twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అటకెక్కుతున్న అంచనాలు-బెంబేలెత్తిన సినీ రంగం!

    By Sindhu
    |

    రాజకీయాలకు సినిమాకు ముడిపెట్టవద్దని ఎంతో మంది ఎన్ని కబుర్లు చెప్పినా చిరంజీవి రాజకీయప్రవేశంతో సినీరంగంలో రాజకీయవేడి నెలకొంది. దానికి తోడు నేటి రాష్ట్ర ప్రభావం సినిమాపై ప్రబలంగా పడింది. తెలుగు సినిమారంగంలో షూటింగ్ ప్రారంభం రోజే విడుదల తేదీని ప్రకటించే సత్తా ఉన్న నిర్మాతలు సైతం ప్రస్తుతం పూర్తి భిన్నంగా కన్పిస్తున్నారు. ఒక్కోపారి సినిమా మధ్యలోనే నిర్మాతో, దర్శకుడో, హీరోనో, మారే పరిస్థితి నుంచి ఇప్పుడు తీసిన సినిమాలను విడుదలచేయగలమా?లేదా? అనే డైలమాలో పడిపోయారు.

    ప్రారంభోత్సవాలకు ఎవర్ని ఆహ్వానిస్తే ఎవరికి నెప్పికలుగుతుందనే దిశగా ఆలోచిస్తున్నారు. దాంతో కొత్త సినిమాలు ఊసేలేదు. దీనికంతటికి సమైక్యాంద్ర, తెలంగాణా సెగలు సినీపరిశ్రమపై పడడమేకారణం. చాలా వరకు స్తబ్ధతగా ఉన్నా 'కళ" అనేదానికి హద్దులులేవు. కళాకారుడికి కులం, మతం,ప్రాంతీయం లేదని 'సినీయర్ నిర్మాత ఢాక్టర్ డి రామానాయుడు లాంటివారు మినహా స్పందిచే సాహసం చేయడం లేదు. ఎక్కడి షూటింగ్‌లు అక్కడే... రోడ్లపై షూటింగ్‌చేయాలంటే భయం గెస్ట్‌హౌస్‌లో చిత్రించాలంటే అక్కడేం జరుగుతుందోననే టెన్షన్‌ అరకులో షూటింగ్‌లు నిలిపివేత.

    పోస్ట్‌ప్రొడక్షన్స్‌ జరిగే స్టూడియోలచుట్టూ పోలీసు రక్షణ నిన్నటి మొన్నటివరకు సరదాగా జోకులు, సెటైర్లు వేస్తూ షూటింగ్‌లో పాల్గొనే హాస్యనటులుకూడా ఎక్కడేమి సెటైర్‌వేస్తే తన షర్టు చిరుగుతుందనే బెరుకు టీ, కాఫీలు, టిఫిన్లు అందించే ప్రొడక్షన్‌ సిబ్బందికూడా ఠంఛనుగా తమపని తాము చేసుకుపోవడం.. మినహా.. ఒక్కమాట ఎక్కువా, తక్కువా లేకుండా ఒకరకమైన మౌనంలాంటి వాతావరణం సినీరంగాన్ని ఆవరించింది. మరోవైపు సినిమా ప్రమోషన్‌వైపు నిర్మాత దృష్టిసారించేందుకు బ్రేక్‌పడింది. విడుదలకావాల్సిన చిత్రాలు వాయిదా పడుతున్నాయి. నూతన సంవత్సర వేడుకలకు సన్నద్ధమయ్యే స్టార్‌నైట్‌ పరిస్థితి ప్రశ్నార్థకం. దీనికంతటికీ గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులే కారణం.

    ప్రజారాజ్యంపార్టీ అధినేత చిరంజీవి సమైక్యాంధ్ర వైపు మొగ్గు చూపడంతో తెలంగాణవాదులు వ్యతిరేకించి ఆర్య-2, మగధీర చిత్రాన్ని వరంగల్‌లో అడ్డుకునే ప్రయత్నాలు మొదలెట్టారు. మరోవైపు హైదరాబాద్‌లోని సినీప్లెక్స్‌లో సైతం పెద్ద సినిమాలు ప్రదర్శించకుండా నిలిపివేశారు. మరోవైపు నందమూరి హరికృష్ణకూడా అదే పంథాను వ్యక్తం చేయడంతో కోట్లు వెచ్చించి ఎన్‌.టి.ఆర్‌. జూనియర్‌తో సినిమా తీసిన వంశీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సినిమాలకు, రాజకీయాలకు ముడిపెట్టడం భావ్యంకాదని సినీ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నా రాజకీయ సంక్షభం వీటిపై పడింది. ఏది ఏమైనా ఇటువంటి క్లిష్టపరిస్థితిని సరిదిద్దే పనిని ప్రభుత్వమే చేపట్టాలని సినీవర్గాలు భావిస్తున్నాయి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X