For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఈ రోజే రిలీజ్ .... రామ్ చరణ్ కి టెన్షన్

  By Srikanya
  |

  హైదరాబాద్: 'ఏకలవ్య' టైటిల్ తో రామ్ చరణ్ వస్తున్న సంగతి తెలిసిందే . రామ్ చరణ్ రీసెంట్ చిత్రం గోవిందుడు అందరివాడేలే మళయాళ వెర్షన్లో విడుదల అవుతోంది. ఈ వెర్షన్ కు గానూ ఏకలవ్య అనే టైటిల్ పెట్టి పోస్టర్స్ ని విడుదల చేసారు. మళయాళంలో మెగా హీరోలకు మంచి మార్కెట్ ఉంది. ఇప్పటికే అల్లు అర్జున్ అక్కడ దున్నేస్తున్నాడు. రామ్ చరణ్ కు అక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాంతో బండ్ల గణేష్ స్వయంగా రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి తెలుగు ప్రేక్షకులు ఆశించినంతగా అకట్టుకోని లేని గోవిందుడు మళయాళ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుండో చూడాలి. మళయాళ మార్కెట్ పై రామ్ చరణ్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో టెన్షన్ గా అక్కడ రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ చెప్పుకుంటున్నారు.

  ఇక ఈ చిత్రం కథ... ఎన్నారై అభిరామ్(రామ్ చరణ్)కి చిన్నప్పటి నుంచి భారతీయ సంప్రదాయాలంటే మక్కువ. తన తండ్రి ద్వారా తన కుటుంబం విడిపోయిన తీరు తెలుసుకుని, దాన్ని సరిచేసి తన తండ్రి కళ్లల్లో ఆనందం చూడటానికి ఇండియా వస్తాడు. అక్కడ తన తాత బాలరాజు(ప్రకాష్ రాజ్) అనే గ్రామ పెద్ద కి తనెవరో చెప్పకుండా ఆ కుటుంబంలోకి ప్రవేశిస్తాడు. తన బాబాయ్ (శ్రీకాంత్) ని కలిసి అతని ప్రేమ సమస్యను తీరుస్తాడు. తన మనవడు అని తెలిసాక బాలరాజు ఎలా స్పందిచాడు. ఎలా తన కుటుంబంలో ఉన్న సమస్యలను తీర్చి కుటుంబాన్ని ఒకటి చేసాడు అనేది మిగతా కథ.

  Today RamCharan's Ekalavya release

  ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ... కృష్ణవంశీ కలనీ, కథనీ ప్రేక్షకుల మధ్యకి తీసుకెళ్లడానికి చిత్రబృందం అంతా చేసిన కృషిలో నేనూ ఓ చేయి వేశానంతే. ఏ ఒక్కరి వల్ల సినిమా ఆడదు. ఓ అందమైన చిత్రంలో ప్రతి రంగుకీ ప్రాధాన్యం ఉంటుంది. ఈ రంగు వల్లే బొమ్మకి అందం వచ్చింది అని చెప్పలేం. 'గోవిందుడు..' సెట్స్‌కి నేనెప్పుడూ హోం వర్క్‌ చేసి వెళ్లలేదు. బాలరాజు వయసు నాది కాదు. ఆ జీవితం నాది కాదు. కృష్ణవంశీ అనుభవాలు, ఆయన జీవితాన్ని, సమాజాన్ని చూసిన విధానం.. ఇవన్నీ రంగరించి ఆ పాత్రను ఆయనే మలిచాడు అన్నారు.

  Today RamCharan's Ekalavya release

  నటీనటులు : రామ్ చరణ్, కాజల్, శ్రీ కాంత్, కమలినీ ముఖర్జీ, ప్రకాష్‌రాజ్, జయసుధ, ఎం.ఎస్.నారాయణ, పరుచూరి వెంకటేశ్వరరావు, రఘుబాబు, పోసాని తదితరులు

  కెమెరా: సమీర్ రెడ్డి,

  సంగీతం: యువన్‌శంకర్‌రాజా,

  ఆర్ట్: అశోక్‌కుమార్,

  ఎడిటింగ్: నవీన్,

  ఫైట్స్: పీటర్ హెయిన్స్, రామ్‌లక్ష్మణ్,

  రచన: పరుచూరి బ్రదర్స్,

  కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కృష్ణవంశీ

  నిర్మాత : బండ్ల గణేష్

  English summary
  Ram Charan's GAV Mal Dub Ekalavya ( U/A 143 ) Releasing in Kerala today
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X