For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  న్యూ ఇయిర్ నైట్ : మన హీరోయిన్స్...ఎక్కడ..ఎవరితో?? (ఫోటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్ : కొత్త సంవత్సరం వస్తుందంటే అందరికీ ఉషారే. అందులోనూ సెలబ్రెటీల లైఫ్ మరీను. నిన్నటి రోజు రాత్రిని వారు చాలా గ్రాండ్ గా జరుపుకోవటానికి ప్లాన్ చేసుకుంటూంటారు. మరి మన తెలుగు సినిమా ముద్దుగుమ్మలు...నిన్నటి రాత్రి ఎక్కడ గడిపారు? ఏం చేసారు? వారి ప్రణాళికలేమిటి? అందరికీ ఆసక్తే.

  2013 ఆశల పల్లకి ఎక్కి... కొత్త యేడాదిలోకి వచ్చేసాం. మంచో, చెడో.. 2012 కొన్ని జ్ఞాపకాలు మిగిల్చింది. వాటిని నెమరువేసుకొంటూ.. నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టేసాం. నిన్నటి రోజు ఆ సంవత్సరానికి చివరి రోజు.. అందరికీ ప్రత్యేకమే. కొత్తేడాది సంబరాలు డిసెంబరు 31 రాత్రి నుంచీ ప్రారంభమైపోయాయి.

  శ్రీరామరాజ్యం, కృష్ణం వందే జగద్గురం చిత్రాలలో మాత్రమే క్రితం సంవత్సరం కనపడిన ఈ మళయాళీ భామ... తీరిక దొరికితే నయనతార దుబాయ్‌ వెళుతుంది. ఎందుకంటే అక్కడ నయన్‌ అన్నయ్య ఉంటున్నారు. ఈ యేడాది క్రిస్మస్‌ వేడుకలను నయన్‌ అక్కడే చేసుకొంది. ఇక కొత్త యేడాది తొలి రోజునా అక్కడే ఉంది. ఆ తరవాత నాగార్జునతో సినిమా షూటింగ్‌లో

  బిజినెస్ మ్యాన్, సారొచ్చారు చిత్రాలతో కాజల్ క్రితం సంవత్సరం పలకరించింది. నిత్యం సినిమాలతో తీరిక లేకుండా గడిపినా, అప్పుడప్పుడూ కుటుంబ సభ్యుల కోసం కూడా సమయం కేటాయించడం ఎలాగో కాజల్‌కి బాగా తెలుసు. ఈ యేడాది దీపావళి కుటుంబ సభ్యుల మధ్యే జరుపుకొంది. ఇప్పుడు డిసెంబరు 31 వేడుకలూ అక్కడే. అందుకే రెండు రోజుల ముందే ముంబై వెళ్లిపోయింది. అక్కడ చెల్లాయి నిషా అగర్వాల్‌తో కలిసి.. సంబరాలు జరుపుకుంది. ''యేడాదంతా కుటుంబానికి దూరంగా ఉంటున్నాం కదా? కనీసం ఇలాంటి అరుదైన క్షణాలనైనా వారితో పంచుకోవాలి'' అని చెబుతోంది కాజల్‌. చెల్లాయిదీ అదే మాట.

  తమన్నా ఇప్పుడు ముంబైలో ఉంది. తన కుటుంబ సభ్యుల మధ్య కొత్త యేడాదికి స్వాగతం పలకింది. ''నాకు కుటుంబంతో అనుబంధం ఎక్కువ. ముఖ్యంగా నేను నాన్న కూచీని. నా ముఖ్యమైన ప్రతి సందర్భంలోనూ ఆయన ఉండాలని కోరుకొంటా. స్నేహితులన్నా.. వారినీ ఇంటికే రమ్మంటాను. అందరూ కలిస్తే పండగంతా మా ఇంట్లోనే ఉన్నట్టుంటుంది'' అని తమన్నా చెబుతోంది.

  2012లో అమలాపాల్‌ మంచి విజయాలే సాధించింది. స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకొంది. 'లవ్‌ ఫెయిల్యూర్‌'తో ఓ విజయం దక్కించుకొంది. ప్రస్తుతం 'నాయక్‌'లో నటిస్తోంది. అల్లు అర్జున్‌ సినిమా 'ఇద్దరమ్మాయిలతో'లోనూ ఆమే హీరోయిన్ . ప్రస్తుతం ఈ సినిమా బ్యాంకాక్‌లో షూటింగ్ జరుపుకొంటోంది. కాబట్టి నూతన సంవత్సర వేడుకలూ అక్కడే జరుపుకుంది. ''సినిమాల్లోకి వచ్చిన తరవాత పండుగలన్నీ... సెట్‌లోనే చేసుకొంటున్నా. కొత్త యేడాది అందరికీ మంచి జరగాలి'' అంటోంది అమలాపాల్‌. ఈ సినిమా సెట్‌లోనే కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు హీరో అల్లు అర్జున్‌, మరో నాయిక కేథరిన్‌, దర్శకుడు పూరి జగన్నాథ్‌.

  'సక్కూబాయ్‌.. గరమ్‌చాయ్‌' అంటూ 'ఢమరుకం'లో ప్రత్యేక గీతంతో హోరెత్తించింది ఛార్మి. సంక్రాంతికి 'నాయక్‌'లోనూ ఐటెమ్‌ పాటతో మెరవనుంది. 31వ తేదీ రాత్రి వేడుకల్లోనూ తన నృత్య ప్రతిభ చూపింది. హైదరాబాద్‌లోని జూబ్లి హిల్స్ క్లబ్‌లో ఛార్మి నృత్యం చేసింది. పాపులర్ సాంగ్స్ ఎంపిక చేసుకొని డాన్స్ చేసింది. ఈ కార్యక్రమంలో తషూ కౌశిక్‌, పూనమ్‌ కౌర్‌ కూడా చిందేసారు.

  నటిగా, నిర్మాతగా 2012... మంచు లక్ష్మీప్రసన్నకు గుర్తుండిపోతుంది. 'గుండెల్లో గోదారి' సినిమా విడుదలకు సిద్ధమైంది. మణిరత్నం దర్శకత్వంలో 'కడలి' చిత్రంలో నటించే అవకాశం అందుకొంది. 2013లోనూ మెరుగైన ఫలితాలు సాధించాలని ఆశపడుతున్నారామె. మధుర జ్ఞాపకాలు మిగిల్చిన ఈ యేడాదికి ఘనంగా వీడ్కోలు పలకారు. భర్తతో కలిసి ఆమె యూరప్‌ వెళ్లారు. అక్కడ సంబరాలు జరుపుకున్నారు.

  స్నేహితులంతా కలిసి.. విందు వినోదాలకి సన్నాహాలు చేసుకొంటున్నారు. సినిమా వాళ్లకైతే ఈ హంగామా ఇంకాస్త ఎక్కువగా చేసుకున్నారు. హీరోయిన్స్ ఈ రోజుని ప్రత్యేకంగా గడపడానికి ముందు నుంచీ... ప్రణాళికలు వేసుకొన్నారు. కొందరు సినిమా వాతావరణానికి దూరంగా ఈ వేడుక జరుపుకున్నారు. ఇంకొందరు సినిమా పనుల్లోనే ఉన్నారు. ఇంకొందరు ఈ వేడుకల్లో సందడి చేసి పారితోషికం అందుకున్నారు.

  English summary
  People welcome New Year and even beautiful Tollywood star actresses have their own grand plans for New Year bash. Following are New Year plans of stars. Nayan, if gets time will fly to Dubai and will enjoy with her brother family. Nayan spent her X’ Mas earlier with her brother family. This time after enjoying New Year will be back to shooting with Nagarjuna's film. She hopes New Year will bring new luck.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X