»   » ఇండస్ట్రీ షాక్: డ్రగ్స్ రాకెట్ లో పట్టుబడ్ద ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ అభిషేక్‌

ఇండస్ట్రీ షాక్: డ్రగ్స్ రాకెట్ లో పట్టుబడ్ద ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ అభిషేక్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ నటుడు డ్రగ్స్‌ కేసులో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు చిక్కాడు. అభిషేక్ అంటే గుర్తు రాక పోవచ్చుగానీ నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో త్రిష ని పెళ్ళి చేసుకోవాలనుకునే విలన్ గా కనిపించిన నటుడు. అంతే కాదు కృష్ణ వంశి తీసిన డేంజర్ లో ఒక హీరో ఈ అభిషేక్‌, ఇతనూ మరో ఇద్దరు విదేశీయులు సహా మొత్తం ఆరుగురు.. కొన్నేళ్ల క్రితం ఓ ముఠాగా ఏర్పడ్డారు. సంపన్నులనే లక్ష్యంగా చేసుకొని చైన్ సిస్టం పద్దతిలోవ్యాపారంగా కొకైన్‌ విక్రయాలు జరుపుతున్నారు. వీళ్ళ నెట్వర్క్, మార్కెట్ కూడా భారీ స్థాయి లోనే ఉంది. హైదరాబాద్‌ వ్యాప్తంగా ఏకంగా 5వేల మంది వరకు కస్టమర్లను ఏర్పాటు చేసుకొని జోరుగా వ్యాపారం చేస్తున్నారు.

అయితే ఈ ముఠాని పట్టుకున్న పోలీసులు అభిషేక్‌ సహా ఆరుగురిని సోమవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 370 గ్రాముల కొకైన్‌, 12 సెల్‌ఫోన్లు, ఓ కారు, బైకు, రూ 46 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పీడీ యాక్టు నమోదు చేస్తామని డీసీపీ లింబారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సికింద్రాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో సోమవారం ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం..

 Tollywood Actor Abhishek Arrested In Drugs Case

దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన మండేలా జేమ్స్‌, ఘనా దేశీయుడు డ్రేక్‌ ఓవెన్‌ ఇద్దరూ బంధువులు. దుస్తుల వ్యాపారం పేరుతో బిజినెస్‌ వీసాపై ముంబై వచ్చారు. ఆ వ్యాపారం మాటున దక్షిణాఫ్రికా నుంచి కొకైన్‌ను ముంబైకి సరఫరా చేసేవారు. ఇది లాభసాటిగా ఉండటంతో వ్యాపారాన్ని హైదరాబాద్‌కూ విస్తరింపజేశారు. అందుకు నగరంలో సినీ నటుడు అభిషేక్‌ కుమార్‌, శ్రీనివాసులు అనే వ్యక్తిని పరిచయం చేసుకున్నారు.

వీరికి గ్రాము కొకైన్‌ను రూ.3,500కు విక్రయించేవారు. అభిషేక్‌ కుమార్‌, శ్రీనివాసులు దాన్ని రూ.4 నుంచి రూ.5 వేలకు అమ్మేవారు. నిందితుడు మండేలా జేమ్స్‌ 2011 నుంచి ఈ దందా చేస్తున్నట్లు తేలింది. అభిషేక్‌ కుమార్‌కు ఇది వరకే నేరచరిత్ర ఉంది. శ్రీనివాసులతో కలిసి 2012 డిసెంబరు 8న కొకైన్‌ సరఫరా చేస్తుండగా ఎస్సార్‌నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. బెయిల్‌పై విడుదలై గంజాయి సరఫరా చేసే వ్యక్తులను వెతికే పనిలో పడ్డారు.

ఈ క్రమంలో నిరుడు ఏప్రిల్‌లో మండేలా జేమ్స్‌, డ్రేక్‌ ఓవెన్‌ను ముంబైలో కలిశారు. అభిషేక్‌ కుమార్‌ 15-20 గ్రాముల దాకా కొనుగోలు చేసి తన స్నేహితులకు విక్రయించేవాడు. 4 రోజుల క్రితం అభిషేక్‌ కుమార్‌, శ్రీనివాసులు.. మండేలా జేమ్స్‌, డ్రేక్‌ ఓవెన్‌లను సంప్రదించి చెరో 20 గ్రాముల కొకైన్‌ కొనుగోలు చేస్తామని చెప్పారు. విషయం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, జేమ్స్‌, ఓవెన్‌, అభిషేక్‌ కుమార్‌, జి. శ్రీనివాసులతో పాటు మణికొండకు చెందిన జేఈ. నవీన్‌ కుమార్‌, ఎం. శ్రీనివా్‌సను అదుపులోకి తీసుకున్నారు

English summary
The city police on Monday arrested six people, including Tollywood actor Abhishek Kumar and two African drug peddlers, from Jubilee Hills for using and selling illegal drugs. Abhishek, who has acted in Danger, Aice, and Nuvvostanante Nenoddantana.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu