»   » ప్రభుత్వం ఓకే...బంద్ లేదు: మురళీ మోహన్

ప్రభుత్వం ఓకే...బంద్ లేదు: మురళీ మోహన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మా కోరికలను ప్రభుత్వం తుచ తప్పకుండా అమలు చేయడానికి అంగీకరించింది.శుక్రవారం నుంచి పరిశ్రమ కార్యకలాపాలు యథావిధిగా జరుగుతాయ అని మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మురళీమోహన్‌ మీడియాకి తెలిపారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ...చిన్న నిర్మాత చిత్రసీమకి పట్టిన పెద్ద జాడ్యాన్ని వదిలించేందుకు ప్రయత్నించారు. సఫలమైంది. రవిచంద్‌ పైరసీపై పోరాటం మొదలుపెట్టగానే మేం సంపూర్ణమైన మద్దతుని తెలిపాం. పరిశ్రమలో పలు పార్టీలు, వర్గాలున్నా..మేమందరం ఒక్కటే అని మరోసారి నిరూపితమైంది. భవిష్యత్తులోనూ పరిశ్రమలోని వారందరూ ఒకే మాట మీద, తాటి మీద నిలుస్తాం. ఒకే బాటలో నడుస్తామన్నారు.మరో ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు మాట్లాడుతూ..."రవిచంద్‌ తీసుకున్న నిర్ణయం పరిశ్రమను నిద్రలేపినట్టయింది. ఇది ఏ ఒక్కరి సమస్యో కాదు.. పరిశ్రమ మొత్తానిది అన్నారు. అలాగే నిర్మాతల మండలి అధ్యక్షులు ఎమ్‌.శ్యామ్ ‌ప్రసాద్ ‌రెడ్డి మాట్లాడుతూ "నిర్ణీత కాల పరిమితిలోగా అన్నీ అమలవుతాయని రాష్ట్ర సినిమాటోగ్రాఫీ మంత్రి హామీ ఇచ్చారు. తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది" అన్నారు. ఈ సమావేశంలో సినీ ప్రముఖులు డీవీయస్‌ రాజు, పరుచూరి గోపాలకృష్ణ, జయసుధ, శేఖర్‌ కమ్ముల, కోన వెంకట్‌, సురేందర్‌రెడ్డి, శివాజీ, కల్యాణి, తేజ, ప్రసన్నకుమార్‌, నల్లమలుపు బుజ్జి, కూచిపూడి వెంకట్‌, చంద్రసిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu