»   » అల్లు అర్జున్ కి ముఫ్పై ఐదు లక్షల డైమండ్ రింగ్

అల్లు అర్జున్ కి ముఫ్పై ఐదు లక్షల డైమండ్ రింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్ , స్నేహా రెడ్డిల నిశ్చితార్ధం ఈ రోజే(నవంబర్ 26, 2010) జరగనుంది. .ఈ ఎంగేజ్ మెంట్ పంక్షన్ ని సింపుల్ గా చేయనున్నారని సమాచారం. ఈ పంక్షన్ ఇరు కుటుంబాల ప్రెవేట్ పంక్షన్ గా చేస్తున్నారు. ఈ విషయమై అల్లు అర్జున్ వివరణ ఇస్తూ..నాకు నా శ్రేయాభిలాషులను, స్నేహితులను, సినీ పరిశ్రమలోని పెద్దలను, మీడియావారిని పిలిచి ఈ పంక్షన్ చేసుకోవాలని ఉంది కానీ..చాలినంత సమయం లేదు అన్నారు. ఇక ఈ నిశ్చితార్ద వేడుకలో అల్లు అర్జున్ కి ముప్పై ఐదు లక్షలు విలువ చేసే డైమండ్ రింగ్, అమ్మాయికి కోటి రూపాయల విలువైన నగలు పెట్టనున్నారని తెలుస్తోంది. అలాగే వీరి వివాహం..వచ్చే పిభ్రవరిలో జరగనుంది. ఇకఈ రోజున అల్లు అర్జున్ బావ..రామ్ చరణ్ క్రేజీ చిత్రం ఆరెంజ్ కూడా విడుదల అవుతోంది. ఇద్దరి జీవితాల్లో ఈ రోజు ఓ పండుగలాంటిది. ఇద్దరికీ ధట్స్ తెలుగు శుభాకాంక్షలు తెలియచేస్తోంది. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం "బద్రీనాధ్" లో వివి వినాయిక్ దర్శకత్వంలో చేస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మార్చి 27, 2011 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేయాలని నిర్ణయించారు. . ఆ రోజు రామ్ చరణ్ తేజ పుట్టిన రోజు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu