For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మానసిక ఒత్తిడి.. దెబ్బలు తింటేనే డబ్బులొస్తాయని మా పిల్లలకు చెబుతా: నటుడు అజయ్

  |

  ఎప్పుడైనా సరే సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కంటే కూడా ఒక మంచి నటుడికె ఎక్కువ విలువ ఉంటుందని చాలా మంది చెబుతుంటారు. అందుకే కొంతమంది కమెడియన్స్, సపోర్టింగ్ రోల్స్ లో నటించే వారు హీరోగా చేయడానికి ఎక్కువగా ఇష్టపడరు. ఇక టాలీవుడ్ లో మంచి టాలెంట్ ఉన్న నటులలో అజయ్ ఒకడు. పరిచయం అవసరం లేని ఈ నటుడు ఎలాంటి పాత్ర చేసినా కూడా చాలా ఈజీగా అందులో ఒదిగిపోతాడు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అజయ్ తన 20ఏళ్ళ సినీ ప్రస్థానం గురించి మాట్లాడాడు.

  ఆ సినిమాలతోనే కెరీర్ యూ టర్న్

  ఆ సినిమాలతోనే కెరీర్ యూ టర్న్

  అజయ్ మొదట ఖుషి సినిమాలో ఒక నార్మల్ కాలేజ్ స్టూడెంట్ గా జనాలను దృష్టిని ఎక్కువగా ఆకర్షించాడు. అంతకుముందు రెండు సినిమాలు చేసినప్పటికీ ఖుషి, ఒక్కడు, వర్షం, సై వంటి సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత గ్యాప్ లేకుండా క్యారెక్టర్ ఆర్జిస్ట్ గా బిజీగా మారిపోయిన అజయ్ కెరీర్ ఆ తరువాత మరికొన్ని సినిమాలతో విలన్ గక్ మరో స్థాయికి ఎదిగాడు.

  చదువు మధ్యలో వదిలేసి..

  చదువు మధ్యలో వదిలేసి..

  ఇటీవల భీష్మ, సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో వంటి హిట్ సినిమాల్లో కూడా మంచి పాత్రల్లో కనిపించాడు. ముఖ్యంగా తన జీవితంలో విక్రమార్కుడు కోసం చాలా కష్టపడినట్లు చెప్పిన అజయ్ కెరీర్ మొదట్లో చదువు మధ్యలో వదిలేసి ఇండస్ట్రీలో అడుగు పెట్టినందుకు నిలదొక్కుకుంటానో లేదో అని భయం చాలా కలిగింది. కానీ దర్శకులు నాకు ఇచ్చిన పాత్రలు, అలాగే ప్రేక్షకుల ప్రేమాభిమానం నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చిందని చెప్పాడు.

  మానసిక ఒత్తిడికి గురయ్యాను

  మానసిక ఒత్తిడికి గురయ్యాను

  సినీ జీవితం గురించి మాట్లాడుతూ.. ఖుషి సినిమా నుంచి భీష్మ వరకు నా 20 ఏళ్ల సినీ ప్రయాణం చాలా వేగంగా గడిచినట్లు అనిపిస్తోంది. పెద్దగా కష్టాలు ఏమి పడలేదు. కానీ ఈ స్థానంలో ఉంటానో లేదో అని కొంత వరకు మానసిక ఒత్తిడికి గురయ్యాను. ఎప్పుడైతే ఒక్కడు, వర్షం, సై సినిమాలతో కాస్త బిజీ అయ్యానో అప్పుడే కొంచెం ధైర్యం వచ్చింది. అప్పుడు వెనక్కి తిరిగి చూసుకొలెదు.

  ఆ పాత్ర కోసం చాలా కష్టపడ్డాను

  ఆ పాత్ర కోసం చాలా కష్టపడ్డాను

  ఒక నటుడిగా నా జీవితానికి మంచి గుర్తింపు తెచ్చిన సినిమాల్లో రాజమౌళి గారి విక్రమార్కుడు ఒకటి. అందులో చేసిన మెయిన్ విలన్ పాత్ర టిట్లా కోసం చాలా కష్టపడ్డాను. ఆ సినిమాతో పాటు అఆ, 24, ఇష్క్, అతనొక్కడే, ఆర్య 2, పోకిరి, దిక్కులు చూడకు రామయ్య వంటి సినిమాలు నటుడిగా నా స్థాయిని మరీంత పెంచాయి.

  ప్రస్తుతం ఆ సినిమాలతో బిజీగా..

  ప్రస్తుతం ఆ సినిమాలతో బిజీగా..

  మధ్యలో హీరోగా సారాయి వీర్రాజు అనే అనే సినిమా చేశాను. కానీ అది అంతగా ఆడలేదు. ఆ తరువాత హీరోగా ప్రయత్నాలు చేయకూడదు అనుకున్నాను. ప్రస్తుతం కొన్ని పెద్ద సినిమాల్లో కూడా చాలా మంచి పాత్రలో నటిస్తున్నాను. లిస్ట్ లో మెగాస్టార్ ఆచార్య సినిమాతో మరికొన్ని చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. అల్లు అర్జున్ పుష్ప సినిమా కోసం సంప్రదింపులు జరిగాయి. మరో రెండు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నాను.

  RRR Movie Update : SS Rajamouli Serious On Shriya Saran
  దెబ్బలు తింటేనే డబ్బులొస్తాయని..

  దెబ్బలు తింటేనే డబ్బులొస్తాయని..

  అయితే నా పిల్లల నుంచి రెగ్యులర్ గా ఒక కంప్లైంట్ ఎక్కువగా వస్తుంటుంది. నాకు ఇద్దరు పిల్లలు. చిన్నవాడు ఎక్కువగా ఏంటి డాడీ ఎప్పుడు చూసినా దెబ్బలు తింటావ్? అని అడుగుతుంటారు. అందుకు నేను.. దెబ్బలు తింటేనే డబ్బులు ఇస్తారని సరదాగా చెబుతుంటాను. నా ఫ్యామిలీ సపోర్ట్ నాకు చాలానే ఉంది. ముఖ్యంగా నా వైఫ్ శ్వేత ప్రోత్సాహం ఎంతగానో ఉంది.. అని అజయ్ వివరణ ఇచ్చారు.

  English summary
  Many people in the film industry say that a good actor is worth more than a hero. That’s why some comedians, who play supporting roles, don’t like to be made much of a hero. Ajay is one of the most talented actors in Tollywood. No matter what role the actor, who does not need any introduction, plays, it is very easy to get into it. In a recent interview, Ajay spoke about his 20-year cine reign.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X