతోనే వెళ్లాలని నిశ్చయించుకొన్నట్టు తెలిసింది. తమిళంలో రజనీకాంత్, అజిత్ లాంటి అగ్ర హీరోలకు రవికుమార్ భారీ హిట్లను అందించిన సంగతి తెలిసిందే.

English summary
Balakrishna's given green signal to director KS Ravikumar for his 101 movie. Reddygaru, Jayasimha titles are consideration for the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu