»   » జాతీయ పురస్కారాల్లో టాలీవుడ్: మెగాస్టార్ ని డీకొంటున్న చిన్న సినిమాలు

జాతీయ పురస్కారాల్లో టాలీవుడ్: మెగాస్టార్ ని డీకొంటున్న చిన్న సినిమాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

64వ జాతీయ చలనచిత్ర పురస్కారాల కు సమయం దగ్గర పడుతోంది. . దేశంలోనే అత్యుత్తమ సినిమా అవార్డ్స్ అయిన జాతీయ పురస్కారాలకు.. ఈ ఏడాది తెలుగు సినిమాలు నాలుగు సిద్దంగా ఉన్నాయి. 63వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ చిత్రంగా అవార్డ్ కైవసం చేసుకుని.. తెలుగు సినిమాల సత్తాని జాతీయ స్థాయిలో చాటిన చిత్రం 'బాహుబలి పార్ట్ వన్. అదే స్పూర్తితో ఈ ఏడాది కూడా సుమారు 16 తెలుగు సినిమాలు.. జాతీయ పురస్కారాల పోటీలకు వెళ్లాయి. ఆవివరాలు....

 16 సినిమాల్లో

16 సినిమాల్లో

జాతీయ పురస్కారాల కోసం పోటీపడ్డ 16 సినిమాల్లోనూ ఫైనల్ గా నాలుగు సినిమాలు అవార్డుల రేసులో నిలబడ్డాయి. ఈ సంవత్సరానికి గానూ (2016) చిరంజీవి రీ-ఎంట్రీ మూవీగా రూపొందిన 'ఖైదీ నంబర్ 150'కూడా ఉంది. తమిళంలో 'కత్తి' చిత్రానికి రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాకు గత ఏడాదే సెన్సార్ పూర్తవ్వడంతో ఈ సినిమా కూడా 2016 సినిమాలలో ఒకటిగా నిలబడింది.

 స్ట్రైట్ సినిమా కాదు

స్ట్రైట్ సినిమా కాదు

రైతు సమస్యల కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం కాబట్టి ఈ సినిమాని కూడా జాతీయ చలన చిత్ర పురస్కారాలకు పంపించారు... అయితే ఈ సినిమా స్ట్రైట్ సినిమా కాదు. కత్తి అనే తమిళ సినిమా కి రీమేక్ కాబట్టి.. ఉత్తమ చలన చిత్రం కేటగిరీలో కాకుండా.. మిగతా కేటగిరీల్లో పోటీలో ఉంది. మరి.. పాటలు, ఫైట్స్ పరంగా దుమ్మురేపిన 'ఖైదీ నంబర్ 150'కి.. ఈ విభాగాల్లో ఏమైనా అవార్డ్స్ వచ్చే అవకాశం ఉంది.

శతమానం భవతి

శతమానం భవతి

ఇక ఖైదీ తో పాటుగానే సంక్రాంతికి రెండు పెద్ద సినిమాల మధ్య చిన్న చిత్రంగా వచ్చి.. సూపర్ హిట్ సాధించిన సినిమా 'శతమానం భవతి'. శర్వానంద్ కథానాయకుడిగా వేగేశ్న సతీష్ రూపొందించిన ఈ చిత్రం కూడా గత ఏడాదే సెన్సార్ పూర్తి చేసుకుంది. నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని కూడా జాతీయ పురస్కారాలకు పంపించాడు. ఈ కుటుంబ కథా చిత్రం ఉత్తమ చలన చిత్రాల రేసులో నిలిచింది.

పెళ్లి చూపులు

పెళ్లి చూపులు

ఇక ఇవి పక్కన పెడితే ఈ ఏడాది ప్రకటించే జాతీయ ఉత్తమ చలన చిత్ర పురస్కారాల పోటీలో 'పెళ్లి చూపులు' సినిమా కూడా ఉంది. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా తక్కువ బడ్జెట్‌లో తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమాను. రాజ్ కందుకూరి నిర్మించాడు. ప్రస్తుతం ఈ సినిమా పలు భాషల్లో రీమేక్ అవుతోంది.

మనలో ఒక్కడు

మనలో ఒక్కడు

64వ జాతీయ చలన చిత్ర పురస్కారాల రేసులో ఆర్.పి. పట్నాయక్ రూపొందించిన 'మనలో ఒక్కడు' సినిమా కూడా ఉంది. మెసేజ్ ఒరియెంటెడ్ కథాంశంతో పట్నాయక్ తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. మొత్తంమీద.. 64వ జాతీయ చలన చిత్ర పురస్కారాల పోటీలో.. ఉత్తమ చిత్రం కేటగిరీలో. 'శతమానం భవతి', 'పెళ్లిచూపులు', 'మనలో ఒక్కడు' సినిమాలు పోటీపడుతున్నాయి.

స్ట్రైట్ సినిమా కాదు

స్ట్రైట్ సినిమా కాదు

స్ట్రైట్ సినిమా కాదు కాబట్టి మిగిలిన కేటగిరీల్లో చిరంజీవి 'ఖైదీ నంబర్ 150' అవార్డుల రేసులో ఉంది. మరి ఈ సారి ఏ ఏ సినిమాలు జాతీయ స్థాయిలో టాలీవుడ్ ని మెరిపిస్తాయో చూడాల్సిందే. మొత్తానికి ఈ సంవత్సరం రెండు అవార్దులు రావటం ఖాయం అన్నమాట. ఖైదీ అయితే పక్కా అన్న న్యూస్ వినిపిస్తోంది మరి.

English summary
The Low budget Movies which are bagged big hits for the year of 2016 from Tollywood are in Race for National best movie Award.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu