»   » టాలీవుడ్ క్వీన్ తమన్నా భాటియా.. ఎట్టకేలకు మళ్లీ అవకాశం..

టాలీవుడ్ క్వీన్ తమన్నా భాటియా.. ఎట్టకేలకు మళ్లీ అవకాశం..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌లో క్వీన్ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రంలో నటించిన కంగనా రనౌత్‌ నటనకు ప్రేక్షకుల ఫిదా అయ్యారు. అంతేకాకుండా ఆమెను అవార్డులు వెతక్కుంటూ వచ్చారు. అంతటి రికార్డు సాధించిన చిత్రాన్ని దాదాపు నాలుగేళ్ల తర్వాత తెలుగులో స్వీకారం చుట్టారు. టాలీవుడ్‌లో క్వీన్‌గా మిల్కీ బ్యూటి తమన్నా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది.

అమాయక యువతి పాత్రలో..

అమాయక యువతి పాత్రలో..

మ్యారేజ్ బ్రేకప్‌తో మనస్తాపం చెందిన యువతి.. దానిని నుంచి బయటపడటానికి వరల్డ్ టూర్ వెళ్తుంది. ఆ క్రమంలో ఆమె ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నది. చివరకు పెళ్లి విషయంలో ఏమి జరిగింది అనేది క్వీన్ క్లైమాక్స్. అమాయకమైన యువతి పాత్రలో తమన్నా కనిపించనున్నది. ఈ చిత్రంలో తమన్నా ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో వేచి చూడాల్సిందే.

 నీలకంఠ దర్శకత్ంలో..

నీలకంఠ దర్శకత్ంలో..

టాలీవుడ్ క్వీన్ చిత్రానికి షో, మిస్సమ్మ చిత్రాల దర్శకుడు నీలకంఠ డైరెక్టర్. ఈ చిత్రాన్ని మనుకుమారన్ నిర్మిస్తున్నారు. మేడియెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్ర ఓపెనింగ్‌కు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

తమిళంలో మిల్కీ బ్యూటీకి చేదు అనుభవం

తమిళంలో మిల్కీ బ్యూటీకి చేదు అనుభవం

ఇదిలా ఉంటే.. వాస్తవానికి తమిళ క్వీన్ రీమేక్‌లో తమన్నానే అనుకొన్నారు. అయితే ఏవో కారణాలపై తమన్నాను తప్పించి ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్‌ను తీసుకొన్నారు. హీరోయిన్ మార్పిడిపై అనేక ఊహాగానాలు వినిపించాయి.

టాలీవుడ్ మళ్లీ వెతుక్కుంటూ..

టాలీవుడ్ మళ్లీ వెతుక్కుంటూ..

తమిళంలో క్వీన్ నుంచి తప్పించడంతో తమన్నా మనస్తాపానికి గురైనట్టు వార్తలు వచ్చాయి. అయితే తెలుగు రూపంలో మళ్లీ క్వీన్ చెంతకు చేరడంతో తమన్నా ఆనందంలో మునిగిపోయినట్టు తెలుస్తున్నది.

English summary
"Queen" Telugu remake launched in prasad labs. Tamannaah in lead role. Neelakanta (Missamma, Show director) to direct this project. And Manu Kumaran to produce this film under Mediente films banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu