»   » న్యూసెన్స్ కేసు లో తెలుగు హీరో... 50 రూ.ల ఫైన్

న్యూసెన్స్ కేసు లో తెలుగు హీరో... 50 రూ.ల ఫైన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాంపల్లి కోర్టు తెలుగు హీరో తనీష్ కు యాభై రూపాయల ఫైన్ వేసింది. ఆయన మీద ఓ న్యూసెన్స్ కేసు పెట్టడంతో ఇలా కోర్టుకు హాజరయ్యి...ఫైన్ కట్టాల్సి వచ్చింది. కేసు పూర్వాపరాల్లోకి వెళితే..

అక్టోబర్ 1, రాత్రి తొమ్మిది గంటలకు....వర్దమాన సినీ హీరో రైడ్, కోడిపుంజు ఫేం తనీష్ తన కారులో జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 45 లో ముందు వెళ్తున్న సురేష్ అనే స్కూటరిస్టును ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయాడు. దీంతో బాధితుడు కారును వెంబడించి జూబ్లీహిల్స్ చెక్ పోస్టులో అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

దాంతో వీరిద్దరికి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అప్పుడు తనీష్ ..త్రాగి ఉన్నాడని ఆరోపణ. ఈ నేఫధ్యంలో సురేష్ అతనిపై జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో న్యూసెన్స్ కేసు పెట్టారు. తర్వాత సురేష్ పై తనీష్ సైతం ఓ కేసుని ఫైల్ చేసారు. తర్వాత జూబ్లిహిల్స్ పోలీసులు వీరిద్దరిపై సెక్షన్ స 70(B) కేసు పెట్టడం జరిగింది. ఆ విధంగా నాంపల్లి కోర్టుకు తనీష్ హాజరయ్యారు. అప్పుడు కోర్టు 50 రూపాయల ఫైన్ వేసింది.

Tollywood Hero Tanish fined Rs 50

తనిష్ చిత్రాల విషయానికి వస్తే...

తనీష్‌, మోహిత జంటగా శ్రీ చీర్ల మూవీస్‌ రూపొందిస్తున్న సినిమా ఆ మధ్యన ప్రారంభోత్సవం జరిగింది. యశస్విని సమర్పిస్తున్నారు. సంజీవ్‌ మేగోటి దర్శకుడు. శ్రీనివాస యాదవ్‌ నిర్మాత. సంజీవ్‌ మేగోటి మాట్లాడుతూ ‘‘‘పౌరుషం' తర్వాత తెలుగులో నేను చేస్తున్న సినిమా ఇదే. ఈ చిత్రాన్ని కూడా తెలుగు, కన్నడలో తెరకెక్కిస్తాం. సైనికుడు సైన్యంలో ఉండాలి. సగటు మనిషి సంఘంలో ఉండాలి అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కే చిత్రమిది. తనీష్‌ డైలాగులు, స్టైల్‌ కొత్తగా ఉంటాయి. సాయికుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తారు'' అని చెప్పారు.

నిర్మాత మాట్లాడుతూ ‘‘వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న సినిమా ఇది'' అని అన్నారు. తనీష్‌ మాట్లాడుతూ ‘‘స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. హీరోగా కన్నా ఆర్టిస్ట్‌గా ఎక్కువ స్కోప్‌ ఉన్న సినిమా. దీన్ని ఓ చాలెంజ్‌గా తీసుకుని చేస్తున్నాను'' అని అన్నారు. మంచి పాత్రల్లో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని మోహిత, అజి జోసెఫ్‌, రాధాకృష్ణ, మిత్ర తదితరులు చెప్పారు.

English summary
Nampally Court on Monday imposed a fine of Rs 50 on Tollywood hero Tanish in connection with a nuisance case filed against him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu