twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    86 ఏళ్ల 'దసరా బుల్లోడు'

    By Staff
    |

    అతని అనుభవం ఇప్పుడు సినిమా ఇండస్ర్టీలో వున్న వాళ్ల వయసంత వుంటుంది. కానీ ఇప్పటికీ యువనాయకులతో పోటీపడగల ఉత్సాహం ఆయన సొంతం. అతనో 86 ఏళ్ల కుర్రాడు. అతనే అక్కినేని నాగేశ్వర రావు. ఈ రోజు(సెపెంబరు 20) ఆయన పుట్టినరోజు. ప్రేక్షకులని కంటతడి పెట్టించాలన్నా, గిలిగింతలు పెట్టించాలన్నా ఆయనకు ఆయనే సాటి. అలాంటి మహానుభావుడి పుట్టినరోజు మనందరికీ పండుగ రోజు. ఇలాంటి సందర్భంలో ఆయన పుట్టినరోజు గురించి ఓ ముఖ్యవిషయం తెలుసుకుందాం.

    అసలు అక్కినేని గారి పుట్టినరోజు ఎప్పుడో ఆయనకు 20 ఏళ్లు వచ్చేవరకూ తెలియదట. తెలుసుకోవలసిన అవసరం కూడా రాలేదని అంటారు ఆయన. కానీ ఓ సారి ఐదు వేల రూపాయలకు భీమా పాలసి తీసుకున్నారు. అప్పుడే పుట్టినరోజు తెలుసుకోవలసిన అవసరం వచ్చిందట. అప్పుడు గుడివాడలోని తాలూకా ఆఫీసులో పాత రికార్డులన్నీ తిరగేస్తే 1924 సెపెంబరు 21, ఆదివారం పుట్టారని రాసివుంది. కానీ వారి అమ్మగారేమో నువ్వు శనివారం పుట్టావురా అబ్బాయ్ అని ఖచ్చితంగా చెప్పిందట. తర్వాత తెలిసిందేమిటంటే వారుంటున్న వెంకట్రాఘవపురం నుండీ గుడివాడలోనున్న తాలూకా ఆఫీసు రికార్డుల్లో నమోదుచేయించడం ఒక రోజు ఆలస్యం అయిందట. అయితే ఆయన నటించిన 'బుద్దిమంతుడు' చిత్రం సెపెంబరు 20న విడుదలయిందట. పోస్టర్ల మీద పుట్టినరోజు విడుదల అని సదురు నిర్మాత అడిగాడట. సరే అన్నారట అక్కినేని. దీంతో ఆయన అభిమానులకు ఆయన పుట్టిన రోజును జరుపుకొనే అవకాశం వచ్చింది.

    ఈ రోజుతో 86వ పడిలోకి అడుగిడుతున్న ఎయన్నార్ తన తనయుడు నాగార్జునతో పోటీపడి 'రామదాసు' చిత్రంలో నటించి తనలో ఇంకా ఉత్సాహం తగ్గలేదని నిరూపించారు. తన మనవడు నాగచైతన్యతో కూడా నటించ గల ఉత్సాహం ఆయన సొంతం. ఆయన వయసు 86 అయినా ఆయన ఇప్పటికీ 26 ఏళ్ల కుర్రాడిలా హుషారుగా వుంటారు. దీనికి ఆయన క్రమశిక్షనతో కూడుకున్న దినచర్యే కారణం. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు ఆయనకి ఆయురారోగాయాలు ప్రసాదించాలని కోరుకుందాం...

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X