twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మమ్మల్ని బాదొద్దు బాబోయ్(సినీ ప్రముఖుల ధర్నా)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సర్వీస్ టాక్స్‌తో కళాకారులను బాదడం మానుకోవాలని తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు హైదరాబాద్ లోని ఫిల్మ్ చాంబర్ ఎదట ధర్నా చేపట్టారు. ఇప్పటికే చాలా కష్టాల్లో ఉన్న సినీ పరిశ్రమకు.... సర్వీస్ టాక్స్ తట్టుకోలేని భారమని వారు ఆవేదన వ్యక్తం చేసారు.

    వెంటనే సేవా పన్ను రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని, రాబోయే పార్లమెంటు సమావేశాల్లో సేవా పన్ను బిల్లు ప్రవేశ పెట్టాలని ఆయన మా అధ్యక్షుడు మురళీ మోహన్ డిమాండ్ చేసారు. ఈ ఆందోలన కార్యక్రమంలో చిత్ర పరిశ్రమకు చెందినప 24 శాఖలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు.

    ఈ కార్యక్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు డి. రామానాయుడు, తమ్మారెడ్డి భరద్వాజ, మురళీ మోహన్, నాగిరెడ్డి, అలీ, హీరో సునీల్, శివాజీ రాజా, దర్శకుడు తేజతో పాటు ఇతర నటీనటులు, టెక్నీషియన్స్, నిర్మాతలు తదితరులు పాల్గొన్నారు. సర్వీస్ టాక్స్ పై దక్షిణాది సినీ పరిశ్రమలన్నీ ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తున్నామని మురళీ మోహన్ వెల్లడించారు. మరో వైపు చెన్నైలో కూడా ఆందోళన కార్యక్రమం కొనసాగుతోంది.

    సంవవత్సరంలో సగటున నిర్మించిన సినిమాలు, వాటికి పెట్టిన ఖర్చుతో పోలిస్తే... అసలు లాభాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో పరిస్థితి మరీ అద్వాన్నంగా ఉంది. ఈ తరుణంలో సర్వీస్ టాక్స్ విధిస్తే నిర్మాతలపై తీవ్రమైన ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది.

    English summary
    Tollywood Celebrities held Dharna against service tax at Film Chamber. This is to protest the government's move of bringing the film industry under the purview of the service tax.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X