»   »  సినీ నటుడు కిడ్నాప్, టీవీ ఛానెల్ సీఈవో హస్తం, అరెస్ట్

సినీ నటుడు కిడ్నాప్, టీవీ ఛానెల్ సీఈవో హస్తం, అరెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గత రెండు రోజులుగా సస్పెన్స్ గా నలుగుతున్న సినీనటుడు కాలెపు శ్రీనివాసరావు కిడ్నాప్ కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఈ కిడ్నాప్ కేసు ఆశ్చర్యకరమైన ముగింపుతో అందరినీ షాక్ ఇచ్చింది. ఈ కేసులో మొత్తం11మందిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఓ ఛానల్ సీఈవో శివకుమార్ ఉండటం విశేషం. అలాగే ఆయనతో సహా సీఐడీ హోంగార్డును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పట్టుకున్న వారి వద్ద నుంచి 74వేల నగదు, హ్యాండీ క్యామ్, సదరు ఛానల్ మైక్, ఓ కారు, గోల్డ్ చైన్, 13 సెల్ ఫోన్లు, బంగ్లాదేశ్ కు చెందిన పాస్ పోర్టును స్వాధీనం చేసుకున్నారు.

ఇదంతా ఓ సినిమా సీన్ ని తలపిస్తుంది. సీఐడీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న హోంగార్డు ఎస్‌ఐ గా మారాడు. అలాగే ఓ ఛానెల్‌లో పనిచేస్తున్న డ్రైవర్ కానిస్టేబుల్ అవతారం ఎత్తాడు. ఇద్దరు వ్యభిచారిణులలో ఒకరు మహిళా రిపోర్టర్ అవతారం ఎత్తారు. అంతా కలిసి ఓ సినీ నటుడి ఇంట్లోకి ప్రవేశించి వ్యభిచారం గృహం నిర్వహిస్తున్నావంటూ బెదిరించి డబ్బులు లాక్కున్నారు. అక్కడితో ఆగకుండా ఇంకా డబ్బు కావాలంటూ కిడ్నాప్‌కు పాల్పడి పోలీసులకు చిక్కారు.

Tollywood actor cheated by Tv Channel team

క్రైమ్ పూర్తి వివరాల్లోకి వెళితే... సినీ నటుడు కాలెపు శ్రీనివాసరావు(48) హైదరాబాద్ శ్రీకృష్ణానగర్‌లో నివసిస్తున్నారు. ఆయన నివాసంలోకి గత నెల 31వ తేదీన ఉదయం పదిన్నర గంటలకు అయిదుగురు యువకులు, ఇద్దరు యువతులు ప్రవేశించారు. తమను తాము పోలీసులమని, న్యూస్‌ఛానెల్ ప్రతినిధులమంటూ లాఠీతో పాటు డమ్మీ పిస్టల్, ఛానెల్ లోగోతో లోనికి ప్రవేశించి శ్రీనివాసరావును వ్యభిచారగృహం నిర్వహిస్తున్నావంటూ కెమెరా ఆన్‌చేసి బెదిరించారు.

అక్కడే ఉన్న బీరువాలో ఉన్న డబ్బు దొంగిలించారు. బలవంతంగా కారులో తీసుకుని వెళ్లి ఏటీఎం కార్డు ద్వారా మరింత డబ్బును డ్రా చేయించారు. రూ. 2 లక్షలు ఇస్తే టీవీ ఛానెల్లో రాకుండా చేస్తామంటూ నగరమంతా తిప్పారు. వారి బారినుంచి తప్పించుకొని బయటపడ్డ శ్రీనివాసరావు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసుల విచారించగా.. సీఐడీ విభాగంలో హోంగార్డుగా పని చేస్తున్న రాజు ఎస్‌ఐగా బిల్డప్ ఇచ్చాడని తేలింది. ఓ టీవీ ఛానెల్ డ్రైవర్‌గా పని చేస్తున్న మధు కానిస్టేబుల్‌గా పరిచయం చేసుకున్నాడు. ఇద్దరు వ్యభిచారిణులలో ఒకరు ఛానెల్ విలేకరినంటూ అదరగొట్టారు.

ఛానెల్ యజమానే మీ జీతాలు మీరే సంపాదించుకోండి నాక్కూడా నెలకు ఒక్కొకరు రూ.25 వేలు తెచ్చివ్వండి అని చెప్పడంతో తామంతా రోడ్డు కెక్కామని నిందితులు తెలిపారు. ఛానెల్ ప్రతినిధులమంటూ చెప్పుకున్న జలీల్, జగదీష్, మధు, సంజయ్‌రెడ్డి, లక్ష్మి, దుర్గ, హోంగార్డు రాజులను అదుపులోకి తీసుకున్నారు.

English summary
Film Actor Kalepu Srinivasa Rao (48) is a native of Sri Krishna Nagar Cheated by Tv channel staff and police.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu