»   »  అఖిల్ పై మిగతా హీరోల కామెంట్స్ (ఫొటో ఫీచర్)

అఖిల్ పై మిగతా హీరోల కామెంట్స్ (ఫొటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అఖిల్ హీరోగా తెరంగేట్రం చేయక ముందే అతనిపై అభిమానుల్లో బోలెడు ఆశలు అల్లుకుపోయాయి... రీసెంట్ గా మనం చిత్రంలో గెస్ట్ రోల్ లో కనిపించి అదరకొట్టాడు. అందుకే ఈ అక్కినేనివారి అబ్బాయి పూర్తి స్ధాయి హీరో అయితే చూడాలని అభిమానులు తహతహలాడుతున్నారు... క్రికెట్ లో అఖిల్ ఆటతీరులాగే, తెరపై కూడా అలరించే అభినయాన్ని ప్రదర్శిస్తాడని అక్కినేని ఫ్యాన్స్ విశ్వసిస్తున్నారు.

హీరోగా అఖిల్ అరంగేట్రం అదిరిపోతుందని అభిమానుల అభిలాష. అయితే అంతకు ముందే అక్కినేని వంశంలోని మూడుతరాల హీరోలు నటించిన 'మనం'లో ఈ బుల్లోడు కూడా కనిపించటంతో ఆ క్రేజ్ పీక్స్ కు చేరుకుంది. ఏయన్నార్ నటించిన చివరి చిత్రం కాబట్టి 'మనం'లో అఖిల్ కూడా పాలుపంచుకున్నారు.

ఏది ఏమైనా నెలలబాలుడిగానే 'సిసింద్రీ'లో మురిపించిన అఖిల్ ఇక హీరోగా ఎలాంటి మెరుపులు మెరిపిస్తాడో చూడాలని అక్కినేని అభిమానులే కాదు, ప్రేక్షకలోకం సైతం ఆసక్తిగా ఎదురుచూస్తోంది... తాత, తండ్రి ఇద్దరూ బాలనటులుగానూ నటించి, తరువాత స్టార్ హీరోస్ గా రాణించారు... అదే రూటులో అఖిల్ కూడా సాగుతాడని భావించవచ్చు.

'మనం' సినిమా క్త్లెమాక్స్‌లో అక్కినేని అఖిల్ ని చూసి చప్పట్లు కొట్టిన వారు అతని తదుపరి చిత్రం కోసం ఎదురు చూస్తూండటం సహజమే. తెలుగు తెరకు ఐదుగురు హీరోలను అందించిన కుటుంబం నుంచి వస్తున్నా తనకంటూ ప్రత్యేకత ఉండాలనుకొని తొమ్మిది నెలలుగా కథ కోసం వెతుకుతున్నాడు. నటనలోనూ, పోరాటాల్లోనూ, డ్యాన్సుల్లోనూ ఆరితేరుతున్నాడు. మరో ఇరవై రోజుల్లో తన తొలి సినిమా కబుర్లు చెప్తాను అంటున్నాడు అఖిల్‌.

'మనం' లో అఖిల్ ని చూసిన హీరోలు కామెంట్స్ స్లైడ్ షోలో ...

రామ్ చరణ్

రామ్ చరణ్

రామ్ చరణ్ ...మనంలో అఖిల్ ని చూసి ప్రశంశల్లో ముంచెత్తారు. అఖిల్ యు వర్ సూపర్బ్ అన్నారు

మంచు మనోజ్

మంచు మనోజ్


ఐ యామ్ ఎ ఫ్యాన్ ఆఫ్ అఖిల్ నౌ అంటున్నాడు మంచు మనోజ్

నితిన్

నితిన్


అఖిల్ మై బ్యూటీ...ఐ లవ్ యూ అని ట్వీట్ చేసారు నితిన్.

మహేష్ బాబు

మహేష్ బాబు


మహేష్ బాబు కూడా ఇదే రకమైన స్పందన తన ట్విట్టర్ ద్వారా వెలుబుచ్చారు. ‘ సినిమా చివర్లో అఖిల్ అతిథి పాత్రలో ఎంట్రీ ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ కుర్రాడి స్క్రీన్ ప్రజెన్స్ అద్భుతంగా ఉంది. భవిష్యత్‌లో స్టార్‌గా ఎదుగుతాడు' అంటూ మహేష్ బాబు ట్వీట్ చేసారు.

రెడీ అయ్యి వస్తున్నాడు

రెడీ అయ్యి వస్తున్నాడు

ఇక ఇప్పటికే నటనలో శిక్షణ పొందాను. థాయ్‌లాండ్‌లో తైక్వాండో శిక్షణ తీసుకున్నాను. రెండేళ్ల నుంచి డ్యాన్స్‌ తరగతుల్లో పాల్గొంటున్నాను. క్రికెట్‌ కూడా ఆడుతున్నాను. డ్యాన్స్‌, క్రికెట్‌ బాడీ స్వింగ్‌కు బాగా ఉపయోగపడతాయి. ఏం చేసినా పరిశ్రమలో అగ్రస్థానానికి చేరాలన్నదే నా కల. అందుకే కాస్త ఆలస్యమైనా అన్నింటా మేటిగా తయారై వస్తున్నాను అన్నారు.

English summary

 There were numerous speculations about Akhil’s launch pad film and several star directors were considered for it. Akkineni Akhil underwent training in acting, fights, dances and other areas required for a star hero.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu