»   » తలస్నానం బీరుతోనే, తాగకుండా ఎలా?: ఆనంది మాటలకు నోరెళ్ళబెట్టారట

తలస్నానం బీరుతోనే, తాగకుండా ఎలా?: ఆనంది మాటలకు నోరెళ్ళబెట్టారట

Posted By:
Subscribe to Filmibeat Telugu

బీర్ హెల్త్ డ్రింక్ అని ఆమధ్య ఒక మంత్రి గారు చెప్తే పాపం అంతా ఆడిపోసుకున్నారు గానీ. బీరులో పోషకాలు ఉన్నయనీ అవి తల వెంట్రుకలకు మంచిదనీ చెప్తోంది ఆనంది. (మర్చిపోయారా?) అప్పట్లో బస్‌స్టాప్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గాచేసి. ఇక్కన్నుంచి కోలీవుడ్ కి ఎగిరిపోయిన ఆనంది ఇప్పుడు అక్కడే ఎక్కువగా కొన సాగుతోంది. అయితే ఈ మధ్య ఆమె తలవెంట్రుకల ప్రస్తావన ఇక చిట్ చాట్లో వచ్చినప్పుడు చిన్న విషయం ఒకటి చెప్పి అందర్నీ కాసేపు షాక్ చేసింది ఆనది.

సహజంగా ఆనంది అందమైన అమ్మాయి. అయితే ఆమె జుట్టు ఆమెకంటే అందంగా ఉంటుందట. దానికి కారణం తన శిరోజాలకు బీరు అప్లై చేస్తానని చెబుతోంది. మొత్తానికి బీరును షాంపూలా చేసి కురులకు పట్టించడమేమిటా అని, ఈ కొత్త టెక్నిక్ ఏంటో అంటూ అందరూ ఆశ్చర్యపోయారు.

Tollywood Heroine Anandi Using Beer For Hair

తేరుకున్నాక జుట్టుకు పట్టించేటప్పుడు నోట్లో పడితే ఎలా? అని అడిగినప్పుడు. "అవును పోతే ఏమౌతుంది? తాగితే తప్పేం కాదుకదా? అంటూ ఎదురు ప్రశ్న వేసింది. దాదాపుగా ఈ రోజుల్లో బీరు తాగటం మరీ అంత తప్పుగా అనుకోకపోయినా ఇలా బయట కూడా చెప్పేయటం అక్కడ ఉన్న వాళ్లకి కాస్త షాకింగ్ గానే ఉందట.

అయినా బీరు కేవలం తాగేందుకేనని ఎవ్వరన్నారు. తాగొచ్చు.. వీలైతే స్నానం చేసుకోవచ్చు... ఈ అందాల సుందరి సెలవిచ్చినట్లు కురులకూ పూసుకోవచ్చు. ఎవరి ఆనందం వాళ్లది. అయితే నిజానికి ఆనంది చెప్పటం వింతగా మనకనిపించవచ్చుగానీ. ఇదీ ఒక రకం థెరపీనే. ఏమిటీ నమ్మకం లేదా?? అయితే ఒక్క సారి గూగుల్ వెతికి చూడండి కోకొల్లలు గా వీడియోలు కనిపిస్తాయి.

Sai Pallavi Give A Tough Competition To Tollywood Heroines
English summary
Tollywood Heroine anandi who playd a role as second lead women in Bus sTop movie says that she Using Beer For her Hair
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu