twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందం, అభినయాల కలబోత..

    By Staff
    |

    అందం అభినయం కలబోసిన నటి మీనా పుట్టిన రోజు నేడు. బాలనటిగా కెరీర్ ను ప్రారంభించిన మీనా అటుపై హీరోయిన్ గా ఎదగటమే కాకుండా దక్షిణాది స్టార్ హీరోల సరసన నటించే అరుదైన అవకాశాన్ని పొందింది. ఆర్ దొరైరాజ్, రాజ్ మల్లిక దంపతులకు 1979 సెపెంబరు 16న జన్మించిన మీనా బాలనటిగా తెలుగు సినిమాలతో తన కెరీర్ ను ప్రారంభించింది. అదే సమయంలో తమిళంలో కూడా బాలనటిగా చేసింది. తెలుగులో పలు సినిమాల్లో చేసినప్పటికీ 'సిరివెన్నెల' సినిమా ఆమెకు బాలనటిగా ఎనలేని పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత కొంత విరామం తర్వాత 'సీతారామయ్యగారి మనవరాలు' చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఇందులో ఆమె నటన సీనియర్ నటుడు నాగేశ్వరరావు గారి నటనకు ధీటుగా వుంటుంది. ఆ తర్వాత వెంకటేష్ సరసన నటించిన 'చంటి' చిత్రం సూపర్ హిట్ గా నిలవడంతో మీనా కెరీర్ ఒక్కసారిగా ఊపందుకొంది.

    అటుపై దక్షిణాదిన అందరి అగ్రహీరోల సరసన నటించి మెప్పించింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషలో నటించిన మీనా నటిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 1993 వరకూ తెలుగులో అగ్రతారగా వెలిగిన మీనాకు అటుపైన చెప్పుకోదగ్గ విజయాలు లభించకపోవడంతో, తమిళంలో మంచి అవకాశాలు లభించడంతో తెలుగులో రెగ్యులర్ చిత్రాలు తగ్గించింది. ఈ మధ్యనే తెలుగులో 'వెంగమాంబ' అనే చిత్రంలో నటించిన మీనా తన నటనా పరిణతితో ఆకట్టుకున్నారు.

    ఇటీవలే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విధ్యాసాగర్ ను పెళ్లాడిన మీనా సినిమాల మీద వున్న మక్కువతో తిరిగి సినిమాల్లో నటించాలని నిర్ణయించుకుంది. జీవితాంతం నటిస్తూ వుండటమే తన లక్ష్యం అంటున్న మీనాకు పుట్టిన రోజు సంధర్భంగా దట్స్ తెలుగు తరపున హార్థిక జన్మదిన శుభాకాంక్షలు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X