»   » పెళ్ళి నిజం కాదు కానీ, తల్లి కావటం నిజమేనట: రెజీనా కెసాండ్రా పాపని చూసారా?

పెళ్ళి నిజం కాదు కానీ, తల్లి కావటం నిజమేనట: రెజీనా కెసాండ్రా పాపని చూసారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా హీరోయిన్‌గా పేరున్న రెజీనాపై ఈ మధ్య విపరీతంగా వార్తలు వినిపిస్తున్నాయి. స్టార్ హీరోయిన్‌గా పేరు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా రెజీనాకి అది అందని ద్రాక్షగానే మారింది. స్టార్ పక్కన పెడితే అసలిప్పుడు రెజీనాకి అవకాశాలు రావడమే కష్టంగా ఉంది. అసలు ఇప్పుడున్న కాంపిటీషన్ లో మాములుగా అవకాశాలు పట్టుకోవటమే కష్టం అంటే ఇక అప్పుడప్పుడు మీరిసి ఇప్పటికే కాస్త పాతబడ్డ రెజీనా సంగతి ఇంకేం చెప్పగలం.

మెగా హీరోతో త్వరలో రెజీనా పెళ్లి

మెగా హీరోతో త్వరలో రెజీనా పెళ్లి

అప్పుడప్పుడు కొన్ని రూమర్లతో వార్తల్లో కనిపించింది. తాజాగా ఓ మెగా హీరోతో త్వరలో రెజీనా పెళ్లి అంటూ చాలా గట్టిగా వార్తలు వచ్చాయి అయితే తర్వాత ఆ వార్తలు గాలి కబుర్లే అంటూ ఖండించింది రెజీనా. ఆ తర్వాత కొద్దిరోజులకే ఎంగేజ్మెంట్ అనీ, ఆమె ప్రెగ్నెంట్ కూడా అనీ మళ్ళీ వార్తలు గుప్పుమన్నాయి.

ఉత్తుత్తి గర్భం

ఉత్తుత్తి గర్భం

ఆ తర్వాత ఆ ఉత్తుత్తి గర్భం ఎలావచ్చిందో తానే చెప్పేసింది కూడా ఇంత‌కీ విష‌య‌మేమిటంటే బెంగుళూరులో ఫ్రెండ్స్‌తో స‌ర‌దాగా ఒకసారి త‌న‌కు అర్ధ‌రాత్రి 12 గంట‌ల‌కు ల‌స్సీ తాగాల‌ని అనిపించింద‌ట‌. అప్పుడే క్లోజ్ చేస్తున్న ఒక షాప్ ద‌గ్గ‌రికి వెళ్లి ల‌స్సీ అడ‌గ‌డంతో హ‌డావిడిగా షాప్ మూస్తున్న ఓన‌ర్ ల‌స్సీ లేదు ఏమీ లేదు వెళ్లు అని చిరాకుగా చెప్పాడట‌.

నేను గ‌ర్భ‌వ‌తిని

నేను గ‌ర్భ‌వ‌తిని

వెంట‌నే రెజీనా నేను గ‌ర్భ‌వ‌తిని అని అబ‌ద్ధం ఆడేసి ల‌స్సీ ద‌క్కించుకుంద‌ట‌. ఆ విషయం కాస్తా బయటకు వచ్చి నిజంగానే ఆమె గర్భవతి అయ్యిందీ అంటూ వార్తలు రాసిపడేసారు. అయితే తాజాగా రెజీనా నిజంగానే తల్లయ్యింది ఆశ్చర్య పోకండి ఆమె గర్భం నిజంకాదు, ఆమెకు పెళ్ళీ అవలేదు ఇంతకీ సంగతేమిటంటే....

 దేవుడిచ్చిన బిడ్డ

దేవుడిచ్చిన బిడ్డ

తన ఇన్స్టాగ్రామ్ లో ఓ పాప ఫోటోని పోస్ట్ చేసి తనకు దేవుడిచ్చిన బిడ్డగా పేర్కొంది. ‘‘జోవెల్లీ డానియెల్‌ అనే ఈ దేవుడిచ్చిన పాపకి గాడ్ మదర్‌గా మారుతున్నందుకు చాలా ఎగ్జయిట్ అవుతున్నా. ఆమెకు మంచి తల్లిగా ఉండేందుకు ప్రయత్నిస్తా'' అని రెజీనా ఆ పొస్ట్ లొనే చెప్పేసింది.

ఇంకా ఏ క్లారిటీ ఇవ్వలేదు

ఇంకా ఏ క్లారిటీ ఇవ్వలేదు

రెజీనా పోస్ట్ చేసిన ఫోటోని చూసి ఆమె అభిమానులు ప్రశంసించడంతో పాటు పాప చాలా ముద్దుగా ఉందని కామెంట్‌లు చేస్తున్నారు. మొత్తానికి పుకార్లని నిజం చేస్తూ, దేవుని బిడ్డకు రెజీనా నిజంగానే తల్లయింది. అయితే ఈ పాపని తాను దత్తత తీసుకుందా లేక వేరే వాళ్ళ పాప రక్షణ భాధ్యతలు తాను తీసుకుందా అనే విషయం మీద మాత్రం ఇంకా ఏ క్లారిటీ ఇవ్వలేదు.

English summary
Regina Cassandra become an ”unwed mother.” No… this is not about surrogate motherhood! She has adopted a girl called Zoelle Daniel.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu