»   » హిట్ ఎఫెక్ట్ : డైరక్టర్ కు కొత్త జాగర్ కారు గిప్ట్ (ఫొటోలు)

హిట్ ఎఫెక్ట్ : డైరక్టర్ కు కొత్త జాగర్ కారు గిప్ట్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాని, లావణ్యా త్రిపాఠిలతో దర్శకుడు మారుతి చేసిన భలే భలే మొగాడువోయ్ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో మారుతి చాలా ఉషారుగా ఉన్నారు. గతంలో మారుతి నిర్మాతగా, దర్శకుడుగా ఎన్నో విజయాలు చూసినప్పటికి ఈ చిత్రం మాత్రం అతని కెరీర్ లో మెమరబుల్ చిత్రంగా మిగిలిపోయింది.

తాజాగా ఆయన ఇంటికి కాస్ట్లీ జాగర్ కారుని డెలవరీ అయ్యింది. ఈ కారుని నిర్మాతలు గిప్ట్ గా ఇచ్చారని సమాచారం. తన కొత్త జాగర్ కారుని చూసుకుని మారుతి మురిసిపోతున్నారు. దాంతో ఆయన సెల్ఫీలు తీసుకున్నారు. ఈ సమయంలో ఆయనతో పాటు యువి క్రియేషన్స్ కో ప్రొడ్యూసర్ వంశీ కూడా ఉన్నారు.


maruti2

మారుతి కొత్త చిత్రం విశేషాలకు వస్తే...


'గోపాల గోపాల' తరవాత వెంకటేష్‌ మరో సినిమా మొదలవ్వలేదు. అయితే కథలు మాత్రం వింటున్నారు. ఇటీవల మారుతి కథకి వెంకీ ఓకే చెప్పారు. ఈ సినిమా డిసెంబరు నుంచి పట్టాలెక్కబోతోంది.


maruti

హీరోయిన్ గా నయనతారని ఎంచుకొన్నట్టు సమాచారం. ఇదివరకు వెంకీ, నయన కలసి 'తులసి'లో నటించారు. ఆ చిత్రం విజయవంతమైంది. ఆ తరవాత 'రాధా'లో కలసి నటించాల్సింది. ఆ సినిమా అనివార్యకారణాల వల్ల ఆగిపోయింది. ఇప్పుడు ఈ కాంబినేషన్‌ మరోసారి సెట్టయ్యింది. ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే పూర్తివివరాలు తెలుస్తాయి.

English summary
The costliest car Jaguar was delivered to director Maruthi's residence . He seems to be so joyful that the Jaguar is now at his home.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu