twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2012-వివాదమైన తెలుగు సినిమాలు (ఫోటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్: ఈ సంవత్సరం తెలుగు చిత్ర పరిశ్రమలో గతంలో కన్నా ఎక్కువ హిట్ సినిమాలు వచ్చాయని,కలెక్షన్స్ పెరిగాయని మురిసేలోగా వివాదాలతో అట్టుడిగే స్ధితికి చేరుకుంది. దాంతో తెలుగు సినిమా స్టామినా పెరుగుతోందని ఆనందించాలా లేక తెలుగు సినిమాలు వివాదాల లోతుల్లో రోజు రోజుకీ దిగిపోతున్నందుకు విచారించాలా అర్దంకాని డోలాయమాన స్థితిలో పరిశ్రమ చేరుకుంది. చిన్నా పెద్దా కలుపుకుని ఇప్పటిదాకా దాదాపు పదిహేను సినిమాలు దాకా మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుని కలెక్షన్ల పరంగా ఓకే అనిపించుకున్నాయి. మరో ఐదారు చిత్రాలు సేఫ్‌ జోన్‌లో ఫరవాలేదనిపించాయి. అయితే అదే రేంజిలో ఈ సంవత్సరం రేపిన వివాదాలకు కూడా కొదవేమీ లేదు. మళ్లీ సెన్సార్‌ రివెైజింగ్‌ చేయించాలని...అసలు సినిమాలే నిలిపేయాలని గొడవలు జరిగాయి.

    2012-వివాదమైన తెలుగు సినిమాలు (ఫోటో ఫీచర్)

    మహిళా టీచర్ల హుందాతనాన్ని దెబ్బతీసేదిగా, యువతను పక్కదారి పట్టించేదిగా ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటూ ‘సారీ టీచర్' చిత్రం వచ్చింది. ఈ చిత్రంపై మొదట రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. అయితే 'సారీ టీచర్'కు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చామని.. ఐదుగురు సభ్యులతో కూడిన బృందం దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిందని సెన్సార్ తెలిపింది. సినిమా మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నట్లు, మహిళా టీచర్ల హుందాతనాన్ని దెబ్బతీసేదిగా ఉందనడాన్ని, యువతను పక్కదారి పట్టించేదిగా ఉందన్న వాదనను సెన్సార్ బోర్డు కొట్టి పారేసింది. అయితే ఈ చిత్రం చట్టపరంగా వచ్చిన అన్ని అవరోధాలను తొలగించుకుని విడుదలైంది. సినిమా భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ముఖ్యంగా ఈ చిత్రం రిలీజ్ కు థియోటర్స్ దొరకకపోవటం తో చావు కొట్టినట్లైంది.

    Women In Brahmanisam

    చలం రచన ఆధారంగా రూపొందింది అని చెప్తున్న 'ఉమెన్ ఇన్ బ్రామ్మణిజం' చిత్రాన్ని నిషేధించాలని బ్రాహ్మణ వర్గాలు, మహిళా సంఘాలు పోరాడాయి. దాంతో ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ.. ఈ నెల ఐదో తేదీన చిత్రాన్ని వీక్షించింది. అందులో అసభ్యకరంగా ఉన్న దృశ్యాలపై తీవ్రంగా స్పందించింది. అశ్లీలత, అసభ్యత, శృంగారమే లక్ష్యంగా, ఒక కులాన్ని కించపరిచే సన్నివేశాలతో నిర్మించిన 'వుమెన్‌ ఇన్‌ బ్రామ్మనిజం' చిత్రాన్ని పూర్తిగా నిషేధించాలని నీలం సహాని నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ చిత్రం ప్రజాప్రదర్శనకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. అయితే ఈ చిత్రం నిర్మాతలు మళ్లీ కమిటీ నియామకం చెల్లదని హై కోర్టుకు వెళ్లారు.

     Cameraman Gangato Rambabu

    పవన్ కళ్యాణ్ 'కెమెరామన్ గంగతో రాంబాబు' లో తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే సన్నివేశాలున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తడంతోపాటు దర్శకుడు పూరీ జగన్నాథ్‌, నైజాంలో ఈ చిత్ర పంపిణీదారు దిల్‌రాజుల కార్యాలయాలపై దాడులు సైతం జరిగాయి. దాంతో ప్రభుత్వం కలగచేసుకుని కమిటీ వేసింది. కమిటీ వారు తెలియచేసిన కట్స్ ని దర్శక,నిర్మాతలు ఓకే చేయటంతో ఈ వివాదం వెంటనే సర్ధుమణిగింది. అయితే ఈ వివాదం సినిమా కలెక్షన్స్ పై మాత్రం ప్రభావం చూపలేకపోయింది.

    Denikaina Ready

    మంచు విష్ణు హీరోగా నటించిన 'దేనికైనా రెడీ' చిత్రంలో బ్రాహ్మణులను కించపరిచారంటూ వివాదం మొదలైంది. దాంతో ప్రభుత్వం ఓ ఉన్నతస్థాయి కమిటీ ని వేసింది. దేనికైనా రెడీ సినిమాలో 20 అభ్యంతరకర సన్నివేశాలను ప్రభుత్వం నియమించిన కమిటీ గుర్తించింది. ఈ రోజు నిర్మాత మోహన్‌బాబును కలిసి ప్రభుత్వ కమిటీ అభిప్రాయం తీసుకోనుంది. కమిటీని సవాల్‌ చేస్తూ హైకోర్టులో మోహన్‌బాబు పిటిషన్‌ దాఖలు చేశారు. సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ ఇచ్చాక ప్రభుత్వ జోక్యం సరికాదని మోహన్‌బాబు పిటిషన్‌లో పేర్కొన్నారు. మరో ప్రక్క సెన్సార్ సర్ఠిఫికేట్ రద్దు చేయాలంటూ హై కోర్టులో మరోకేసు మొదలైంది.

    Bus Stop

    'ఈ రోజుల్లో' ఫేమ్ మారుతి దర్శకత్వం లో రూపొందిన చిత్రం 'బస్‌స్టాప్‌'. 'లవర్స్‌ అడ్డా' అనేది ఉపశీర్షిక తో వచ్చిన ఈ చిత్రం విడడుల రోజే వివాదం అయ్యింది. విద్యార్థులను, యువతను తప్పుదోవ పట్టించేలా బస్‌స్టాప్‌ సినిమాలో సంభాషణలూ, దృశ్యాలూ ఉన్నాయని ఎస్‌ఎఫ్‌ఐ ఆరోపించింది. ఆ సంస్థ నగరంలోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వద్ద ఆ సినిమా ప్రదర్శిస్తున్న థియేటరు ఎదుట ధర్నా నిర్వహించింది. ఈ నేపధ్యంలో సెన్సార్‌ బోర్డు సభ్యురాలు సునీతచౌదరి స్పందిస్తూ... ఇది 'ఎ' సర్టిఫికేట్‌ చిత్రం. యూ, యూబైఎ అని ఇవ్వలేదే. కొందరు కావాలని సినిమాను అడ్డుకుంటున్నారు. ఈ సినిమాను నేనే సెన్సార్‌ చేశాను. పెద్దవారు కూడా చూసి ఆనందపడాలి కదా అని వివరించారు.

     Tupaki

    విజయ్‌ హీరోగా దీపావళి కానుకగా వచ్చిన చిత్రం 'తుపాకీ' . ముస్లిం సంఘం తీవ్రంగా ధ్వజమెత్తింది. మురుగదాస్‌ దర్శకత్వంలో విజయ్‌, కాజల్‌ అగర్వాల్‌ జంటగా నటించిన ఈ చిత్రం దీపావళి రోజున విడుదలైంది. ఇందులో తమ వారిని తీవ్రవాదులతో పోలుస్తూ కొన్ని సన్నివేశాలు ఉన్నాయని సదరు వర్గ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఇండియా నేషనల్‌ లీగ్‌ కట్చి ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం చెన్నై నీలాంగరైలో ఆందోళన చేపట్టారు.

    English summary
    
 
 Tollywood seems to be suddenly besieged by unending protests that are breaking out left right and centre as both big and small films earn the wrath of the public for a plethora of reasons ranging from caste, gender, religion and community.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X