»   »  15 ప్లాపుల తర్వాత వరుణ్ సందేశ్ చివరకు ఇలా అయ్యాడు...!

15 ప్లాపుల తర్వాత వరుణ్ సందేశ్ చివరకు ఇలా అయ్యాడు...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సరిగ్గా పదేళ్ల క్రితం 'హ్యాపీ డేస్' సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు వరుణ్ సందేశ్. తొలి సినిమా బ్లాక్ బస్టర్. ఆ తర్వాత 'కొత్త బంగారులోకం' సినిమా.... అది కూడా పెద్ద హిట్. ఈ రెండు సినిమాలతో తెలుగులో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు వరుణ్.

వరుణ్ సందేశ్ రూపంలో టాలీవుడ్‌కి మరో లవర్ బాయ్ దొరికాడు అని అందరూ భావించారు. పలువురు టాలీవుడ్ నిర్మాతలు వరుణ్ సందేశ్ తో సినిమాలు చేయడానికి పోటీడ్డారు. ఆ తర్వాత వరుణ్ సందేశ్ వరుస కమిట్మెంట్లతో బిజీ అయిపోయాడు.

తర్వాత అన్నీ ప్లాపులే

తర్వాత అన్నీ ప్లాపులే

ఆ రెండు సినిమాల తర్వాత వరుణ్ దేశ్ నటించిన ఒక్క సనిమా కూడా హిట్టవ్వలేదు. ఇప్పటి వరకు దాదాపు 20 చిత్రాల్లో వరుణ్ సందేశ్ నటిస్తే..... అందులో 15 సినిమాలు ప్లాప్ అయ్యాయి. దీంతో నిర్మాతలు వరుణ్ సందేశ్ తో సినిమాలు చేయడానికే ఇష్టపడటం లేదు. రెండేళ్ల నుండి వరుణ్ సందేశ్ ఎలాంటి సినిమాలు లేకుడా ఖాళీగానే ఉంటున్నాడు.

వెబ్ సిరీస్

వెబ్ సిరీస్

ప్రస్తుతం ఇంటర్నెట్ వాడకం బాగా పెరగడం, వెబ్ సిరీస్ లాంటివి బాగా ప్రాచుర్యంలోకి రావడంతో వెబ్ సిరీస్‌లలో నటించేందుకు వరుణ్ సందేశ్ ఆసక్తి చూపుతున్నాడు.

హే కృష్ణ

హే కృష్ణ

త్వరలో వరణ్ సందేశ్ ‘హే కృష్ణా' అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ప్లాపు హీరోలంతా అంతే...

ప్లాపు హీరోలంతా అంతే...

టాలీవుడ్లో వరుస ప్లాపులతో కొట్టుమిట్టాడుతున్న చిన్న హీరోలంతా ఇపుడు వెబ్ సిరీస్ ల వైపు చూస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ద్వారా కోట్లలో కాక పోయినా.... లక్షల్లో ఇన్ కం ఉండటంతో పలువురు ఇటు వైపు అడుగులు వేస్తున్నారు.

English summary
Tollywood star Varun Sandesh coming up with a web series titled 'Hey Krishna'. The annoncement has been made recently.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu