»   » సినిమాలో మంచితనం ఎక్కువైతే అంతే: సాయి కొర్రపాటి

సినిమాలో మంచితనం ఎక్కువైతే అంతే: సాయి కొర్రపాటి

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొన్ని సినిమాలంతే..! అద్బుతం అన్న టాక్ తెచ్చుకుంటాయి గానీ డబ్బులు సంపాదించటం లో మాత్రం బాగా వెనకబడి పోతాయి. నేషనల్ అవార్డ్ సినిమాల్లో ఈ విషయం మనకు అర్థమౌతూనే ఉంటుంది. మంచి సినిమా తీస్తున్నాం అంటే డబ్బులు ఆశించటం లేదు అని నిర్మాతలు ముందే ఫిక్సవ్వాలి. ఆ కోవకు చెందిందే గత ఏడాది వచ్చిన "మనమంతా"

దాదాపు ప్రతీ వారూ ఒక్క మైనస్ కూడ చూపించకుండా మెచ్చుకున్న సినిమా ఇది. టాలీవుడ్ ప్రముఖులు కూడా ఇదొక అద్బుతమైన సినిమా అంటూ కితాబులిచ్చారు. అద్బుతమైన సినిమాల్లో ఇదీ ఒకటని అంతా మెచ్చుకున్నారు. కానీ..! థియేటర్ల వద్దమాత్రం పాపం నిరాత సాయి కొర్రపాటికి చుక్కెదురయ్యింది... టాక్ బావున్నా కలెక్షన్లు మాత్రం అస్సలు లేక సినిమా నష్టాన్నే మిగిలించింది. మంచి సినిమా తీసాడు అన్న పేరు తప్ప నిర్మాతకి ఒరిగిందేమీ లేదు... ఇదే విషయాన్ని గురించి ఈ మధ్య చెప్పుకొచ్చారు సాయి కొర్రపాటి...


Tollywood Producer Sai Korrapati reveals How Manamantha failed

ఈ సినిమా ఆడకపోవడానికి కారణాలు చెబుతూ.. ''మా ప్రయత్నం మేం చేశాం. సినిమాలో మంచి తనం మరీ ఎక్కువైపోయినా జనం చూడరేమో అనిపించింది. ఆ సినిమాలో మరీ అతి మంచితనం ఉందేమో అనిపించింది. ఎందుకంటే చూసిన వాళ్లెవ్వరూ కూడా 'మనమంతా' బాగా లేదని అనలేదు. కానీ చూడాల్సినంత మంది చూడలేదు.


అంటే ఏదో తేడా ఉందనే అనుకోవాల్సి వచ్చింది'' అని సాయి కొర్రపాటి అన్నారు. ఇక గత శుక్రవారం తన బేనర్ నుంచి విడుదలైన 'రెండు రెళ్ళు ఆరు'కు కూడా తాము ఆశించిన స్పందన రాలేదని సాయి చెప్పారు. అది మంచి సినిమా అవుతుందని అనుకున్నానని.. చూసిన వాళ్లు బాగానే ఉందన్నప్పటికీ స్టార్ కాస్ట్ సరిపోలేదని అంటున్నారని.. అందు వల్ల కొంచెం ఇబ్బందిగానే ఉందని సాయి అన్నారు.


English summary
Producer Sai Korrapati of Varaahi Chalanachitram banner had a tragic result with last release Manamantha. Though movie was opened to exceptional reviews, the same wasn’t reflected at ticket windows.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu