»   » ఈ యుగానికి స్ఫూర్తిమంతుడు:నందమూరి బాలకృష్ణ

ఈ యుగానికి స్ఫూర్తిమంతుడు:నందమూరి బాలకృష్ణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

సత్యసాయిబాబా నిర్యాణం చెందారనే విషాదవాస్తవాన్ని అధికారికంగా ప్రకటించేసరికి విషణ్ణవదనులైపోయిన పలువురు తెలుగు చిత్ర ప్రముఖులు బాబాకు భక్తి పూర్వక నివాళులర్పించారు.వారు బాబా గురించి చెప్పిన మాటలు..

ఈ యుగానికి స్ఫూర్తిమంతుడు బాబా. ప్రజా క్షేమం కోసం ఆయన ఎన్నో చేశారు. హాస్పిటల్స్‌ ఏర్పాటు చేసి వైద్యం అందించారు. స్కూళ్లు పెట్టి విద్యను కూడా అందించారు. ఎన్నో జిల్లాల్లో ఆయన సేవాకార్యక్రమాలు కొన సాగుతున్నాయి. బాబాని ఆదర్శంగా తీసు కుని మనం కూడా మంచి కార్యక్ర మాలు చేపట్టాల్సిన అవసరం ఉంది-బాలకృష్ణ

పుణ్యపురుషులెవరయా విశ్వదాభిరామ వినురవేమ..అన్నట్లు మనుషుల్లో దేవుడు సత్యసాయి బాబా. గుక్కెడు నీళ్లు దొరకని కష్టస్థితిలో ఎంతోమందికి నీళ్లిచ్చిన మహానుభావుడు. ఆయన మరణించలేదు. తనువు చాలించారు -మోహన్‌ బాబు

ఏళ్లుగా బాబా భక్తురాలిని. ఆయన ప్రతి పుట్టినరోజుకు ప్రత్యేకంగా సందర్శి ంచి పూజా కార్యక్రమాలు చేసేదానిని. కలియుగ దైవం బాబా. ఆయన నేడు లేరని భావించట్లేదు. సత్యసాయి శరీరం మాత్రమే నిష్ర్కమించింది. బాబా మనతోనే ఉన్నారు-జమన

ఆయన చూపు ప్రసరిస్తే చాలు. అక్కడ కరుణ ప్రకా శిస్తుంది. ఆయన ఎదురుగా ఉంటే చాలు ..లోకానికి అంతా మేలే.....మనసంతా భక్తిపారవశ్యమే. మంచి గురించే ఎప్పుడూ ప్రబోధించేవారు బాబా. వారు సమాజం కోసం ఎంతో చేశారు. ఈ లోకాన్ని వీడి వెళ్లడం...అనేది జీర్ణించుకోలేని విషయం- సింగర్ సునీత

వీరితో పాటు ధట్స్ తెలుగు కూడా బాబా నిర్యాణానికి నివాళులు అర్పింస్తోంది.

English summary
Mohan Babu termed Sai Baba as a God among human beings. He is never dead; just he has left his body.The MAA president Murali Mohan expressed his deep shock over Babas departure. A number of film personalities are likely to reach Puttaparthi to pay their tributes to the departed spiritual leader during the two days of state mourning.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu