For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మిస్‌అమెరికా నీనాపై టాలీవుడ్ కన్ను?(ఫోటో ఫీచర్)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: తెలుగమ్మాయి నీనా దవులూరి మిస్ అమెరికా కిరీటం దక్కించుకున్న సంగతి తెలిసిందే. కిరీటం దక్కించుకున్న తర్వాత నీనా ఇండియన్ మీడియాతో మాట్లాడుతూ...'నేను భవిష్యత్తులో కార్డియాలజిస్టును కావాలనుకుంటున్నట్లు వెల్లడించింది. భరత నాట్యం, కూచి పూడిలో మంచి ప్రావీణ్యం ఉందని, తెలుగు సినిమాలు చూడటం అంటే కూడా తనకు ఎంతో ఇష్టమని వెల్లడించింది. అంతే కాదు 2007లో వచ్చిన వర్షం మూవీ కూడా నీనా చూసిందట. ప్రభాస్ పెర్ఫార్మెన్స్ అంటే చాలా ఇష్టమని కూడా వెల్లడించింది. అయితే ఆమెకు సినిమాల్లోకి వచ్చే ఉద్దేశ్యం అసలు లేదని సమాచారం.

  నీనా దవులూరి తెలుగు సినిమాపై తన ఇష్టాన్ని వెల్లడించడం, ప్రభాస్‌కు గురించి మాట్లాడటంతో......సినీ పరిశ్రమలో ఈ విషయం చర్చనీయాంశం అయింది. సాధారణంగా అందాల పోటీల్లో పాల్గొన్న వారు ఆ తర్వాత మోడలింగులో అడుగు పెట్టడం, సినిమా రంగం వైపు చూడటం మామూలే. ఈ నేపథ్యంలో నీనా భవిష్యత్‌లో సినిమా రంగం వైపు వచ్చే అవకాశం ఉందా? అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? అనే విషయాల గురించి ఆరా తీసే ప్రయత్నంలో ఉన్నారట కొందరు దర్శకులు, నిర్మాతలు. నీనా బంధువులు విజయవాడకు చెందిన వారు కావడంతో అటు నుంచి పని మొదలు పెట్టారట. చూద్దాం వారి ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో?

  అమెరికాలో పుట్టి పెరిగిన నీనా తల్లిదండ్రులు విజయవాడకు చెందిన వారే. చిన్నతనంలో కొంత కాలం నీనా ఇక్కడే పెరిగింది. నీనా తల్లి పేరు శైల రంజని, తండ్రి పేరు దవులూరి కోటేశ్వర చౌదరి. 1981లో నీనా ఫ్యామిలీ అమెరికాకు షిప్టయింది. ఏప్రిల్ 20, 1989లో న్యూయార్కులో నీనా జన్మించింది. నీనా తండ్రి అమెరికాలోని మిచిగాన్‌లోని సెయింట్ జోసెఫ్ ఆసుపత్రిలో వైద్యుడిగా పని చేస్తున్నారు. మిచిగాన్ యూనివర్శిటీలో చదివినినీనా చదువులతో పాటు బ్యూటీ కాంపిటీషన్లో కూడా టాపర్‌‌గా ఉండేది. మిచిగాన్ మెరిట్ అవార్డు, నేషనల్ హానర్ సొసైటీ అవార్డు లాంటివెన్నో ఆమెను వరించాయి.

  మెదడు ప్రవర్తన మరియు సంజ్ఞాన శాస్త్రంలో పట్టభద్రురాలైన నీనా....2006లో మిస్ టీన్ అమెరికా పోటీల్లో రన్నరప్‌గా నిలిచింది. మిస్ అమెరికా పోటీల కోసం దాదాపు సంవత్సర కాలంగా కష్టపడ్డ నీనా....తను అనుకున్నది సాధించింది, మిస్ అమెరికా కిరీటం దక్కించుకుంది. స్లైడ్ షోలో నీనాకు సంబంధించిన మరిన్ని వివరాలు.

  నమ్మలేని క్షణాలు

  నమ్మలేని క్షణాలు

  నీనా దవులూరి మిస్ అమెరికా కిరీటం దక్కించుకున్న వెంటనే ఆనందం ఆపుకోలేకపోయింది. నమ్మలేని విజయం తన సొంతం కావడంతో ఆమె కళ్లు చెమర్చాయి.

  ఆనందంగా...

  ఆనందంగా...

  మిస్ అమెరికా కిరీటం గెలుచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పిన నీనా....ఆర్గనైజేషన్ చేసిన ఏర్పాట్లను ప్రశంసించింది.

  భారతీయ సంస్కృతి తెలిసిన అమ్మాయి

  భారతీయ సంస్కృతి తెలిసిన అమ్మాయి

  ఇండియాలో పుట్టి పెరగక పోయినా ఇక్కడి సంస్కృతి గురించి నీనాకు అవగాహన ఉంది. ఆమె భరతనాట్యం, కూచి పూడి కూడా నేర్చుకుంది.

  బాలీవుడ్ బాన్స్ నేర్చుకుంది.

  బాలీవుడ్ బాన్స్ నేర్చుకుంది.

  నీనా దవులూరి మిస్ అమెరికా పోటీల కోసం నృత్య దర్శకుడు నకుల్ దేవ్ మహాజన్ దగ్గర బాలీవుడ్ బాన్సులు నేర్చుకుంది.

  కాంపిటీషన్లో డాన్స్ ప్రదర్శన

  కాంపిటీషన్లో డాన్స్ ప్రదర్శన

  నీనా దవులూరి టాలెంట్ రౌండ్లో తను నేర్చుకున్న బాలీవుడ్ ఫుషన్ డాన్స్ ప్రదర్శించింది. కిరీటం గెలుచుకున్న తర్వాత నీనా మాట్లాడుతూ...మిస్ అమెరికా స్టేజీపై బాలీవుడ్ బాన్స్ ప్రదర్శించడం ఇదే తొలి సారి. ఇది నాకు మాత్రే కాదు, నా ఫ్యామిలీకి, ఇండియన్ కమ్యూనిటీకి గౌరవంగా భావిస్తున్నాను అని పేర్కొంది.

  తొలి ప్రవాస భారతీయురాలు

  తొలి ప్రవాస భారతీయురాలు

  మిస్ అమెరికా కిరీటం దక్కించుకున్న తొలి ప్రవాస భారతీయురాలుగా నీనా చరిత్ర సృష్టించింది. మిస్ న్యూయార్కు కిరీటం దక్కించుకున్న తొలి ప్రవాస భారతీయురాలు కూడా ఆమెనే...

  వైద్యుల ఫ్యామిలీ నుంచి

  వైద్యుల ఫ్యామిలీ నుంచి

  నీనా తండ్రి కోటేశ్వరరావు అమెరికాలో వైద్య వృత్తిలో ఉన్నారు. అదే విధంగా ఇండియాలో ఉండే నీనా బంధువులు కూడా వైద్య వృత్తిలోనే ఉన్నారు. నీనా కూడా భవిష్యత్‌లో కార్డియాలజిస్టు కావాలనే ఆశయంతో ఉంది.

  ప్రైజ్ మనీ చదువుల కోసమే..

  ప్రైజ్ మనీ చదువుల కోసమే..

  మిస్ అమెరికా కిరీటం దక్కించుకోవడంతో పాటు 50,000 అమెరికన్ డాలర్ల ఫ్రైజ్ మనీ కూడా ఆమె సొంతమైంది. ఈ డబ్బును తన ఉన్నత చదువుల కోసం వినియోగిస్తానని అంటోంది నీనా.

  నీనా ఫ్యామిలీ...

  నీనా ఫ్యామిలీ...

  మిస్ అమెరికా కాంపిటీషన్ సందర్భంగా నీనాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చేందుకు ఆమె ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు, స్నేహితులు, బంధువులు కూడా అట్లాంటిక్ సిటీకి వచ్చారు.

  నీనాపై జాత్యహంకార వ్యాఖ్యలు

  నీనాపై జాత్యహంకార వ్యాఖ్యలు

  మిస్ అమెరికా కిరీటం దక్కించుకున్న నీనా దవులూరిపై కొంత మంది అమెరికన్లు జాత్యహంకార వ్యాఖ్యలు చేసారు. ఆమె ఆల్ ఖైదా వ్యక్తిలా ఉందని, టెర్రరిస్టులా ఉందని వ్యాఖ్యానించారు. ఆమె భారతీయ సంతతికి చెందిన వ్యక్తి అనే వివక్షతోనే ఆమెపై సోషల్ మీడియాలో ఇలాంటి వ్యాఖ్యలు వెలువడ్డట్లు స్పష్టమవుతోంది.

  లైట్ తీసుకున్న నీనా

  లైట్ తీసుకున్న నీనా

  తనపై కొందరు జాత్యహంకార వ్యాఖ్యలు చేయడాన్ని నీనా లైట్ తీసుకుంది. వారి వ్యాఖ్యలు తాను పట్టించుకోనని....నేను అమెరికా పౌరురాలునని నీనా వెల్లడించింది.

  నీనా గ్రాండ్ మదర్ కోటేశ్వరమ్మ

  నీనా గ్రాండ్ మదర్ కోటేశ్వరమ్మ

  నీనా గ్రాండ్ కోటేశ్వరమ్మ చౌదరి విజయవాడలో మహిళా కళాశాలను నడుపుతున్నారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. తన మనవరాలుకి మిస్ అమెరికా కిరీటం దక్కడంపై కోటేశ్వరమ్మ ఆనందం వ్యక్తం చేసింది.

  గర్వంగా ఉందన్న కోటేశ్వరమ్మ

  గర్వంగా ఉందన్న కోటేశ్వరమ్మ

  తన మనవరాలుకి మిస్ అమెరికా కిరీటం దక్కడంపై కోటేశ్వరమ్మ మాట్లాడుతూ...‘ఇదొక గొప్ప విజయమని..గర్వంగా ఉందని, నీనా తన డ్రీమ్ నెరవేర్చుకున్నందుకు సంతోషంగా ఉంది' అని వ్యాఖ్యానించారు.

  నీనా గురించి ఆమె ఆంటీ

  నీనా గురించి ఆమె ఆంటీ

  నీనా గురించి ఆమె ఆంటీ శశిబాల మాట్లాడుతూ...నీనాను 6 వారాల వయసు ఉన్నపుడే కోటేశ్వరమ్మ విజయవాడ తీసుకొచ్చారు. రెండున్నర సంవత్సరాల వయసు వచ్చే వరకు పెంచారు. ఆ తర్వాత నీనాను వాళ్ల తల్లిదండ్రులు అమెరికా తీసుకుని వెళ్లారు. కానీ ప్రతి వేసవిలో నీనా ఇక్కడకు వస్తుంది అని వెల్లడించారు.

  తెలుగు సంస్కృతి అంటే నీనాకు ఇష్టం

  తెలుగు సంస్కృతి అంటే నీనాకు ఇష్టం

  వేసవి సెలవుల్లో విజయవాడ వచ్చినపుడు నీనా కూచిపూడి నేర్చుకుంది. అదే విధంగా ఆమె మంచి వెస్టర్న్ డాన్స్ కూడా. తెలుగు సినిమాలంటే కూడా ఆమెకు ఇష్టమే.

  సినిమా ఆలోచనలు లేవు

  సినిమా ఆలోచనలు లేవు

  మిస్ అమెరికా లాంటి అందాల పోటీల్లో విజేతగా నిలిచిన నీనాకు సినిమాల్లోకి వచ్చే ఆలోచన అస్సలు లేదని ఆమె సన్నిహితులు అంటున్నారు.

  English summary
  Everyone knows that Nina Davuluri has been crowned as Miss America in Atlantic City, New Jersey on September 15, 2013, but very few are aware that she is an Indian descendant. She was born to Telugu parents and has also spent few years in Vijayawada during her childhood. Even more interesting stuff is that she watches Telugu movies and she became a big fan of Rebel Star Prabhas after watching his performance in Varsham in 2007.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X