Just In
- 1 hr ago
సింగర్ సునీత పెళ్లిపై రోజా సంచలన వ్యాఖ్యలు: ఆమె పిల్లలు ఎందుకు ఒప్పుకున్నారంటూ ఘాటుగా!
- 1 hr ago
ప్రదీప్ మూవీ ప్రెస్మీట్లో అపశృతి: స్టేజ్‌పైనే కుప్పకూలిపోయిన డైరెక్టర్.. ఆయన పరిస్థితికి కారణమిదే!
- 11 hrs ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 12 hrs ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
Don't Miss!
- News
నిమ్మగడ్డకు ప్రాణభయం: ఆయనపై తక్షణ చర్యలు: డీజీపీ సవాంగ్‌కు లేఖ
- Finance
హైదరాబాద్ సహా ఆల్ టైమ్ గరిష్టానికి పెట్రోల్, డీజిల్ ధరలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు
- Automobiles
మీకు తెలుసా.. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ట్రైన్ కానుంది
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బ్రేకింగ్: ముంబైలో టాలీవుడ్ హీరోయిన్ అరెస్ట్.. డ్రగ్స్ కేసులో మరో సంచలనం
డ్రగ్స్ మాఫియాతో సినీ తారలకు ఉన్న లింకులపై మరోసారి ఎన్సీబీ పంజా విసిరింది. ముంబైలో టాలీవుడ్ హీరోయిన్‌ను అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. అయితే అరెస్ట్ అయిన హీరోయిన్ వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. హీరోయిన్‌ను ముంబైలోని మీరా రోడ్డులో అదుపులోకి తీసుకొన్నట్టు సమాచారం. ఈ అరెస్ట్ వివరాల్లోకి వెళితే...

బాంద్రా రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో
ముంబైలో ఎన్సీబీ అధికారులు తెలిపిన ప్రకారం.. బాంద్రా రైల్వే స్టేషన్‌లో జనవరి 2వ తేదీన డ్రగ్స్ సప్లయిర్ చాంద్ మహ్మద్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్నాం. అతడి వద్ద 400 గ్రాముల మెపెడ్రిన్ (ఎండీ) లభించింది వెల్లడించారు. అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా పలువురి సమాచారం లభించింది పేర్కొన్నారు.

భారీ మొత్తంలో డ్రగ్స్
తాజా అరెస్ట్‌లపై ఎన్సీబీ జోనల్ డైరె్టర్ సమీర్ వాంఖేడే స్పందించారు. పలువురిని అదుపులోకి తీసుకొన్నాం. వారి వద్ద నుంచి భారీ మొత్తంలో డగ్స్‌ను స్వాధీనం చేసుకొన్నాం. నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్‌స్టాన్స్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశాం అని సమీర్ వాంఖడే తెలిపారు.

టాలీవుడ్ హీరోయిన్‌ను అరెస్ట్ చేశాం
డ్రగ్స్ సప్లయిర్స్‌ను అరెస్ట్ చేసి విచారించగా కొందరు పేర్లు చెప్పారు. ఆ క్రమంలో మీరా రోడ్డులోని ఓ హోటల్ పరిసర ప్రాంతంలో తనిఖీలు నిర్వహించగా టాలీవుడ్ హీరోయిన్ వద్ద డ్రగ్స్ లభించాయి. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకొన్నది. మరో నిందితుడు సయీద్ కోసం గాలిస్తున్నాం అని అధికారులు తెలిపారు.

10 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం
ముంబైలోని వెర్సోవా, మీరా రోడ్డు శుక్రవారం నుంచి తనిఖీలు చేపడుతున్నాం. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశాం. వారి వద్ద 100 గ్రాములు మెఫెడ్రోన్ స్వాధీనం చేసుకొన్నాం. వాటి విలువ సుమారు 10 లక్షల రూపాయల వరకు ఉంటుంది. గత మూడు నెలల్లో మొత్తం 92 మందిని అరెస్ట్ చేశాం అని సమీర్ వాంఖడే తెలిపారు.