»   » వెన్నెల కిషోర్ నాలుగో పెళ్లి కూడా ఆగి పోయింది

వెన్నెల కిషోర్ నాలుగో పెళ్లి కూడా ఆగి పోయింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ హాస్య నటుడు తన ట్విట్టర్లో ఫన్నీ ట్వీట్ చేసాడు. తన నాలుగో పెళ్లి ఆగిపోయిందంటూ ఆయన ట్వీట్ చేయడంతో తొలుత అంతా ఆశ్చర్య పడ్డారు. మనకు తెలియకుండా వెన్నల కిషోర్ కు ఇన్ని పెళ్లిళ్లు ఎప్పుడు జరిగాయంటూ ఒక్క క్షణం అలా స్టన్నయ్యారు. అయితే అసలు విషయం తెలిసి నవ్వుకున్నారు.

తాను నటించిన వివిధ చిత్రాల కోసం పెళ్లి కుమారుడి గెటప్‌ వేసుకుని, చివరికి ఆ వివాహం కాస్తా జరగకుండా ఆగిపోయిందని ఆయన అర్థం. వెన్నెల కిషోర్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. తాను నటిస్తున్న చిత్రాల్లోనూ పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోందని, ఇప్పటి వరకు నాలుగు పెళ్లిళ్లు ఆగిపోయాయని సరదాగా ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన పెళ్లి కుమారుడి గెటప్‌లో ఉన్న ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

హీరో పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్లి సెట్టవ్వడం, తీరా తాళి కట్టే సమయానికి హీరో రావడం....ఎలాగో అలా హీరోయిన్ ను దక్కించుకోవడం ఈ మధ్య తెలుగు సినిమాల్లో కామన్ గా కనిపిస్తున్న సీన్లు. ఇలాంటి సీన్లలో బాధితుడుగా మారే పెళ్లి కొడుకు పాత్రలో వెన్నెల కిషోర్ నటిస్తున్నాడు.

English summary
Tollywood comedian Vennela Kishore fourth wedding also halted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu