twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్ట్రైక్ కు ఎఫెక్టు ఎక్కువ పవన్ కళ్యాణ్ కే

    By Srikanya
    |

    ఈ నెల ఏడో తేదీ నుంచి కొత్త చిత్రాల ప్రారంభానికి అనుమతిని నిరాకరించాం. నటీనటుల సంఘంతోపాటు అన్ని వర్గాల నుంచి సానుకూలత వ్యక్తమైంది. అలాగే ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న సినిమాలు అక్టోబరు 31వ తేదీ లోపు పూర్తి చేసుకోవాలి. ఈ నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము అని దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షులు సి.కల్యాణ్ ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ డేట్ కు ఎఫెక్టు అయ్యే సినిమాలు పెద్ద లిస్టే ఉంది. అవి వెంకటేష్ బాడీగార్డు, ఎన్టీఆర్ ఊసరవిల్లి, రామ్ చరణ్ రచ్చ, సిద్దార్ద ఓహ్ మై ప్రెండ్, రాజమౌళి ఈగ, పవన్ కళ్యాణ్ కాళి, గబ్బర్ సింగ్, మహేష్ బాబు ది బిజెనెస్ మ్యాన్, నాగార్జున ఢమురకం. వీటిల్లో పవన్ కళ్యాణ్ చిత్రాలే రెండు ఉండటం గమనార్హం. స్క్రిప్టు పేరు చెప్పి గబ్బర్ సింగ్ ని చాలా కాలంగా వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇక కాళి చిత్రం దాదాపు పూర్తయ్యే స్జేజీలో ఉంది. స్టైక్ దెబ్బకు కాళి ఆగితే పవన్ కళ్యాణ్ చిత్రం బాగా లేటవుతుంది.

    ఇక స్ట్లైక్ కి కారణంగా ...''చలనచిత్ర కార్మికుల జీతభత్యాలను 30 శాతం వరకు పెంచేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ సమాఖ్య 50 నుంచి 100 శాతం వరకు పెంచాలని డిమాండ్‌ చేస్తోంది. కర్ణాటకలో 10 నుంచి 28 శాతం వరకు జీతాలు పెంచేందుకు కార్మికుల సంఘానికీ, నిర్మాతల మండoలికి మధ్య ఒప్పందం కుదిరింది. కానీ ఇక్కడ 30 శాతం వరకు ఇస్తామన్నా ఒప్పుకోవడం లేదు. దీనిపై నిర్మాతలందరూ మూడు రోజుల పాటు క్షుణ్నంగా చర్చించి ఓ నిర్ణయానికి వచ్చాం. ఆయన సోమవారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం ప్రకటించారు. అలాగే తాము ఎంత వెసులుబాటు కల్పించినా సమాఖ్య దిగిరావడం లేదన్నారు. వేతనాలను ముప్ఫై శాతం మేరకు పెంచేందుకు సిద్ధంగా ఉన్నా చలన చిత్ర కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) మరింత డిమాండ్‌ చేస్తోందన్నారు కళ్యాణ్, ఈ స్ట్రైక్ ఎంత కాలం కొనసాగుతుందో, ఎంత నష్టపోతుందో అని అంతా ఆలోచనలో పడుతున్నారు.

    English summary
    The last strike resulted in losses to the tune of 40 to 50 crore and if the current strike escalates one can imagine the losses. At this stage no one can predict when this issue will be solved or if it may further escalate into an issue that might bring work to a standstill.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X