»   » మజాగా టాలీవుడ్ మస్తి 2014

మజాగా టాలీవుడ్ మస్తి 2014

Posted By:
Subscribe to Filmibeat Telugu

డల్లాస్: అందరూ ఎదురుచూస్తున్నట్టుగా కొత్త సంవత్సరం దగ్గరికి రానే వచ్చింది. ఈ సందర్భంగా స్థానిక తెలుగువారిని అలరించడానికి, కొత్త సంత్సరానికి వినూత్నంగా స్వాగతం పలకడానికి భారి ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు యుఎస్ ఇండియా ఎంటర్ టైనమెంట్ గ్రూప్. స్థానిక గ్రేప్ వైన్ కన్వెన్షన్ సెంటర్లో డిసెంబర్ 31 రాత్రి, మొట్టమొదటి సారిగా "టాలీవుడ్ మస్తి - 2014" పేరిట ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో టాలీవుడ్ నుండి ఎందరో తారలు సందడి చేయనున్నారు. ఏస్ యాంకర్ ప్రదీప్ తన వ్యాఖ్యానంతో, హాస్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి శ్రోతలను అలరించనున్నారు. టాలీవుడ్ తారలు మధుశాలిని, ప్రియాబెనర్జీ, సౌమ్యా రాయ్ తమ హుషారైన నృత్యాలతో శ్రోతలను ఉర్రూతలూగించబోతున్నారు.

అదేవిధంగా ప్రముఖ గాయనీ గాయకులు రాహుల్, సాహితి తమ గాన మాధుర్యంతో , జోరైన పాటలతో కార్యక్రమంలో శ్రోతలకు వీనుల విందు చేయనున్నారు! స్థానిక యువత తమ నృత్యాలతో, కేరింతలతో కార్యక్రమానికి మరింత వన్నె చేకూర్చబోతున్నారు.

ఈ కార్యక్రమానికి టికెట్ ఖరీదు పెద్దవారికి కేవలం $65, 5 నుండి 15 సంవత్సరంలోపు పిల్లలకు $35. 5 సంవత్సరంలోపు పిల్లలకు ప్రవేశం ఉచితం, బేబీ సిట్టింగ్ సేవలు అందిస్తారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 31 సాయంకాలం 8 గంటలకు మొదలై జనవరి 1, ఉదయం 1 గంటకు ముగుస్తుంది. తమ బంధు మిత్ర కుటుంబ సమేతంగా నూతన సంత్సరానికి అత్యంత ఉత్సాహంగా స్వాగతం పలకడానికి ఈ కార్యక్రమానికి హాజరు కావలసిందిగా నిర్వాహకులు ఆహ్వానం పలుకుతున్నారు.

English summary
Tollywood Masti -2014 New Year Party which is going to be organized on 31st night in Dallas of USA.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu