»   » టాలీవుడ్ నెంబర్ వన్ హీరో రవితేజనా!?

టాలీవుడ్ నెంబర్ వన్ హీరో రవితేజనా!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

గత సంవత్సరం 'కిక్" ఇచ్చిన విజయంతో ఉన్న రవితేజకు ఈ సంవత్సరం మంచి సినిమాలు ఆహ్వానం పలికాయి. ప్రస్తుతం ఆయన చేస్తున్న మూడు సినిమాలు రెడీ అవుతున్నాయి. ఈ మూడు చిత్రాలు కూడ వేరే హీరోలు చేయాల్సినవి కావడం విశేషం.

గోపిచంద్ హీరోగా చేయాలనుకున్న 'డాన్ శీను" చిత్రం చివరికి రవితేజ చేతుల లోనికి వచ్చేసింది. ఈ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభమైంది. అలాగే గతంలో పవన్ వదులుకున్న 'ఇడియట్" చిత్రంతో మంచి స్టార్ ఇమేజ్ సాధించుకున్న రవితేజ మరొక్కసారి పవన్ వదులుకున్న చిత్రంను చేజిక్కించుకున్నాడు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఈ చిత్రానికి నిర్మాత నటుడు గణేష్ అని ఊహాగానాలు వస్తున్నాయి. ఇక మూడవ చిత్రం బాలకృష్ణ హీరోగా బెల్లం కొండ నిర్మించాలనుకున్న 'భీష్మ" చిత్రాన్ని కొన్ని మార్పులు చేసి రవితేజతో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి టైటిల్ గా 'వీర" ను డిసైడ్ చేస్తూ పోస్టర్లు కూడా విడుదల చేశారు.

ఇతర హీరోలు వదిలేసిన చిత్రాలు తనకు మంచి పేరు తెచ్చిపెడతాయని నమ్ముతున్న రవితేజ, ఈ చిత్రాలతో టాలీవుడ్ నెంబర్ వన్ స్థానం కోసం పోటీ పడాలనే ఆలోచనలో ఉన్నాడట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu