»   »  టాలీవుడ్లో హయ్యెస్ట్ రెమ్యూరేషన్ తీసకునే హీరో ఎవరు?

టాలీవుడ్లో హయ్యెస్ట్ రెమ్యూరేషన్ తీసకునే హీరో ఎవరు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమ రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా బడ్జెట్ విషయాల్లో, హీరోల రెమ్యూనరేషన్ విషయాల్లో మాత్రం టాలీవుడ్ శర వేగంగా దూసుకోలుతోంది. ప్రస్తుతం తెలుగు టాప్ స్టార్లలో రూ. 10 కోట్లకు తక్కువ రెమ్యూనరేషన్ ఎవరూ తీసుకోవడం లేదంటే అతిశయోక్తి కాదేమో.

కొందరు హీరోలైతే ఇటు భారీ రెమ్యూనరేషన్ తో పాటు.....అదనంగా శాటిలైట్ రైట్స్ రూపంలో వచ్చే మొత్తం లేదా, లాభాల్లో వాటా కూడా తీసుకుంటున్నారు. ఈ మధ్య కాలంతో టాలీవుడ్ టాప్ స్టార్ల సినిమాలు కేవలం తెలుగుకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర బాషల్లో కూడా రిలీజ్ అవుతున్నారు.

తెలుగుతో పాటు పొరుగురాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాట, కేరళలో కొందరు తెలుగు స్టార్ల సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. బాలీవుడ్లోనూ మన సినిమాలు అనువాదం అవుతున్నాయి. తమ మార్కెట్ కు తగిన విధంగానే భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. టాలీవుడ్లో సర్కిల్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం రెమ్యూనరేషన్ విషయంలో మహేష్ బాబు అందరికంటే టాపులో ఉన్నారట.

మహేష్ బాబు

మహేష్ బాబు


మహేష్ బాబు ఒక సినిమాకు రూ. 20 కోట్ల రెమ్యూనరేషన్ తో పాటు లాభాల్లో వాటా కూడా తీసుకుంటున్నాడట.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్


పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకు రూ. 22 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్

ఎన్టీఆర్


జూ ఎన్టీఆర్ ఒక్కో సినిమాకు రూ. 20 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు టాక్.

ప్రభాస్

ప్రభాస్


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్కో సినిమాకు రూ. 18 కోట్లు తీసుకుంటున్నాడట. అయితే బాహుబలికి మాత్రం అతను అంతకంటే ఎక్కువే తీసుకుంటున్నాడని అంటున్నారు.

రామ్ చరణ్

రామ్ చరణ్


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక్కో సినిమాకు రూ. 17 కోట్ల వరకు తీసకుంటున్నాడట.

అల్లు అర్జున్

అల్లు అర్జున్


అల్లు అర్జున్ ఒక్కో సినిమాకు రూ. 13 నుండి 15 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు టాక్

English summary
Tollywood Tollywood A-Listers stars remunaration deatails.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu