»   » ఆ హీరో సినిమా పోస్టర్ మీద మూత్రం పోశారు: ట్విట్టర్లో రచ్చ రచ్చ!

ఆ హీరో సినిమా పోస్టర్ మీద మూత్రం పోశారు: ట్విట్టర్లో రచ్చ రచ్చ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన 'టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా' చిత్రం ఈ నెల 11న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. స్వచ్ఛభారత్ కాన్సెప్టుతో ఈచిత్రం తెరకెక్కింది. బహిరంగ మలమూత్ర విసర్జన తప్పు, ప్రతి ఒక్కరూ టాయిలెట్ ఉపయోగించాలి అని చెప్పే ప్రయత్నం ఈ సినిమా ద్వారా చేస్తున్నారు.

అక్ష‌య్ కుమార్, భూమి పెద్నెక‌ర్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇంట్లో టాయిలెట్ లేదన్న కారణంతో పెళ్లయిన వెంటనే తనను వదిలి వెళ్లిపోయిన భార్యను వెనక్కి తీసుకురావడానికి భర్త ఏం చేశాడు అనేది ప్రధాన కథాంశం.

పోస్టర్ మీద మూత్రం

పోస్టర్ మీద మూత్రం

సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్లు జోరుగా నిర్వహించారు. దేశ వ్యాప్తంగా సినిమా విడుదలవుతున్న అన్ని ప్రాంతాల్లో పోస్టర్లు అంటించారు. అయితే ఈ పోస్టర్ మీద ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ట్విట్టర్లో రచ్చ

ట్విట్టర్లో రచ్చ

ఈ ఫొటోపై ట్విట్టర్లో పెద్ద రచ్చ మొదలైంది. అతడి టాయిలెట్ అక్షయ్ కుమార్ సినిమా కంటే ముందే విడుదలైందని కొందరు జోక్స్ వేస్తుండగా.... ఈ దేశంలో కొందరు మనుషులు సినిమాలు చూసి మారుతారు అనుకోవడం పొరపాటే అని అభిప్రాయ పడుతున్నారు.

ఈ సినిమా మార్పు తెస్తుందా?

ఈ సినిమా మార్పు తెస్తుందా?

ఆగస్టు 11న ఈచిత్రం విడుదలవుతోంది. మరి ఈ సినిమా విడుదల తర్వాత అయినా సామాజిక జాడ్యంలా మారిన బహిరంగ మల, మూత్ర విసర్జన చేయడం మానాస్తారో? లేదో? చూడాలి.

పన్ను మినహాయింపు

పన్ను మినహాయింపు

ఉత్త‌ర ప్ర‌దేశ్ ఈ మూవీ ప‌న్ను మిన‌హాయింపు ఇచ్చారు. ప్ర‌ధాని మోదీ స్వ‌చ్ఛ్ భార‌త్ ఉద్య‌మాన్ని ప్ర‌ధానాంశంగా తీసుకొని ఈ మూవీ ని రూపొందించ‌డం వ‌ల్ల‌నే రాష్ట్రంలో ప‌న్ను మిన‌హాయింపు ఇచ్చిన‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది.

భూలోక స్వర్గం ఇదే : అక్షయ్ కుమార్ లావిష్ బంగ్లా

భూలోక స్వర్గం ఇదే : అక్షయ్ కుమార్ లావిష్ బంగ్లా

భూలోక స్వర్గం ఇదే : అక్షయ్ కుమార్ లావిష్ బంగ్లా ఇన్ సైడ్ ఫోటోస్.

(ఫొటోల కోసం క్లిక్ చేయండి)

English summary
Akshay Kumar’s new film, Toilet - Ek Prem Katha, is gearing up for release on Friday, and keeping in line with the star’s latest output, the film aims to raise awareness about a pressing social issue - this time, it’s sanitation.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu