»   » జ్యోతిలక్ష్మిని పట్టించుకునేవాళ్లేరి, క్రేజ్ లేకపోతే ఇంత దారణంగానా?

జ్యోతిలక్ష్మిని పట్టించుకునేవాళ్లేరి, క్రేజ్ లేకపోతే ఇంత దారణంగానా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా పరిశ్రమలో ఎవరు వెలుగు ఎంత కాలం ఉంటుందో ఎవరూ చెప్పలేరు. అలాగే వెలుగు ఉన్నంతకాలం దీపం చుట్టూ పురుగుల్లా తిరిగినవాళ్లే, వెలుగు తగ్గిపోతే ,దీపం ఆరిపోతూంటే లేదా పూర్తిగా ఆరిపోతే కన్నెత్తి కూడా చూడరు. ముఖ్యంగా తమతో పనిచేసిన క్రేజ్ లేని సినిమావాళ్లు చనిపోతే ...వెళ్లి ఆ కుటుంబాన్ని పలకరించి నాలుగు సానుభూతి మాటలు చెప్దామనే వాళ్లు ఇక్కడ కరువు. ఆ విషయం ఎన్నో సార్లు ప్రూవ్ అయ్యింది. తాజాగా సినీ నటి జ్యోతిలక్ష్మి విషయంలో మరోసారి నిజమైంది.

తెలుగు,తమిళం,మలయాళం, కన్నడం, హిందీ మొదలగు భాషల్లో పలు చిత్రాల్లో నటించిన గొప్పనటి, నర్తకి జ్యోతిలక్ష్మి. జ్యోతిలక్ష్మి జీవించి ఉన్నప్పుడు తన చుట్టూ తిరిగిన సినిమా జనం, డాన్సింగ్ క్వీన్ అంటూ పొగడ్తల వర్షం కురించిన వాళ్లెవరూ ఆ నటీమణి కన్నుమూస్తే ఆమెకు నివాళులర్పించడానికి కూడా రాలేకపోయారు. తన కుటుంబానికి సానుభూతిని అందించే ప్రయత్నం చేయలేకపోయారు.

జ్యోతిలక్ష్మిని చివరి చూపు చూడడానికి పట్టుమని పది మంది సినీ ప్రముఖులు కూడా రాలేదు. ముఖ్యంగా తెలుగు సినీ ప్రముఖులు హైదరాబాద్‌లో చానళ్ల కెమెరాల ముందు జ్యోతిలక్ష్మి లెజెండ్, డాన్సింగ్ క్వీన్ అంటూ నాలుగు ముక్కలు మాట్లాడి చేతులు దులిపేసుకోవటం దారుణం.

వైరల్ ఫీవర్ తో..

వైరల్ ఫీవర్ తో..

జ్యోతిలక్ష్మి కొద్దికాలంగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. రెండు రోజుల క్రితం ఫీవర్ ఎక్కువ అవడంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రికి వెళ్లారు.

హాస్పటిల్ నుంచి వచ్చాక

హాస్పటిల్ నుంచి వచ్చాక

హాస్పటిల్ నుంచి మంగళవారం సాయంత్రం ఇంటికి వచ్చారు. ఆరోగ్యం విషమించడంతో నిన్న రాత్రి 11:57కు ఆమె మృతి చెందినట్లు తెలిసింది.

అంత్యక్రియలు

అంత్యక్రియలు

ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైలోని కన్నమ్మ స్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు జరగనునున్నాయి.

జననం

జననం

జ్యోతిలక్ష్మి 1948లో జన్మించింది. జ్యోతిలక్ష్మి దాదాపు 300ల చిత్రాల్లో నటించి అలరించారు.

అయ్యింగార్ల కుటుంబంలో..

అయ్యింగార్ల కుటుంబంలో..

జ్యోతిలక్ష్మి తమిళ అయ్యంగార్ల కుటుంబంలో పుట్టింది. ఎనిమిది మంది తోబుట్టువుల్లో ఈమె అందరికంటే పెద్దది

జయమాలిని చిన్నది

జయమాలిని చిన్నది

జయమాలిని వీరందరిలోకెల్లా చిన్నది. ఎనిమిది మందిలో ఐదుగురు ఆడపిల్లలు.

ఐదేళ్ల వయస్సులోనే

ఐదేళ్ల వయస్సులోనే

ఈమెను చిన్నతనం నుంచి ఎస్.పి.ఎల్.ధనలక్ష్మి అనే నటి దగ్గర పెరిగింది. జ్యోతిలక్ష్మి ఐదేళ్ళ వయసులోనే సినీరంగ ప్రవేశం చేసింది.

వెయ్యికి పైగా పాటలు

వెయ్యికి పైగా పాటలు


ఈమె డ్యాన్సర్ జయమాలిని అక్క. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో వెయ్యికి పైగా పాటల్లో నర్తించింది.

ఇరవై సినిమాల్లో హీరోయిన్ గా

ఇరవై సినిమాల్లో హీరోయిన్ గా


అయితే ఈమె కేవలం ఐటమ్ సాంగ్స్‌కే పరిమితం కాలేదు. హీరోయిన్‌గా ఇరవై చిత్రాల్లో నటించి మెప్పించింది. తమిళంలో పది సినిమాలలో హీరోయిన్ గా నటించింది.

తొలిసారి

తొలిసారి


ఆమె అన్న వరస అయిన దర్శక నిర్మాత టి.ఆర్.రామన్న ఎం.జీ.ఆర్ హీరోగా నటించిన సినిమాలో డాన్స్ చేయించాడు.

ఎనిమదేళ్ల వయస్సులోనే

ఎనిమదేళ్ల వయస్సులోనే


ఎనిమిదేళ్ళ వయసులో శివాజీ గణేశన్ చిత్రం కార్తవరాయన్ కథలో డ్యాన్స్ చేసింది.

ఈ సినిమాతోనే..

ఈ సినిమాతోనే..


1963లో విడుదలైన ఎం.జీ.ఆర్ చిత్రం పెరియ ఇడత్తుపెణ్‌తో చిత్రంతో ఆమె నృత్యకారిణిగా అందరికీ సుపరిచితురాలైంది.

హాస్యపాత్రలో

హాస్యపాత్రలో


ఈ చిత్రంలో నగేష్ సరసన వల్లి అనే హాస్యపాత్రలో కూడా నటించి అలరించింది.

భరతనాట్య కారణి

భరతనాట్య కారణి


ఈమె చిన్నతనంలో రామయ్య పిళ్ళై అనే నాట్యగురువు దగ్గర భరతనాట్యం నేర్చుకుంది. ఈ నాట్యశిక్షణ సినిమాలో డ్యాన్స్ చేయటానికి ఆమెకు చాలా ఉపయోగపడింది.

తెలుగులో...

తెలుగులో...

1967లో విడుదలైన పెద్దక్కయ్య అనే సినిమాతో జ్యోతిలక్ష్మి ఎంట్రీ ఇచ్చింది.

తెలుగులో పాపులర్

తెలుగులో పాపులర్

1973లో శోభన్ బాబు హీరోగా వచ్చిన ఇదాలోకం సినిమాలో గుడి ఎనక నా సామి గుర్రమెక్కి కూకున్నాడు అన్న పాట ఆమెకు గుర్తింపు పెట్టింది.

రీసెంట్ గా

రీసెంట్ గా


తెలుగు ప్రేక్షకులను తన డ్యాన్స్‌తో ఉర్రూతలూగించిన జ్యోతిలక్ష్మి కుబేరులు అనే సినిమాలో మళ్లీ అదే పాటకు నర్తించింది.

సీనియర్స్ తో

సీనియర్స్ తో


ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ వంటి సీనియర్ నటులతో జ్యోతిలక్ష్మి ఆడిపాడింది.

ప్రేమ వివాహం

ప్రేమ వివాహం


కెరీర్ మంచి ఊపులో ఉండగానే జ్యోతిలక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకుంది

భయపడేవారు

భయపడేవారు


జ్యోతిలక్ష్మి పాట కోసమే సినిమాలకు వెళ్లే జనం అప్పట్లో లేకపోలేదు. జ్యోతిలక్ష్మి పేరు తమ పిల్లలకు పెట్టడానికి భయపడేవారు

English summary
Jyothi Lakshmi is an South Indian film actress who has appeared in more than 300 movies. She died today at chennai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu