»   » ఎక్కువ మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతా : శివాజీ రాజా అన్నది ఎవర్ని

ఎక్కువ మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతా : శివాజీ రాజా అన్నది ఎవర్ని

Posted By:
Subscribe to Filmibeat Telugu

నటుడు శివాజీ రాజా టాలీవుడ్ లో చాలాకాలంగా కమెడియన్ గానూ, క్యారెక్టర్ ఆర్టిస్టు గానూ దాదాపు ఇరవయ్యేళ్ళుగా టాలీవుడ్ లో ఉన్నాడు. తేరమీదనే కాదు వెనుక కూడా మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌లో చాలా కీలక బాధ్తల్లొ పాలు పంచుకుని ఇప్పుడు మా అధ్యక్షుడిగా ఉనాడు. ఇన్ని సంవత్సరాల్లోనూ సివాజీ రాజా ఎప్పుడూ పెద్దగా వివాదాల్లో కనిపించడు. అందరితోనూ సరదాగా కలిసి పోయే మనస్థత్వం ఉన్న ఈ నటుడు కొన్ని సార్లు తానూ సమ్యమనం కోల్పోయే పరిస్థితి వచ్చిందనీచెప్పాడు ....

అనుచిత వ్యాఖ్యలు

అనుచిత వ్యాఖ్యలు

సీనియర్ నటులు రంగనాథ్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేసిన మరో పెద్దనటుడితో దురుసుగా ప్రవర్తించాననీ, కానీ దానివెనుక ఉన్న కారణం కూడా సరైందేననీ చెప్పాడు. యూట్యూబ్ చానెల్ ఐడ్రీం కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో శివాజీ ఇలా చెప్పాడు..

చిరంజీవిగారు కూడా

చిరంజీవిగారు కూడా

‘సీనియర్‌ నటుడు రంగనాథ్‌గారితో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఉదయ్‌కిరణ్‌ ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆయన ఎంతో బాధపడ్డాడు. అలాంటి వ్యక్తి సూసైడ్‌ చేసుకోవడం నాకు ఎంతో బాధను మిగిల్చింది. ఆయన మరణవార్త విని ఆయన ఇంటికి వెళ్లా. నాతోపాటు చిరంజీవిగారు కూడా వచ్చారు.

ఆర్టిస్టులు అందరూ అక్కడికి రాలేరనే

ఆర్టిస్టులు అందరూ అక్కడికి రాలేరనే

రంగనాథ్‌ గారి ఇల్లు నగరానికి చాలా దూరం. చాలా కష్టపడి వెళ్లాలి. అందుకనే సినిమా ఆర్టిస్టులు అందరూ అక్కడికి రాలేరనే భావనతో ఆయన మృతదేహాన్ని ‘మా' కార్యాలయంలో పెట్టించా. అప్పుడు అక్కడకు వచ్చిన ఓ పెద్ద వ్యక్తి, నటుడు నా దగ్గరకు వచ్చి ‘ఈయన శవాన్ని ఇక్కడెందుకు పెట్టావు' అని కోపంగా అడిగాడు.

చెప్పు తీసుకుని కొడతా

చెప్పు తీసుకుని కొడతా

నాకు చాలా కోపం వచ్చింది. ‘ఏంట్రా అన్నావు. ఎక్కువ మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతా' అని హెచ్చరించా. ఆయన ఇండస్ట్రీలో చాలా పెద్ద వ్యక్తి. కానీ, సంస్కారంలో నా కాలి గోటికి కూడా సరిపోడు. కేవలం రంగనాథ్ గారి మీద నాకున్న ప్రత్యేక అభిమానం తో ఆయన భౌతిక కాయాన్ని మా కార్యాలయాని తీసుకు వచ్చానని ఆయన ఉద్దెశ్యం.

ఎప్పుడూ జరిగేదే

ఎప్పుడూ జరిగేదే

కానీ ఏ సీనియర్ ఆర్టిస్టు మృతి చెందినా మా కార్యాలయం లో సందర్శనార్థం కొద్ది సేపు ఉంచటం ఎప్పుడూ జరిగేదే. ఆ విషయాన్ని పట్టించుకోకుండా పెద్దాయన గురించి చులకన గా మాట్లాడటం తో తట్టుకోలేక పోయా అంటూ అప్పటి సంఘటనని గుర్తు చేసుకున్నాడు శివాజీ రాజా...

English summary
Tollywood Comedian And Actor Sivaji Raja shared a Bitter experience with a senior actor on a day when Ranganath suicide in a Latest interview
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu